ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhone నుండి యాప్‌లను తొలగించడం లేదా డిలీట్ చేయడం

మీరు మీ iPhoneతో వచ్చిన కొన్ని బిల్ట్-ఇన్ యాప్లను తొలగించవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు.

నోట్: మీరు మీ iPhone నుండి బిల్ట్-ఇన్ యాప్‌ను తొలగించినప్పుడు, మీరు ఏదైనా సంబంధిత యూజర్ డేటా, కాన్ఫిగరేషన్ ఫైల్‌లను కూడా తొలగిస్తారు. మీ iPhone నుండి బిల్ట్-ఇన్ యాప్‌లను తొలగించడం వలన ఇతర సిస్టమ్ కార్యాచరణ కూడా ప్రభావితం కావచ్చు.

మీరు యాప్‌ను డిలీట్ చేయకుండా యాక్సెస్‌ను పరిమితం చేయాలనుకుంటే, యాప్‌ను లాక్ చేయడం లేదా దాచడంఅనే ఆర్టికల్ చూడండి.

యాప్ వినియోగాన్ని నివారించడానికి దాన్ని బ్లాక్ చేయడానికి, మీరు స్క్రీన్ టైమ్ సెట్టింగ్‌లను ఉపయోగించవచ్చు. యాప్‌లు, యాప్ డౌన్‌లోడ్‌లు, వెబ్‌సైట్‌లు, కొనుగోళ్ళను బ్లాక్ చేయడం అనే ఆర్టికల్ చూడండి.

మీరు యాప్‌లను డిలీట్ చేసిన తర్వాత మనసు మార్చుకుంటే, మీరు వాటిని తర్వాత మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు (అవి ఇప్పటికీ App Storeలో అందుబాటులో ఉంటే).

యాప్‌లను డిలీట్ చేయడం

దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

  • హోమ్ స్క్రీన్ నుండి యాప్‌ను తొలగించండి: హోమ్ స్క్రీన్‌పై ఉన్న యాప్‌ను టచ్ చేసి పట్టుకోండి, ‘యాప్‌ను తొలగించండి’ ట్యాప్ చేసి, ఆపై యాప్ లైబ్రరీలో ఉంచడానికి హోమ్ స్క్రీన్ నుండి ‘తొలగించండి’ ట్యాప్ చేయండి, లేదా దాన్ని iPhone నుండి డిలీట్ చేయడానికి ‘యాప్‌ను డిలీట్ చేయండి’ ట్యాప్ చేయండి.

  • యాప్ లైబ్రరీ, హోమ్ స్క్రీన్ నుండి యాప్‌ను డిలీట్ చేయండి: యాప్ లైబ్రరీలో యాప్‌ను టచ్ చేసి పట్టుకుని, ‘యాప్‌ను డిలీట్ చేయండి’ ట్యాప్ చేసి, ఆపై ‘డిలీట్ చేయండి’ ట్యాప్ చేయండి. (యాప్ లైబ్రరీలో మీ యాప్‌లను కనుగొనడం అనే ఆర్టికల్ చూడండి.)

మీకు కావాలంటే, మీరు తొలగించిన యాప్‌లను మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

థర్డ్ పార్టీ యాప్‌లను తొలగించడంతో పాటు, మీరు మీ iPhoneతో వచ్చిన ఈ బిల్ట్-ఇన్ Apple యాప్‌లను తొలగించవచ్చు:

నోట్: యూరోపియన్ యూనియన్‌లో, మీరు డిలీట్ చేయగల ఇతర బిల్ట్ ఇన్ యాప్‌లు ఉండవచ్చు. మరింత సమాచారం కోసం, కొన్ని దేశాలు లేదా ప్రాంతాలలో మీ iPhone లేదా iPad నుండి నిర్దిష్ట బిల్ట్-ఇన్ యాప్‌లను తొలగించడం అనే ఆర్టికల్ చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.