iPhoneలోని ఫోన్ యాప్‌లో Apple Intelligence ఉపయోగించడం

మీరు మీ iPhone నుండి చేసే ఫోన్, ఇంకా FaceTime ఆడియో కాల్స్ సారాంశాన్ని రూపొందించడానికి Apple Intelligence*ను ఉపయోగించవచ్చు. మీరు మీ iPhoneలో ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసినట్లయితే, మీరు నోట్స్ యాప్‌లో కూడా ఆ సారాంశాలను చూడవచ్చు. మీరు సారాంశాలను కాపీ చేసి, షేర్ చేయవచ్చు.

మిస్డ్ కాల్స్‌తో పాటు కనిపించే వాయిస్‌మెయిల్‌ల సారాంశాలను కూడా మీరు చూడవచ్చు, కాబట్టి ఎవరు సంప్రదించారో, వారు ఏమి చెప్పారో మీరు తక్షణమే చూడవచ్చు.

నోట్: Apple Intelligence అన్ని iPhone మొదళ్లలో లేదా అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు. ** అందుబాటులో ఉన్న అత్యంత ఇటీవలి ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి, మీరు సరికొత్త iOS వెర్షన్ను ఉపయోగిస్తున్నారని, అలాగే Apple Intelligence ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి.

ఫోన్ కాల్ సారాంశాన్ని చూడటం

మీరు ఫోన్ యాప్‌లో కాల్ రికార్డ్ చేసిన తర్వాత లేదా FaceTime ఆడియో కాల్ రికార్డ్ చేసిన తర్వాత, మీరు రికార్డింగ్ సారాంశాన్ని చూడవచ్చు.

నోట్: కాల్ రికార్డింగ్ అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు. మరింత సమాచారం కోసం iOS, iPadOS ఫీచర్ లభ్యత వెబ్‌సైట్‌ను చూడండి.

  1. మీ iPhoneలో ఫోన్ యాప్ కి వెళ్ళండి.

  2. కాల్‌ను రికార్డ్ చేయండి.

    మీ రికార్డింగ్ నోట్స్ యాప్‌లో సేవ్ చేయబడుతుంది.

  3. మీ iPhoneలో నోట్స్ యాప్ కి వెళ్ళండి.

  4. మీ కాల్ రికార్డింగ్‌ను (కాల్ రికార్డింగ్‌ల ఫోల్డర్‌లో) తెరవండి.

  5. రికార్డింగ్ ట్యాప్ చేసి, ఆపై ‘సారాంశం’ ట్యాప్ చేయండి.

సారాంశాన్ని కాపీ చేయడానికి లేదా షేర్ చేయడానికి, సారాంశం పైభాగంలో మరిన్ని బటన్ ట్యాప్ చేయండి, ఆపై ‘సారాంశాన్ని కాపీ చేయండి’ లేదా ‘సారాంశాన్ని షేర్ చేయండి’ ట్యాప్ చేయండి.

వాయిస్‌మెయిల్ సారాంశాలను చూడటం

  1. మీ iPhoneలో ఫోన్ యాప్ కి వెళ్ళండి.

  2. కాల్స్ ట్యాప్ చేసి, ఫిల్టర్ బటన్ ట్యాప్ చేయండి, ఆపై వాయిస్‌మెయిల్‌ను ట్యాప్ చేయండి.

  3. చదవని వాయిస్‌మెయిల్‌ల సారాంశాన్ని చూడటానికి వాయిస్‌మెయిల్‌ జాబితా కింద చూడండి.

వాయిస్ మెయిల్ సారాంశాలను ఆఫ్ చేయడానికి, FaceTime, ఫోన్ కోసం ‘నోటిఫికేషన్‌ల సారాంశాన్ని పొందండి’ ఆఫ్ చేయండి. నోటిఫికేషన్ సారాంశాలను కస్టమైజ్ చేయడం చూడండి.

*Apple Intelligence జనరేటివ్ మోడల్‌లను ఉపయోగిస్తుంది, ఔట్‌పుట్‌లు మారవచ్చు. ఖచ్చితత్వం కోసం ముఖ్యమైన సమాచారాన్ని చెక్ చేయండి.
**Apple Intelligence ఈ కింది భాషలకు మద్దతుతో బీటాలో అందుబాటులో ఉంది: ఇంగ్లీష్, డానిష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, నార్వేజియన్, పోర్చుగీస్, స్పానిష్, స్వీడిష్, టర్కిష్, చైనీస్ (సరళీకృతం), చైనీస్ (సాంప్రదాయ), జపనీస్, కొరియన్, ఇంకా వియత్నామీస్. కొన్ని ఫీచర్‌లు అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు. భాష, ఫీచర్ లభ్యత, ఇంకా సిస్టమ్ అవసరాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, Apple Intelligenceను ఎలా పొందాలి అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.