ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో మీ వాయిస్‌మెయిల్ గ్రీటింగ్, సెట్టింగ్‌లను మార్చడం

మీరు మీ వాయిస్‌మెయిల్ గ్రీటింగ్, పాస్‌వర్డ్, అలర్ట్ సౌండ్‌లను మార్చవచ్చు.

మీ వాయిస్‌మెయిల్‌ గ్రీటింగ్‌ను మార్చడం

  1. మీ iPhoneలో ఫోన్ యాప్ కి వెళ్ళండి.

  2. మీరు ఉపయోగిస్తున్న ఫోన్ యాప్ లేఔట్ ఆధారంగా ఈ కింద పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • యూనిఫైడ్ లేఔట్: ’కాల్స్’ ట్యాప్ చేసి, ’ఎడిట్’ ట్యాప్ చేసి, ఆపై ’వాయిస్‌మెయిల్‌ గ్రీటింగ్‌ను ఎడిట్ చేయండి’ ట్యాప్ చేయండి.

    • క్లాసిక్ లేఔట్: వాయిస్‌మెయిల్‌‌ను ట్యాప్ చేసి, ఆపై ’గ్రీటింగ్’ ట్యాప్ చేయండి.

  3. ’కస్టమ్’ ట్యాప్ చేసి, ఆపై ’రికార్డ్’ ట్యాప్ చేయండి (అన్ని దేశాలు, ప్రాంతాలలో అన్ని నెట్‌వర్క్‌లకు మద్దతు లేదు).

మీ వాయిస్‌మెయిల్ పాస్‌వర్డ్‌ను మార్చడం

  1. మీ iPhoneలో సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. యాప్స్ ట్యాప్ చేసి, ఆపై ‘ఫోన్’ ట్యాప్ చేయండి.

  3. ’వాయిస్‌మెయిల్‌ పాస్‌వర్డ్‌ను మార్చండి’ ట్యాప్ చేసి, ఆపై కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

మీ పాస్‌వర్డ్‌ను అలర్ట్ సౌండ్‌ను మార్చడం

  1. మీ iPhoneలో సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. ’సౌండ్స్, హ్యాప్టిక్స్’ ట్యాప్ చేసి, ఆపై కొత్త వాయిస్‌మెయిల్‌ను ట్యాప్ చేయండి.

  3. జాబితా నుండి కొత్త అలర్ట్ సౌండ్‌ను ట్యాప్ చేయండి లేదా కొనుగోలు చేయడానికి టోన్ స్టోర్‌ను ట్యాప్ చేయండి.

నోట్: మీ కాంటాక్ట్ ఫోటో & పోస్టర్‌ను మార్చడానికి, మీ ఫోటో, పోస్టర్‌ను జోడించడం లేదా ఎడిట్ చేయడం చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.