ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో SharePlayను ఉపయోగించి సంగీతాన్ని ప్లే చేయండి

మీరు HomePod, Apple TV 4K లేదా ఇతర థర్డ్ పార్టీ Bluetooth ® స్పీకర్‌లో సంగీతాన్ని ప్లేచేస్తున్నప్పుడు, SharePlayను ఉపయోగించవచ్చు, అలాగే, ప్రతి ఒక్కరూ తమ iPhoneతో స్వయంగా సంగీతాన్ని కంట్రోల్ చేయవచ్చు.

మీరు ప్రారంభించే ముందు

  • హోస్ట్ తప్పనిసరిగా iPhone iOS 18 లేదా తర్వాతి వెర్షన్‌ను కలిగి ఉండాలి, అలాగే Apple Music సబ్‌స్క్రైబర్ అయి ఉండాలి.

  • పార్టిసిపెంట్‌లు తప్పనిసరిగా iOS 18 లేదా తర్వాతి వెర్షన్‌తో కూడిన iPhoneను కలిగి ఉండాలి, కానీ Apple Music సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉండాల్సిన అవసరం లేదు.

  • ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, Bluetoothను ఆన్ చేసి ఉండాలి.

  • ప్రతి ఒక్కరూ స్పీకర్‌లో సంగీతాన్ని ప్లే చేస్తున్నప్పుడు వారి కాంటాక్ట్‌లు కనిపించేలా కాంటాక్ట్స్‌ను అనుమతించాలి-సెట్టింగ్స్  > యాప్స్ > సంగీతం యాప్‌కు వెళ్లండి, ఆపై ఇప్పటికే ఆన్‌లో లేకపోతే, ‘సమీపంలోని కాంటాక్ట్‌ల ద్వారా కనుగొనదగినది’ ఆన్ చేయండి.

మీ iPhoneలో సంగీతం యాప్ నుండి SharePlayను ప్రారంభించడం

కలిసికట్టుగా సంగీతాన్ని ప్లే చేయడానికి SharePlayను ఉపయోగించడం కోసం, మీరు (హోస్ట్) మీ iPhoneలో ప్రారంభించండి.

  1. మీ iPhoneలో సంగీతం యాప్ కు వెళ్లండి.

  2. పాట ప్లే అవుతున్నప్పుడు, ‘ఇప్పుడు ప్లే అవుతోంది’ స్క్రీన్‌ను తెరవడానికి మినీప్లేయర్‌ను ట్యాప్ చేయండి.

  3. ప్లేబ్యాక్ గమ్యస్థాన బటన్ ట్యాప్ చేసి, ఆపై ప్లేబ్యాక్ గమ్యస్థానాన్ని ఎంచుకోండి.

    మీరు ఎంచుకున్న డివైజ్‌లో సంగీతం ప్లే అవడం మొదలవుతుంది. AirPlayలో వీడియో, ఆడియోను ప్రసారం చేయడం చూడండి.

  4. ‘ఇప్పుడు ప్లే అవుతోంది’ స్క్రీన్‌ను తెరవడానికి, మినీప్లేయర్‌ను ట్యాప్ చేసి, ఆపై SharePlay బటన్ నొక్కండి.

    QR కోడ్ కనిపిస్తుంది; QR కోడ్‌ను పెద్దదిగా చేయడానికి ట్యాప్ చేయండి.

  5. సంగీతాన్ని కంట్రోల్ చేయడం ప్రారంభించడానికి, పార్టిసిపెంట్‌లు మీ iPhoneలో QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.

iPhone కెమెరాతో SharePlayలో జాయిన్ అవ్వడం

  1. మీ iPhoneలో కెమెరా యాప్ కు వెళ్ళండి.

  2. ఇప్పటికే SharePlayలో చేరిన iPhoneలో ఉన్న QR కోడ్‌పై కెమెరాను ఉంచండి.

    QR కోడ్ పిక్చర్‌కు దిగువన ఒక బటన్ కనిపిస్తుంది.

  3. బటన్‌ను ట్యాప్ చేసి, ఆపై కనెక్ట్ ట్యాప్ చేయండి.

    హోస్ట్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు, మిమ్మల్ని చేరడానికి అనుమతించడం కోసం వారి iPhoneలో తప్పనిసరిగా చెక్‌మార్క్ బటన్ ట్యాప్ చేయాలి.

చిట్కా: మీరు SharePlayలో చేరడానికి పార్టిసిపెంట్‌ను ఆమోదించిన తర్వాత, వారు తరువాతి సారి చేరినప్పుడు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతారు.

SharePlay నుండి నిష్క్రమించండి

‘ఇప్పుడు ప్లే అవుతోంది’ స్క్రీన్ దిగువన SharePlay బటన్ ట్యాప్ చేయండి, ఆపై నిష్క్రమించండి లేదా ముగించండి ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.