iPhoneలో పాడ్‌కాస్ట్స్‌ను ప్రారంభించడం

పాడ్‌కాస్ట్స్ యాప్ లో వార్తలు, నిజమైన నేరాలు, కామెడీ, మొదలైనటువంటి అనేక విషయాలపై లక్షల కొద్దీ షోలు ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌లో చూడవచ్చు లేదా వినవచ్చు లేదా ఎపిసోడ్‌లు డౌన్‌లోడ్ చేయవచ్చు, తద్వారా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా వాటిని ప్లే చేయవచ్చు.

పాడ్‌కాస్ట్స్ యాప్‌లో పాడ్‌కాస్ట్ విభాగాలను చూపుతున్న శోధన స్క్రీన్. స్క్రీన్ దిగువన MiniPlayer ఉంది. దాని కింద హోమ్ బటన్, శోధన ఫీల్డ్ ఉన్నాయి.

పాడ్‌కాస్ట్స్‌ను వెతకడం

మీరు మీ ఆసక్తులకు సరిపోయే విభాగాలు, ఛానెల్‌లు, షోలు లేదా ఎపిసోడ్‌లను కనుగొనడానికి శోధన ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. విభాగం ఆధారంగా షోలను బ్రౌజ్ చేయడానికి శోధన బటన్ ట్యాప్ చేయండి లేదా శోధించండి. నిర్దిష్టమైన దాని కోసం శోధించడానికి షో పేరు, వ్యక్తి లేదా కేటగిరీ వంటి పదం లేదా పదబంధాన్ని నమోదు చేయండి.

పాడ్‌కాస్ట్స్ యాప్‌లో వీడియోను చూపుతున్న ‘ఇప్పుడు ప్లే అవుతోంది’ స్క్రీన్. వీడియో కింద పాడ్‌కాస్ట్ ఆర్ట్‌వర్క్, ఎపిసోడ్ టైటిల్, ప్లేబ్యాక్ కంట్రోల్స్, వాల్యూమ్ స్లైడర్ ఉన్నాయి. ట్యాబ్ దిగువన ’ట్రాన్స్‌స్క్రిప్ట్‌ను చూడండి’ బటన్, AirPlay ఐకాన్, ’తర్వాత ప్లే అయ్యేవి’ బటన్ ఉన్నాయి.

పాడ్‌కాస్ట్‌లను చూడటం, వినడం

షో లేదా ఎపిసోడ్‌ను ప్లే చేయడం ప్రారంభించడానికి ప్లే బటన్ ట్యాప్ చేయండి. ఆడియో ఎపిసోడ్‌ల కోసం, ‘ఇప్పుడు ప్లే అవుతోంది’ స్క్రీన్‌ను తెరవడానికి స్క్రీన్ దిగువన ఉన్న MiniPlayerను ట్యాప్ చేయండి, ఇక్కడ మీరు ప్లేబ్యాక్ కంట్రోల్‌లను యాక్సెస్ చేయవచ్చు, మీ క్యూ లేదా ట్రాన్‌స్క్రిప్ట్‌ను చూడవచ్చు, అలాగే ఆడియో, వీడియోల కోసం ఔట్‌పుట్ డివైజ్‌లను ఎంచుకోవచ్చు. వీడియో ఎపిసోడ్‌లు పూర్తి ప్లేబ్యాక్ కంట్రోల్‌లతో ‘ఇప్పుడు ప్లే అవుతోంది’ స్క్రీన్‌లో నేరుగా తెరవబడతాయి.

పాడ్‌కాస్ట్‌లు యాప్‌లోని ఎపిసోడ్ జాబితాను చూపించే షో పేజీ. స్క్రీన్ పైభాగంలో “వెనక్కి వెళ్ళండి,” “ఫాలో చేయండి, మరిన్ని” బటన్‌లు ఉంటాయి. స్క్రీన్ దిగువన MiniPlayer ఉంది. దాని కింద హోమ్, కొత్త, లైబ్రరీ, శోధన బటన్‌లు ఉన్నాయి.

షోను ఫాలో అవ్వండి

మీకు నచ్చిన షో దొరికినప్పుడు, దానిని మీ లైబ్రరీకి జోడించడానికి, ఫాలో బటన్ ట్యాప్ చేయండి. మీరు అనుసరించే షోలలో కొత్త ఎపిసోడ్‌లను ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయాలో లేదో, అలాగే కొత్త ఎపిసోడ్‌లు అందుబాటులో ఉన్నప్పుడు, వాటి కోసం నోటిఫికేషన్‌లను పొందాలో లేదో ఎంచుకోవచ్చు.

మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా?

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.