iPhoneలోని ’సందేశాలు’లో వ్యక్తుల కోసం పోల్‌ను నిర్వహించడం

ఏమి తినాలి, ఏ సినిమా చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు కలవాలి వంటి వాటిని నిర్ణయించడానికి మీరు ఏ iMessage సంభాషణలోనైనా పోల్‌ను పంపవచ్చు. సంభాషణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంపికలను కంట్రిబ్యూట్ చేయవచ్చు, ఓట్లు వచ్చినప్పుడు చూడవచ్చు.

నోట్: పోల్‌ను ప్రారంభించడానికి, చూడటానికి లేదా ఓటు వేయడానికి మీరు iOS 26, iPadOS 26, macOS Tahoe, watchOS 26, visionOS 26 లేదా ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో iMessageను ఉపయోగించాలి. దీన్ని చూడని వారికి గ్రూప్‌కి పోల్ పంపినట్లు సందేశం వస్తుంది.

పోల్‌ను ప్రారంభించడం

  1. మీ iPhoneలో సందేశాలు యాప్ కు వెళ్ళండి.

  2. సంభాషణలో, జోడించండి బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘పోల్స్’ ట్యాప్ చేయండి.

  3. ఎంపికలను జోడించడానికి ప్రతి వరుసను ట్యాప్ చేయండి. పోల్‌లో గరిష్టంగా 12 ఎంపికలు ఉండవచ్చు.

  4. ‘పంపండి’ బటన్ను ట్యాప్ చేయండి.

చిట్కా: పోల్స్ కోసం సూచనలు పొందడానికి Apple Intelligenceను ఆన్ చేయండి.

పోల్‌లో ఓటు వేయడం

  1. మీ iPhoneలో సందేశాలు యాప్ కు వెళ్ళండి.

  2. పోల్‌తో ఉన్న సంభాషణను తెరవండి.

  3. మీ ఓటును జోడించడానికి ఎంపికను ట్యాప్ చేయండి. మీ ఓటును తొలగించడానికి మళ్ళీ ట్యాప్ చేయండి. మీరు ఏ ఒక్కదానికీ లేదా అన్ని ఎంపికలకు ఓటు వేయవచ్చు.

పోల్‌కు ఎంపికను జోడించడం

పోల్‌లో పార్టిసిపెట్ చేసే ఎవరైనా ఎంపికను జోడించవచ్చు.

  1. మీ iPhoneలో సందేశాలు యాప్ కు వెళ్ళండి.

  2. పోల్‌తో ఉన్న సంభాషణను తెరవండి.

  3. ’ఎంపికను జోడించండి’ ట్యాప్ చేసి, ఆపై మరో ఎంపికను నమోదు చేయండి.

  4. పోల్‌కు ఎంపికను జోడించడానికి ‘పంపండి’ బటన్ ట్యాప్ చేయండి.

    నోట్: ఓట్లు లేకుండా ఎంపికలు జోడించబడతాయి. మీరు జోడించే ఏదైనా ఎంపికకు ఓటు వేయడానికి ట్యాప్ చేయండి.

పోల్ ఫలితాలను చెక్ చేయడం

వ్యక్తులు దేనికి ఓటు వేశారో లేదా ఇంకా ఎవరు ఓటు వేయలేదో మీరు చూడవచ్చు.

  1. మీ iPhoneలో సందేశాలు యాప్ కు వెళ్ళండి.

  2. పోల్‌తో ఉన్న సంభాషణను తెరవండి.

  3. ‘పోల్’ను టచ్ చేసి ఉంచి, ఆపై ’పోల్ వివరాలు’ ట్యాప్ చేయండి.

*Apple Intelligence ఈ కింది భాషలకు మద్దతుతో బీటాలో అందుబాటులో ఉంది: ఇంగ్లీష్, డానిష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, నార్వేజియన్, పోర్చుగీస్, స్పానిష్, స్వీడిష్, టర్కిష్, చైనీస్ (సరళీకృతం), చైనీస్ (సాంప్రదాయ), జపనీస్, కొరియన్, ఇంకా వియత్నామీస్. కొన్ని ఫీచర్‌లు అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు. భాష, ఫీచర్ లభ్యత, ఇంకా సిస్టమ్ అవసరాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, Apple Intelligenceను ఎలా పొందాలి అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.