ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

Face ID ఉన్న iPhone మోడళ్ల కోసం జెశ్చర్స్‌ను తెలుసుకోండి

Face ID ఉన్న iPhoneతో ఇంటరాక్ట్ చేయడానికి మీరు ఉపయోగించే జెశ్చర్స్‌కు సంబంధించిన సులభమైన సూచన ఇక్కడ ఉంది.

జెశ్చర్

వివరణ

దిగువ నుండి పైకి స్వైప్ చేయడాన్ని సూచించే బాణం గుర్తు ఉన్న iPhone ఇలస్ట్రేషన్.

హోమ్‌కు వెళ్లండి ఏ సమయంలోనైనా హోమ్ స్క్రీన్‌కు తిరిగి రావడానికి స్క్రీన్ దిగువ అంచు నుండి పైకి స్వైప్ చేయండి. iPhoneలో యాప్‌లను తెరవడం చూడండి.

ఎగువ-కుడి మూల నుండి కిందికి స్వైప్ చేయడాన్ని సూచించే బాణం గుర్తు ఉన్న iPhone ఇలస్ట్రేషన్.

కంట్రోల్‌లను త్వరితంగా యాక్సెస్ చేయండి. కంట్రోల్ సెంటర్‌ను తెరవడానికి ఎగువ-కుడి మూల నుండి కిందికి స్వైప్ చేయండి; మరిన్ని ఎంపికలను చూపడానికి కంట్రోల్‌ను టచ్ చేసి ఉంచండి. కంట్రోల్‌లను జోడించడానికి లేదా తొలగించడానికి సెట్టింగ్స్  > కంట్రోల్ సెంటర్‌కు వెళ్లండి. iPhoneలో కంట్రోల్ సెంటర్‌ను ఉపయోగించి, కస్టమైజ్ చేయడం చూడండి.

iPhone ఇలస్ట్రేషన్. డాట్‌తో ముగిసే లైన్, స్క్రీన్ దిగువ నుండి పైకి డ్రాగ్ చేసి, ఆపై పాజ్ చేయాలని సూచిస్తుంది.

యాప్ స్విచ్చర్‌ను తెరవండి. దిగువ అంచు నుండి పైకి స్వైప్ చేయండి, స్క్రీన్ మధ్యలో పాజ్ చేయండి, ఆపై మీ వేలిని పైకి ఎత్తండి. తెరిచిన యాప్‌లను బ్రౌజ్ చేయడానికి, కుడివైపు స్వైప్ చేయండి, ఆపై మీరు ఉపయోగించాలనుకుంటున్న యాప్‌పై ట్యాప్ చేయండి. iPhoneలో తెరిచిన యాప్‌ల మధ్య మారడం చూడండి.

iPhone ఇలస్ట్రేషన్. రెండు వైపులా సూచిస్తున్న బాణం గుర్తు స్క్రీన్ దిగువ అంచుపై ఎడమ లేదా కుడివైపు స్వైప్ చేయడాన్ని సూచిస్తుంది.

తెరిచిన యాప్‌ల మధ్య మారండి. తెరిచిన యాప్‌ల మధ్య త్వరగా మారడానికి స్క్రీన్ దిగువ అంచున కుడివైపు లేదా ఎడమ వైపు స్వైప్ చేయండి. iPhoneలో తెరిచిన యాప్‌ల మధ్య మారడం చూడండి.

ఎగువ కుడి వైపున ఉన్న సైడ్ బటన్ వైపు చూపుతున్న బాణం గుర్తు ఉన్న iPhone ఇలస్ట్రేషన్.

Siriని ఉపయోగించండి. “Siri” లేదా “Hey Siri” అని చెప్పండి లేదా మీరు ప్రశ్నను ఆడుతున్నప్పుడు లేదా అభ్యర్థన చేస్తున్నప్పుడు సైడ్ బటన్‌ను నొక్కి ఉంచండి. Siriని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి అనే ఆర్టికల్ చూడండి.

ఎగువ కుడి వైపున ఉన్న సైడ్ బటన్‌పై డబల్-క్లిక్ చేయడాన్ని సూచించే రెండు బాణం గుర్తులు ఉన్న iPhone ఇలస్ట్రేషన్.

Apple Pay ఉపయోగించండి. Apple Pay కోసం మీ డిఫాల్ట్ కార్డ్‌ను డిస్‌ప్లే చేయడానికి సైడ్ బటన్‌ను డబల్-క్లిక్ చేసి, ఆపై Face IDతో ప్రామాణీకరించడానికి iPhone వైపు చూడండి. iPhoneలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం Apple Payను ఉపయోగించడం చూడండి.

ఎగువ కుడి వైపున ఉన్న సైడ్ బటన్‌పై ట్రిపల్-క్లిక్ చేయడాన్ని సూచించే మూడు బాణం గుర్తులు ఉన్న iPhone ఇలస్ట్రేషన్

సౌలభ్య సాధనాల షార్ట్‌కట్‌ను ఉపయోగించండి. సైడ్ బటన్‌ను ట్రిపల్-క్లిక్ చేయండి. iPhoneలో సౌలభ్య సాధనాల ఫీచర్‌లను త్వరగా ఆన్ లేదా ఆఫ్ చేయడం చూడండి.

ఎగువ కుడి వైపు సైడ్ బటన్, ఎగువ ఎడమ వైపు వాల్యూమ్ అప్ బటన్ వైపు చూపుతున్న బాణం గుర్తులు ఉన్న iPhone ఇలస్ట్రేషన్.

స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఒకేసారి సైడ్ బటన్‌ను, వాల్యూమ్ అప్ బటన్‌ను నొక్కి త్వరగా విడుదల చేయండి. Face ID ఉన్న iPhoneతో స్క్రీన్‌షాట్ తీయడం చూడండి.

ఎగువ కుడి వైపు సైడ్ బటన్, ఎడమ వైపు వాల్యూమ్ అప్ బటన్ వైపు చూపుతున్న బాణం గుర్తులు ఉన్న iPhone ఇలస్ట్రేషన్.

ఎమర్జెన్సీ SOS ఉపయోగించండి (భారతదేశం మినహా అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో). స్లైడర్‌లు కనిపించే వరకు, ఎమర్జెన్సీ SOSలో కౌంట్‌డౌన్ ముగిసే వరకు సైడ్ బటన్, ఏదో ఒక వాల్యూమ్ బటన్‌లను ఏకకాలంలో నొక్కి ఉంచండి, ఆపై బటన్‌లను విడిచి పెట్టండి. ఎమర్జెన్సీ సర్వీస్‌లకు (భారతదేశం మినహా అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో) త్వరగా కాల్ చేయడం చూడండి.

ఎగువ కుడి వైపున ఉన్న సైడ్ బటన్‌పై ట్రిపల్- క్లిక్ చేయడాన్ని సూచించే బాణం గుర్తు ఉన్న iPhone ఇలస్ట్రేషన్.

ఎమర్జెన్సీ SOSను ఉపయోగించండి (భారతదేశంలో). స్లైడర్‌లు కనిపించే వరకు, ఎమర్జెన్సీ SOSలో కౌంట్‌డౌన్ ముగిసే వరకు సైడ్ బటన్‌ను 3 సార్లు త్వరితంగా నొక్కండి.

మీరు సౌలభ్య సాధనాల షార్ట్‌కట్‌ను ఆన్ చేస్తే, స్లైడర్‌లు కనిపించే వరకు, ఎమర్జెన్సీ SOSలో కౌంట్‌డౌన్ ముగిసే వరకు సైడ్ బటన్, ఏదో ఒక వాల్యూమ్ బటన్‌ను ఏకకాలంలో నొక్కండి, ఆపై బటన్‌లను విడిచి పెట్టండి.

ఎమర్జెన్సీ సర్వీస్‌లకు (భారతదేశంలో) త్వరగా కాల్ చేయడం చూడండి.

ఎగువ కుడి వైపు సైడ్ బటన్, ఎడమ వైపు వాల్యూమ్ అప్ బటన్ వైపు చూపుతున్న బాణం గుర్తులు ఉన్న iPhone ఇలస్ట్రేషన్.

ఆఫ్ చేయండి. స్లైడర్‌లు కనిపించే వరకు సైడ్ బటన్, ఏదో ఒక వాల్యూమ్ బటన్‌ను ఏకకాలంలో నొక్కి ఉంచండి, ఆపై పవర్ ఆఫ్ చేయడానికి ఎగువ స్లైడర్‌ను డ్రాగ్ చేయండి. సెట్టింగ్స్ > సాధారణం > షట్ డౌన్‌కు వెళ్లండి. iPhoneను ఆఫ్ చేయడం చూడండి.

ఎగువ కుడి వైపున సైడ్ బటన్, ఎగువ ఎడమ వైపున వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్‌లను సూచించే బాణం గుర్తులతో ఉన్న iPhone ఇలస్ట్రేషన్.

నిర్బంధంగా రీస్టార్ట్ చేయండి. వాల్యూమ్ అప్ బటన్‌ను నొక్కి, విడిచిపెట్టండి, వాల్యూమ్ డౌన్ బటన్‌ను నొక్కి, విడిచిపెట్టండి, ఆపై Apple లోగో కనిపించే వరకు సైడ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి. iPhoneను నిర్బంధంగా రీస్టార్ట్ చేయండి చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.