ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో Mail గోప్యతా సంరక్షణను ఉపయోగించడం

Mail యాప్ లో, Mail గోప్యతా సంరక్షణను ఆన్ చేయండి, తద్వారా సెండర్‌లు మీ Mail యాక్టివిటి గురించి తెలుసుకోవడం కష్టం అవుతుంది. Mail గోప్యతా సంరక్షణ మీ IP అడ్రెస్‌ను దాచుతుంది, తద్వారా సెండర్‌లు దానిని మీ ఇతర ఆన్‌లైన్ యాక్టివిటీకి లింక్ చేయలేరు లేదా మీ ఖచ్చితమైన లొకేషన్ గుర్తించలేరు. మీరు పంపిన సందేశాన్ని తెరిచారో లేదో అనే విషయాన్ని సెండర్‌లు చూడకుండా కూడా ఇది నివారిస్తుంది.

  1. సెట్టింగ్స్  > యాప్‌లు > Mailకు వెళ్ళండి.

  2. ‘గోప్యతా సంరక్షణ’ను ట్యాప్ చేసి, ఆపై ‘Mail యాక్టివిటి సంరక్షణ’ను ఆన్ చేయండి.

    నోట్: మీరు iCloud+కు సబ్‌స్క్రైబ్ చేసినప్పుడు, మీ వ్యక్తిగత ఇమెయిల్ ఖాతాకు ఫార్వర్డ్ చేసే ప్రత్యేకమైన, ర్యాండమ్ ఇమెయిల్ అడ్రెస్‌లను రూపొందించడానికి ‘నా ఇమెయిల్‌ను దాచండి’ని కూడా ఉపయోగించవచ్చు, దాని వలన మీరు వెబ్‌లో ఫారమ్‌లను పూరించేటప్పుడు లేదా వార్తాలేఖల కోసం సైన్ అప్ చేసేటప్పుడు మీ వ్యక్తిగత ఇమెయిల్ అడ్రెస్‌ను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ’నా ఇమెయిల్‌ను దాచండి’ని ఉపయోగించడం ఎలానో చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.