iPhoneలోని Apple Games యాప్‌లో మీ Game Center ప్రొఫైల్‌ను సెటప్ చేయడం

Game Center అనేది Apple సోషల్ గేమింగ్ సర్వీస్, ఇది మీరు స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి, స్కోర్లు, విజయాలను ట్ర్యాక్ చేయడానికి, పోల్చడానికి, ఛాలెంజ్‌లలో ఇతర ప్లేయర్‌లతో పోటీ పడటానికి, అలాగే స్నేహితులను మల్టీప్లేయర్ గేమ్‌లకు ఆహ్వానించడానికి వీలు కల్పిస్తుంది. Apple Games యాప్‌లో, మీరు మీ Game Center ప్రొఫైల్‌ను కస్టమైజ్ చేయవచ్చు, మీతో ఎవరు కనెక్ట్ అవ్వగలరో నిర్వహించవచ్చు, ఇంకా మరెన్నో చేయవచ్చు.

నోట్: Apple Games యాప్‌ను ఉపయోగించడానికి, మీరు మీ Apple ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.

మీ Game Center ప్రొఫైల్‌ను సెటప్ చేయడం

  1. మీ iPhoneలో Apple Games యాప్ కి వెళ్ళండి.

  2. ’కొనసాగించండి’ని ట్యాప్ చేసి, ఆపై ’కొనసాగించండి’ని మళ్ళీ ట్యాప్ చేయండి.

  3. మీ ప్లేయర్ ప్రొఫైల్‌ను కస్టమైజ్ చేయడానికి ఈ కింది వాటిని చేయండి:

    • మీ అవతార్‌ను ఎంచుకోవడం: ఎడిట్ బటన్ ట్యాప్ చేసి, ఆపై అవతార్‌ను ఎంచుకోండి.

    • ముద్దుపేరును సృష్టించడం: మీరు కలిసి గేమ్స్ ఆడుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ చూసే ముద్దుపేరును ఎంచుకోవడానికి, ముద్దుపేరు ట్యాప్ చేయండి, ఆపై ఒక పేరును నమోదు చేయండి లేదా సూచనలలో ఒకదాన్ని ఎంచుకోండి.

    • మీ గేమ్ యాక్టివిటీని ఎవరు చూడాలో ఎంచుకోవడానికి: ఎంపికను ట్యాప్ చేయండి.

  4. ‘కొనసాగించండి’ నొక్కండి.

మీరు సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళి, ఆపై Game Centerను ట్యాప్ చేయడం ద్వారా మీ Game Center ప్రొఫైల్‌ను కూడా సెటప్ చేయవచ్చు. Game Centerను ఆన్ చేసి, ఆపై మీ ప్లేయర్ ప్రొఫైల్‌ను కస్టమైజ్ చేయండి.

మీ Game Center ప్రొఫైల్‌ను ఎడిట్ చేయడం

  1. మీ iPhoneలో Apple Games యాప్ కి వెళ్ళండి.

  2. ఎగువ-కుడి మూలలో మీ అవతార్‌ను ట్యాప్ చేసి, ఆపై ‘ప్రొఫైల్‌ను ఎడిట్ చేయండి’ ట్యాప్ చేయండి.

  3. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • మీ అవతార్‌ను ఎడిట్ చేయడం: ఎడిట్ బటన్ ట్యాప్ చేసి, అవతార్‌ను ఎంచుకుని, ఆపై ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి.

    • మీ ముద్దుపేరును ఎడిట్ చేయడం: మీ ప్రస్తుత ముద్దుపేరును ట్యాప్ చేసి, పేరును నమోదు చేయండి లేదా సూచనలలో ఒకదాన్ని ఎంచుకోండి, ఆపై ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి.

  4. మీరు పూర్తి చేసిన తర్వాత, ‘పూర్తి’ బటన్ను ట్యాప్ చేయండి.

మీరు సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళి, Game Centerను ట్యాప్ చేసి, ఆపై ‘ప్రొఫైల్‌ను కస్టమైజ్ చేయండి’ ట్యాప్ చేయడం ద్వారా మీ Game Center ప్రొఫైల్‌ను కూడా ఎడిట్ చేయవచ్చు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.