iPhoneలో ఫిట్‌నెస్‌లో వర్క్‌ఔట్‌ను ప్రారంభించండి

మీరు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT), ఔట్‌డోర్ రన్నింగ్, ఔట్‌డోర్ సైకిల్ వంటి కార్డియో-ఫోకస్డ్ ఎంపికల నుండి ఫంక్షనల్ స్ట్రెంత్ ట్రైనింగ్, కోర్ ట్రైనింగ్, కిక్‌బాక్సింగ్ వంటి స్ట్రెంగ్త్ ఆధారిత వర్క్‌ఔట్‌ల వరకు వ్యక్తిగత వర్క్‌ఔట్‌ సెషన్‌లను ప్రారంభించవచ్చు. మీరు వర్క్ఔట్‌ రకాన్ని ప్రారంభించినప్పుడు ఆటోమేటిక్‌గా ప్లే చేయడానికి మీడియాను కూడా సెట్ చేయవచ్చు: మీరు Apple Musicకు సబ్‌స్క్రైబ్ చేసినట్లయితే, Apple Music వర్క్‌ఔట్ రకం, మీకు ఇష్టమైన సంగీతం ఆధారంగా మీడియాను ఎంచుకుంటుంది. లేదా మీరు మీడియాను మీరే ఎంచుకోవచ్చు.

మీకు కేవలం iPhone ఉంటే, మీరు ఈ కింది వర్క్ఔట్ రకాలతో వర్క్ఔట్ చేయవచ్చు:

  • ఔట్‌డోర్ వాక్

  • ఔట్‌డోర్ రన్

  • హైకింగ్

  • ఔట్‌డోర్ పుష్ వాకింగ్ పేస్

  • ఔట్‌డోర్ పుష్ రన్నింగ్ పేస్

  • ఔట్‌డోర్ సైకిల్

మీరు Apple Watch, AirPods Pro 3, Powerbeats Pro 2, లేదా అనుకూల Bluetooth ఎనేబల్ చేసిన థర్డ్ పార్టీ హార్ట్ రేట్ మానిటర్‌ను కనెక్ట్ చేసినప్పుడు, మీరు స్క్రీన్‌పై కనిపించే వర్క్‌ఔట్ కొలమానాలతో వర్క్‌ఔట్ చేయవచ్చు.

నోట్: మీరు iPhoneను AirPods Pro 3 లేదా థర్డ్-పార్టీ హార్ట్ రేట్ మానిటర్‌కు కనెక్ట్ చేసి ఉంటే, మీకు కిక్‌బాక్సింగ్, పిలేట్స్ వంటి మరిన్ని వర్క్‌ఔట్ రకాలకు యాక్సెస్ ఉంటుంది. మీకు Apple Watch ఉంటే, మీకు అన్ని రకాల వర్క్‌ఔట్‌లకు యాక్సెస్ ఉంటుంది.

మూడు వర్క్ఔట్‌ రకాలను చూపుతున్న ఫిట్‌నెస్ వర్క్ఔట్‌ స్క్రీన్. వర్క్ఔట్‌ను లాగ్ చేయడానికి, హార్ట్ రేటు మానిటర్‌ను కనెక్ట్ చేయడానికి బటన్‌లు స్క్రీన్ పైభాగంలో ఉన్నాయి.

హార్ట్ రేట్ డివైజ్‌ను కనెక్ట్ చేయడం

మీరు మీ iPhoneలో వర్క్‌ఔట్ ప్రారంభించే ముందు, మీరు ఆరోగ్యం యాప్‌కి కనెక్ట్ అయ్యే Apple Watch, Powerbeats Pro 3 లేదా Bluetooth ®ఎనేబల్ చేయబడిన థర్డ్-పార్టీ హార్ట్ రేట్ మానిటర్‌లను కనెక్ట్ చేశారని నిర్ధారించుకోండి. AirPods Pro 3 గురించి మరింత సమాచారం కోసం, AirPods యూజర్ గైడ్‌లో AirPods Pro 3తో వర్క్‌ఔట్‌ల సమయంలో మీ హార్ట్ రేట్‌ను ట్ర్యాక్ చేయడం అనే ఆర్టికల్ చూడండి.

మీకు హార్ట్ రేట్ డివైజ్ కనెక్ట్ చేయబడకపోతే, దిగువ పేర్కొన్న విధంగా చేయండి:

  1. మీ iPhoneలోని ఫిట్‌నెస్ యాప్ ()కు వెళ్ళండి.

  2. వర్క్ఔట్‌ను ట్యాప్ చేసి, ఆపై ఎగువ-కుడి మూలన ‘హార్ట్ రేట్ డివైజ్‌లు’ బటన్ ట్యాప్ చేయండి.

  3. Bluetooth సెట్టింగ్స్‌ను ట్యాప్ చేసి, ఆపై మీ iPhoneను Bluetooth యాక్సెసరీతో పెయిర్ చేయండి.

వర్క్ఔట్‌ను ప్రారంభించడం

  1. మీ iPhoneలోని ఫిట్‌నెస్ యాప్ ()కు వెళ్ళండి.

  2. ’వర్క్ఔట్’ను ట్యాప్ చేసి, ఆపై మీరు చేయాలనుకుంటున్న వర్క్ఔట్ రకానికి స్క్రోల్ చేయండి.

    మరిన్ని వర్క్‌ఔట్ రకాలను చూడటానికి, ట్యాబ్ కింద ఉన్న జోడించండి బటన్ ట్యాప్ చేయండి.

  3. వర్క్ఔట్ ప్రారంభించడానికి, ప్రారంభించండి బటన్ ట్యాప్ చేయండి.

వర్క్ఔట్‌ కోసం ఆడియోను ఎంచుకోవడం

మీరు వర్క్ఔట్‌ రకాన్ని ప్రారంభించినప్పుడు మీరు సాధారణంగా వినే దాని ఆధారంగా మీ కోసం ఎంచుకోబడిన మీడియా లేదా మీరు మీరే ఎంచుకున్న మీడియాను ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా సెట్ చేయవచ్చు.

  1. మీ iPhoneలోని ఫిట్‌నెస్ యాప్ ()కు వెళ్ళండి.

  2. వర్క్ఔట్‌‌ను ట్యాప్ చేసి, వర్క్ఔట్‌ రకానికి స్క్రోల్ చేసి, ఆపై మీడియా బటన్ను ట్యాప్ చేయండి.

  3. ‘మీడియాను ఆటోప్లే చేయండి’ని ఆన్ చేయండి.

  4. మీరు Apple Musicకు సబ్‌స్క్రైబ్ చేసినట్లయితే, మీరు చేసే వర్క్‌ఔట్ రకం, మీరు వినే సంగీతం ఆధారంగా మీడియా ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా చేయవచ్చు. ‘మీ కోసం ఎంపిక చేసినవి’ ట్యాప్ చేయండి.

  5. మీ సొంత మీడియాను ఎంచుకోవడానికి, ‘మీడియాను ఎంచుకోండి’ ట్యాప్ చేసి, ‘మీడియాను జోడించండి’ ట్యాప్ చేసి, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • సూచించిన ఎంపికను ఎంచుకోవడానికి: దిగువన ఉన్న సూచనల ఎంపికను ట్యాప్ చేయండి.

      చిట్కా: మరిన్ని సూచనలను చూడటానికి, ‘సోర్స్‌లు’ కింద ఉన్న సంగీతం లేదా పాడ్‌కాస్ట్‌లను నొక్కండి.

    • ప్లేలిస్ట్‌ను ఎంచుకోవడం: సంగీతాన్ని ట్యాప్ చేసి, ప్లేలిస్ట్‌లను ట్యాప్ చేసి, ఆపై ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి.

  6. మీరు పూర్తి చేసిన తర్వాత, ‘పూర్తి’ బటన్ను ట్యాప్ చేయండి.

నోట్: మీరు మీ వర్క్ఔట్‌ను ప్రారంభించడానికి ముందు వింటున్న సంగీతం లేదా ఇతర ఆడియో ప్లే అవుతూనే ఉంటుంది.

వర్క్ఔట్ కంట్రోల్స్‌ను ఉపయోగించడం

వర్క్ఔట్ చేస్తున్నప్పుడు, మీరు పాజ్ చేయవచ్చు, ఒక సెగ్మెంట్‌ను గుర్తించవచ్చు, చెక్ ఇన్ పంపవచ్చు, కంట్రోల్స్‌ను లాక్ చేయవచ్చు, అలాగే మరిన్ని చేయవచ్చు. మీరు వర్క్ఔట్ పూర్తి చేసినప్పుడు, మీరు ఎలా చేశారో సారాంశాన్ని చూడవచ్చు.

  1. మీ iPhoneలోని ఫిట్‌నెస్ యాప్ ()కు వెళ్ళండి.

  2. వర్క్ఔట్ ప్రారంభించండి, ఆపై కింద పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • వర్క్ఔట్‌ను పాజ్ చేయడం: పాజ్ బటన్ ట్యాప్ చేయండి.

    • వర్క్ఔట్‌ను తిరిగి కొనసాగించడానికి: ’తిరిగి కొనసాగించండి’ బటన్ ట్యాప్ చేయండి.

    • సెగ్మెంట్‌ను మార్క్ చేయడం: ‘సెగ్‌మెంట్‌లు’ బటన్ ట్యాప్ చేయండి.

    • హార్ట్ రేట్ డివైజ్‌ను కనెక్ట్ చేయడం: ‘హార్ట్ రేట్ డివైజ్‌లు’ బటన్ ట్యాప్ చేయండి.

    • వర్క్ఔట్‌ ముగించడం: స్క్రీన్ దిగువ నుండి పైకి స్వైప్ చేసి, ఆపై ’వర్క్ఔట్‌‌ను ముగించండి’ని ట్యాప్ చేయండి. వర్క్ఔట్‌ సారాంశాన్ని రివ్యూ చేసి, ఆపై ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి.

    • Workout Buddyని మ్యూట్ చేయడం: స్క్రీన్ దిగువ నుండి పైకి స్వైప్ చేసి, ఆపై ‘మ్యూట్’ ట్యాప్ చేయండి.

    • చెక్-ఇన్‌ను ప్రారంభించడం: స్క్రీన్ దిగువ నుండి పైకి స్వైప్ చేసి, ’చెక్-ఇన్’ను ట్యాప్ చేయండి, ఆపై స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించండి.

    • iPhoneలో కొలమానాలను చూడటం ఆపివేయండి (Apple Watch అవసరం): స్క్రీన్ కింద నుండి పైకి స్వైప్ చేసి, ఆపై ‘చూడటం ఆపండి’ ట్యాప్ చేయండి.

      నోట్: మళ్ళీ చూడటం ప్రారంభించడానికి, మీ Apple Watch‌లో కుడివైపుకి స్వైప్ చేసి, ఆపై ‘చూడండి’ ట్యాప్ చేయండి.

    • వర్క్ఔట్‌ కంట్రోల్స్‌ను లాక్ చేయడానికి: స్క్రీన్ దిగువ నుండి పైకి స్వైప్ చేసి, ఆపై ’కంట్రోల్స్‌ను లాక్ చేయండి’ని ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.