ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో ‘హోమ్’ గురించి పరిచయం

మీరు లైట్‌లు, లాక్‌లు, థర్మోస్టాట్‌ల వంటి HomeKit మరియు మ్యాటర్-ఎనేబల్ చేసిన యాక్సెసరీలను సురక్షితంగా జోడించడానికి, కంట్రోల్ చేయడానికి, అలాగే వాటిని ఆటోమేట్ చేయడానికి ‘హోమ్’ యాప్‌ని ఉపయోగించవచ్చు. మీరు HomeKit సురక్షిత వీడియోకు మద్దతు ఇచ్చే భద్రతా కెమెరాలను సెటప్ చేసినప్పుడు, మీరు వీడియోను క్యాప్చర్ చేయవచ్చు, అలాగే కెమెరా ఎవరినైనా గుర్తించినప్పుడు లేదా డోర్ వద్ద ప్యాకేజీని ఉంచినప్పుడు నోటిఫికేషన్‌ను అందుకోవచ్చు. మీరు హోమ్ కీతో అనుకూల లాక్‌ను కూడా తెరవవచ్చు, ఒకే ఆడియోను ప్లే చేయడానికి పలు స్పీకర్‌లను గ్రూప్‌గా చేయవచ్చు, అలాగే మద్దతు ఉన్న డివైజ్‌లలో ఇంటర్‌కామ్ సందేశాలను పంపవచ్చు, అందుకోవచ్చు.

నిర్దిష్ట సమయాల్లో ఆటోమేటిక్‌గా రన్ చేయడానికి, లేదా మీరు నిర్దిష్ట యాక్సెసరీని యాక్టివేట్ చేసినప్పుడు (ఉదాహరణకు, మీరు ముందు డోర్‌ను అన్‌లాక్ చేసినప్పుడు) ఆటోమేషన్‌లను సృష్టించవచ్చు. మీరు Apple TV 4K లేదా HomePod స్పీకర్‌ల వంటి హోమ్ హబ్ సహాయంతో మీ హోమ్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు. ఇది మీరు, మీరు ఆహ్వానించే ఇతరులు, మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటిని సురక్షితంగా కంట్రోల్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

నోట్: మ్యాటర్-ఎనేబల్ చేసిన యాక్సెసరీలకు HomePod స్పీకర్ లేదా Apple TV 4K వంటి హోమ్ హబ్ అవసరం. థ్రెడ్ ఆధారిత యాక్సెసరీలకు Apple TV 4K , HomePod (2వ జనరేషన్), HomePod మినీ లేదా అనుకూల థర్డ్ పార్టీ థ్రెడ్ బోర్డర్ రౌటర్ వంటి థ్రెడ్ ఎనేబల్ చేసిన హోమ్ హబ్ అవసరం. థ్రెడ్-ఎనేబల్ చేయబడిన iPhone డివైజ్‌లు స్థానికంగా థ్రెడ్ యాక్సెసరీలను పెయిర్ చేసి, నిర్వహించగలుగుతాయి, వీటికి యాక్సెసరీ తయారీదారు నుండి అప్‌డేట్ అవసరం కావచ్చు.

హోమ్ ఓవర్‌వ్యూ

మీ యాక్సెసరీలను సులభంగా నావిగేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి హోమ్ యాప్ మీకు వీలు కల్పిస్తుంది. హోమ్ యాప్‌లో, దిగువన పేర్కొన్న విభాగాలను చూడటానికి హోమ్ ట్యాబ్‌ను ట్యాప్ చేయండి:

  • విభాగాలు: రూమ్ ఆధారంగా ఏర్పాటు చేసిన అన్ని సంబంధిత యాక్సెసరీలను ఒకే స్క్రీన్‌పై చూడటానికి, వాతావరణం, లైట్‌లు, భద్రత, స్పీకర్‌లు & TVలు లేదా నీరు వంటి విభాగాన్ని ట్యాప్ చేయండి.

  • కెమెరాలు: ‘కెమెరాలు’ విభాగంలో గరిష్టంగా నాలుగు కెమెరాలకు సంబంధించిన వీడియో కనిపిస్తుంది. మరిన్ని కెమెరాలను చూడటానికి ఎడమ వైపు స్వైప్ చేయండి.

  • సీన్‌లు: ట్యాప్ చేయడం లేదా Siriని రిక్వెస్ట్ చేయడం ద్వారా పలు యాక్సెసరీలను కంట్రోల్ చేయడానికి సీన్‌లను సృష్టించండి-ఉదాహరణకు, బ్లైండ్‌లను మూసివేసి, సాయంత్రం లైట్‌లను ఆన్ చేయడానికి సీన్‌ను ట్యాప్ చేయండి.

  • ఇష్టపడినవి: మీరు ఎక్కువగా ఉపయోగించే యాక్సెసరీలను హోమ్ ట్యాబ్ నుండి త్వరగా కంట్రోల్ చేయడానికి, వాటిని ‘ఇష్టపడినవి’కు జోడించండి.

  • రూమ్‌లు: మీకు అవసరమైన యాక్సెసరీని కనుగొనడంలో సహాయకరంగా ఉండటానికి, యాక్సెసరీలు రూమ్ ఆధారంగా నిర్వహించబడతాయి.

ఎగువ నుండి దిగువ వరకు నాలుగు విభాగాలు, రెండు సీన్‌లు, మూడు కెమెరా వీక్షణలు, ఒక గది స్టేటస్ చూపుతున్న హోమ్ ట్యాబ్. దిగువన హోమ్ (ఎంచుకోబడినది), ఆటోమేషన్, డిస్కవర్ ట్యాబ్‌లు ఉన్నాయి.

హోమ్ ట్యాబ్‌ను ఎడిట్ చేయడం

మీకు బాగా సరిపోయే విధంగా మీరు హోమ్ ట్యాబ్‌ను నిర్వహించవచ్చు.

 ‘మరిన్ని’ బటన్ ట్యాప్ చేసి, ఆపై దిగువ వాటిలో ఏదైనా ఒకటి చేయండి.

  • ఐటెమ్‌ల ఆర్డర్ మార్చండి: ‘హోమ్ వీక్షణను ఎడిట్ చేయండి’ని ఎంచుకుని, ఆపై టైల్‌లను వేరే స్థానానికి డ్రాగ్ చేయండి. మీ పని పూర్తయిన తర్వాత ‘పూర్తి’ని ట్యాప్ చేయండి.

  • విభాగాల ఆర్డర్ మార్చండి: హోమ్ ట్యాబ్‌లో ‘ఇష్టపడినవి’ లేదా సీన్‌ల వంటి విభాగాల ఆర్డర్ మార్చడానికి, ‘విభాగాల ఆర్డర్ మార్చండి’ని ఎంచుకుని, ఆపై ఒక విభాగం పక్కన ఉన్న ఆర్డర్ మార్చే బటన్ ను కొత్త స్థానానికి డ్రాగ్ చేయండి. మీ పని పూర్తయిన తర్వాత ‘పూర్తి’ని ట్యాప్ చేయండి.

  • ఐకాన్‌ల సైజ్ మార్చండి: ‘హోమ్ వీక్షణను ఎడిట్ చేయండి’ని ఎంచుకుని, టైల్‌ను ట్యాప్ చేసి, ‘సైజ్ మార్చండి’ బటన్ను ట్యాప్ చేసి, ఆపై ‘పూర్తి’ని ట్యాప్ చేయండి.

మీ Apple డివైజ్‌లతో స్మార్ట్ హోమ్‌ను ఎలా సృష్టించి, యాక్సెస్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, స్క్రీన్ దిగువన ఉన్న ‘డిస్కవర్’ని ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.