ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో ‘సందేశాలు’తో ప్రాజెక్ట్‌లలో కొలాబొరేట్ చేయడం

సందేశాలు యాప్ లో, ప్రాజెక్ట్‌లో కొలాబొరేట్ చేయడానికి వ్యక్తులను ఆహ్వానించడానికి మీరు టెక్స్ట్ సందేశాన్ని పంపవచ్చు, తద్వారా సంభాషణలో ఉన్న ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ఇతర షేర్ చేసిన ఫైల్‌కు జోడించబడతారు.

నోట్: ‘సందేశాలు’తో ప్రాజెక్ట్‌లో కొలాబొరేట్ చేయడం ప్రారంభించడానికి, మీరు, మీ స్వీకర్తలు తప్పనిసరిగా iMessageను iOS 16, iPadOS 16, macOS 13, watchOS 9, visionOS 1, లేదా ఆ తర్వాతి జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే డివైజ్‌ను ఉపయోగిస్తూ ఉండాలి, అలాగే మీరు మొదట iCloud Drive వంటి ఇతరులు యాక్సెస్ చేయగలిగే చోట కంటెంట్‌ను సేవ్ చేయాలి. iPhone యాప్‌ల కోసం, వాటి కొలాబొరేట్ ఫీచర్‌లను ఉపయోగించడానికి మీరు iCloudను ఆన్ చేయాల్సి ఉంటుంది. iCloud యూజర్ గైడ్‌లో మీ డివైజ్‌లన్నింటిలో iCloudను సెటప్ చేయడం ఎలానో చూడండి.

కొలాబొరేట్ చేయడానికి వ్యక్తులను ఆహ్వానించడం

మీరు వేరే యాప్ నుండి ప్రాజెక్ట్‌లో కొలాబొరేట్ చేయడానికి వ్యక్తులను ఆహ్వానించవచ్చు, ఆపై ‘సందేశాలు’లో మీ కంటెంట్ గురించి చర్చించవచ్చు. మీరు మొదట నోట్స్, Freeform, రిమైండర్‌లు, Safari, Keynote, Numbers, Pages వంటి మరిన్ని యాప్‌ల విషయంలో iCloud సెట్టింగ్స్‌లో కొలాబొరేషన్ ఫీచర్‌లను ఆన్ చేసి ఉంచినంత వరకు, అలాగే ఇతరులు సంబంధిత కంటెంట్‌ను యాక్సెస్ చేయగలిగే iCloud డ్రైవ్ వంటి వాటిలో స్టోర్ చేసి ఉంచినంత వరకు మీరు వాటిని ఉపయోగించి ఫైల్‌లను షేర్ చేయవచ్చు.

కొలాబొరేట్ చేయడానికి ఎవరినైనా ఆహ్వానించే ప్రక్రియ యాప్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు మద్దతిచ్చే యాప్‌లో కొలాబొరేట్ చేయడాన్ని ప్రారంభించడానికి ఒక మార్గం ఇక్కడ ఉంది:

  1. మీరు షేర్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను ఎంచుకుని, ఆపై షేర్ బటన్ను ట్యాప్ చేసి, లేదా ‘కొలాబొరేట్ చేయండి’ని ట్యాప్ చేయండి.

  2. ‘కొలాబొరేట్ చేయండి’ (‘కాపీని పంపండి’ కాకుండా) ఎంచుకోబడిందని నిర్ధారించుకుని, ఆపై మీరు కొలాబొరేట్ చేయాలనుకుంటున్న గ్రూప్ లేదా వ్యక్తిని ట్యాప్ చేయండి. మీకు జాబితాలో గ్రూప్ లేదా వ్యక్తి కనిపించకపోతే, సందేశాలు యాప్ ఐకాన్ను ట్యాప్ చేయండి.

    సూచించిన ఐకాన్‌లు FaceTime యాక్టివ్ కాల్స్ లేదా ఇటీవలి సందేశాల సంభాషణలు ఉన్న గ్రూప్‌లు లేదా వ్యక్తులకు సంబంధించినవి కావచ్చు.

  3. పంపడానికి సిద్ధంగా ఉన్న ఆహ్వానంతో ‘సందేశాలు’ సంభాషణ తెరవబడుతుంది. నోట్‌ను జోడించి (ఐచ్ఛికం), ఆపై ‘పంపండి’ బటన్ను ట్యాప్ చేయండి.

షేర్ ఎంపిక కోసం కొలాబొరేట్, అలాగే యాక్సెస్ మరియు అనుమతి సెట్టింగ్‌ వలన “మీరు ఆహ్వానించిన వ్యక్తులు మాత్రమే ఎడిట్ చేయగలరు” అని చూపుతున్న నోట్స్‌లో వంటకాన్ని చేయడానికి గల కొలబొరేషన్ ఆహ్వానం. ఒక గ్రూప్‌తో సహా స్వీకర్తలు అయ్యే అవకాశం ఉన్న నలుగురు, దిగువన వరుసను చూపుతుంది. నోట్‌ను షేర్ చేయడానికి వివిధ మార్గాలను అందిస్తున్న తదుపరి వరుస: AirDrop, సందేశాలు, Mail, రిమైండర్స్.

మీరు ‘సందేశాలు’లో పార్టిసిపెంట్‌లను ఆహ్వానించిన తర్వాత, మీరు వేరే యాప్‌లోని ప్రాజెక్ట్‌లో పని చేయవచ్చు, ఆ యాప్‌లోని కొలాబొరేట్ బటన్‌ను ట్యాప్ చేయడం ద్వారా ‘సందేశాలు’ సంభాషణకు తిరిగి రావచ్చు.

ఎవరైనా ఫైల్‌ను ఎడిట్ చేసినప్పుడు, మీరు ‘సందేశాలు’ థ్రెడ్ ఎగువన దానికి సంబంధించిన అప్‌డేట్‌లను చూస్తారు. షేర్ చేసిన ప్రాజెక్ట్‌కు తిరిగి వెళ్ళి మార్పులను చూడటానికి, అప్‌డేట్‌ను ట్యాప్ చేయండి.

నోట్: మీ పార్టిసిపెంట్‌లు షేర్ చేసిన ఐటెమ్‌తో ఇంటరాక్ట్ కావడానికి లేదా ఏవైనా అప్‌డేట్‌లను చూడటానికి ముందు మీ ఆహ్వానాన్ని అంగీకరించాలి లేదా దానిలో చేరాలి.

‘సందేశాలు’లో ప్రాజెక్ట్‌లో కొలాబొరేట్ చేయడం

మీరు మీ ప్రాజెక్ట్‌ను షేర్ చేసిన తర్వాత, ఎవరైనా ఎడిట్ చేసినప్పుడల్లా మీకు ‘సందేశాలు’ సంభాషణకు ఎగువన యాక్టివిటి అప్‌డేట్‌లు కనిపిస్తాయి.

  1. మీ iPhoneలో సందేశాలు యాప్ కు వెళ్ళండి.

  2. మీరు కోలబొరేట్ చేయడం ప్రారంభించిన ప్రాజెక్ట్‌కు ఆహ్వానాన్ని కలిగి ఉన్న సంభాషణకు వెళ్ళి, ఆపై ప్రాజెక్ట్‌కు తిరిగి రావడానికి దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • ఫైల్‌ను తెరవడానికి మీ సంభాషణలోని దానిపై ట్యాప్ చేయండి.

    • మీకు సంభాషణకు ఎగువన అప్‌డేట్ కనిపిస్తే, ‘చూపండి’ని ట్యాప్ చేయండి.

    • స్క్రీన్ ఎగువన ఉన్న మీ పార్టిసిపెంట్ లేదా గ్రూప్ ఐకాన్‌ను ట్యాప్ చేసి, కొలాబరేషన్‌కు స్క్రోల్ చేసి, ఆపై షేర్ చేసిన ప్రాజెక్ట్‌ను ట్యాప్ చేయండి.

మీరు ప్రాజెక్ట్‌లో ఏవైనా మార్పులు లేదా ఎడిట్‌లు చేసినప్పుడు, మీ పార్టిసిపెంట్‌లు సంభాషణలో అప్‌డేట్‌లను పొందుతారు.

నోట్: మీరు గ్రూప్ సంభాషణకు కొత్త వ్యక్తిని జోడిస్తే, మీరు కోలబొరేట్ చేస్తున్న ప్రాజెక్ట్‌లకు వారికి యాక్సెస్ ఇవ్వాలి. అవి ఇటీవల గ్రూప్ సంభాషణకు జోడించబడి ఉంటే, వాటిని జోడించడానికి మీరు స్క్రీన్ ఎగువన ఉన్న నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయవచ్చు. లేదా కొలాబొరేట్ చేయడానికి వారిని ఆహ్వానించండి.

కొలాబొరేషన్, గ్రూప్‌ను నిర్వహించడం

మీరు ‘సందేశాలు’ సంభాషణలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో ఒక ప్రాజెక్ట్‌ను షేర్ చేస్తే, మీరు పార్టిసిపెంట్‌లను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు.

  1. మీ iPhoneలో సందేశాలు యాప్ కు వెళ్ళండి.

  2. మీరు నిర్వహించాలనుకుంటున్న సంభాషణకు వెళ్ళి, ఆపై గ్రూప్ సంభాషణకు సంబంధించిన వివరాలను తెరవడానికి సంభాషణకు ఎగువన ఉన్న గ్రూప్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి.

  3. దిగువ వాటిలో ఏదైనా చేయండి:

    • కొత్త పార్టిసిపెంట్‌లను జోడించడం: ’జోడించండి’ ట్యాప్ చేసి, ఆపై కాంటాక్ట్‌లను జోడించండి. (’జోడించండి’ని చూడటానికి మీరు కిందికి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది.)

      మీరు కేవలం ఒక వ్యక్తితో కలిసి కొలాబొరేట్ చేయడం మొదలుపెట్టినట్లయితే, కొలబొరేషన్‌కు వ్యక్తులను జోడించడానికి మీరు తప్పనిసరిగా కొత్త సంభాషణను ప్రారంభించాలి.

      నోట్: కొత్త పార్టిసిపెంట్‌లు సంభాషణలో చేరడానికి ముందు, ఆ సంభాషణలో షేర్ చేయబడిన ఫైల్‌లకు మీరు తప్పనిసరిగా వారిని జోడించాలి. మీరు పార్టిసిపెంట్‌లను జోడించినప్పుడు, సంభాషణకు ఎగువన నోటిఫికేషన్ కనిపిస్తుంది. గతంలో షేర్ చేసిన ఫైల్‌లను చూసి, వాటికి కొత్త పార్టిసిపెంట్‌లను జోడించడానికి, నోటిఫికేషన్‌లో ‘చూపండి’ని ట్యాప్ చేయండి.

    • సంభాషణ నుండి పార్టిసిపెంట్‌ను తొలగించడం: వారి ఐకాన్‌ను నొక్కి ఉంచి, ఆపై ‘గ్రూప్ నుండి తొలగించండి’ ట్యాప్ చేయండి.

      ముఖ్యమైనది: కొలాబరేషన్ ఏ యాప్‌లలో జరుగుతుందో సాధారణంగా అవే యాప్‌లు ప్రాజెక్ట్‌కు సంబంధించిన యాక్సెస్‌ను కంట్రోల్ చేస్తాయి. వీక్షణ లేదా ఎడిటింగ్ అధికారాలను పూర్తిగా తొలగించడానికి యాప్‌లోనే పార్టిసిపెంట్ యాక్సెస్‌ను చెక్ చేయండి.

‘సందేశాలు’లో గ్రూప్‌లోని వ్యక్తుల సంఖ్య, ఫైల్‌లో కొలాబొరేట్ చేస్తున్న గ్రూప్‌లోని వ్యక్తుల సంఖ్య సరిపోలకపోవచ్చు. ఉదాహరణకు, మీరు ‘సందేశాలు’కు చెందని ఫైల్‌లో కొలాబొరేట్ చేయడానికి వ్యక్తులను ఆహ్వానించవచ్చు. లేదా మీరు ‘సందేశాలు’లో ఒక్కో దానికి దాని సొంత కొలబొరేషన్ సంభాషణ ఉన్న రెండు వేర్వేరు గ్రూప్‌లను కలిగి ఉండవచ్చు.

మీరు ఇంతకుముందు ఇతరులతో షేర్ చేసిన డాక్యుమెంట్‌కు ఎవరినైనా జోడించినప్పుడు, వారిని ఇప్పటికే ఉన్న సంభాషణకు జోడించే అవకాశం లేదా సంభాషణలను వేరుగా ఉంచే అవకాశం మీకు ఉంటుంది. సంభాషణలకు జోడించిన వ్యక్తులు, సంభాషణలో చేరడానికి ముందు పంపిన సందేశాలను చదవలేరు.

‘సందేశాలు’లో ప్రాజెక్ట్‌లో కొలాబొరేట్ చేయడాన్ని ఆపివేయడం

కొలాబరేషన్ ఏ యాప్‌లలో జరుగుతుందో సాధారణంగా అవే యాప్‌లు ప్రాజెక్ట్‌కు సంబంధించిన యాక్సెస్‌ను కంట్రోల్ చేస్తాయి. ఉదాహరణకు, మీరు Pages యాప్‌లోని డాక్యుమెంట్‌లో కొలాబొరేట్ చేస్తున్నట్లయితే, ‘సందేశాలు’ సెట్టింగ్‌ల కంటే Pages సెట్టింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే, మీరు వేరే ఇతర సందేశాన్ని, అన్‌సెండ్ లేదా డిలీట్ చేసినట్లుగానే సంభాషణ నుండి ఆహ్వానాన్ని అన్‌సెండ్ లేదా డిలీట్ చేయవచ్చు.

ముఖ్యమైనది: మీరు థ్రెడ్ నుండి ఆహ్వానాన్ని డిలీట్ చేసినప్పుడు, ఆ సంభాషణ ఆపై కొలబొరేషన్‌తో అనుబంధించబడదు, కానీ అది ఫైల్ నుండి పార్టిసిపెంట్‌లను తొలగించదు. వీక్షణ లేదా ఎడిటింగ్ అధికారాలను పూర్తిగా తొలగించడానికి యాప్‌లో పార్టిసిపెంట్ యాక్సెస్‌ను చెక్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.