iPhoneలోని రిమైండర్స్ యాప్‌లో Apple Intelligenceను ఉపయోగించడం

Apple Intelligence*తో, మీరు ఇతర యాప్‌లలోని టెక్స్ట్ నుండి సూచించబడిన రిమైండర్‌లను పొందవచ్చు—Safariలోని ఆన్‌లైన్ రెసిపీ నుండి కిరాణా సామగ్రి లేదా Mailలోని ఇమెయిల్ సందేశం నుండి మీ యాక్షన్ ఐటెమ్‌లు వంటివి. రిమైండర్స్ యాప్ కూడా సంబంధిత రిమైండర్‌లను జాబితాలోని విభాగాలుగా ఆటోమేటిక్‌గా వర్గీకరించగలదు.

రిమైండర్స్ యాప్‌లో, రిమైండర్‌లు ఆటోమేటిక్‌గా విభాగాలలో వర్గీకరించబడిన జాబితా.

నోట్: Apple Intelligence అన్ని iPhone మొదళ్లలో లేదా అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు. ** అందుబాటులో ఉన్న అత్యంత ఇటీవలి ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి, మీరు సరికొత్త iOS వెర్షన్ను ఉపయోగిస్తున్నారని, అలాగే Apple Intelligence ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి.

సూచించబడిన రిమైండర్‌లను పొందండి

  1. మీరు జాబితాకు జోడించాలనుకుంటున్న సమాచారాన్ని తెరవండి - ఉదాహరణకు, Safariలో రెసిపీ లేదా నోట్స్‌లో మీటింగ్ నోట్స్.

  2. షేర్ బటన్ను ట్యాప్ చేసి, ఆపై ‘రిమైండర్స్’ ట్యాప్ చేయండి.

    చిట్కా: మీరు Apple Intelligence రివ్యూ చేయాలనుకుంటున్న నిర్దిష్ట టెక్స్ట్ లేదా బుల్లెట్‌లను కూడా ఎంచుకోవచ్చు. టెక్స్ట్‌ను ఎంచుకుని, ’షేర్’ ట్యాప్ చేసి, ఆపై ‘రిమైండర్స్’ ట్యాప్ చేయండి.

    మీరు ఎంచుకున్న టెక్స్ట్ దిగువన సూచించిన రిమైండర్‌లు కనిపించవచ్చు.

  3. రిమైండర్‌లను ఏ జాబితాకు జోడించాలో మార్చడానికి, స్క్రీన్ పైభాగంలో ఉన్న పాప్-అప్ మెన్యూను ట్యాప్ చేసి, ఆపై జాబితాను ఎంచుకోండి.

  4. సూచనను మీ జాబితాకు జోడించడానికి దాని పక్కన ఉన్న జోడించండి బటన్ ట్యాప్ చేయండి లేదా అన్ని సూచనలను జోడించడానికి ’అన్నింటిని చేర్చండి’ని ట్యాప్ చేయండి.

  5. ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి.

    మీరు ఎంచుకున్న జాబితాకు మీ రిమైండర్‌లు జోడించబడతాయి.

‘ఆటోమేటిక్ వర్గీకరణ’ను ఆన్ లేదా ఆఫ్ చేయడం

‘ఆటోమేటిక్ వర్గీకరణ’తో, Apple Intelligence సంబంధిత రిమైండర్‌లను జాబితాలోని విభాగాలుగా ఆటోమేటిక్‌గా సార్ట్ చేస్తుంది.

  1. మీ iPhoneలోని రిమైండర్స్ యాప్ కి వెళ్ళండి.

  2. జాబితాను ట్యాప్ చేయండి.

  3. దిగువ వాటిలో ఏదైనా చేయండి:

    • ‘ఆటోమేటిక్ వర్గీకరణ’ను ఆన్ చేయడం: మరిన్ని బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘ఆటోమేటిక్ వర్గీకరణ’ ట్యాప్ చేయండి.

    • ‘ఆటోమేటిక్ వర్గీకరణ’ను ఆఫ్ చేయడం: ఆటో-వర్గీకరణ బటన్ ట్యాప్ చేసి, ’ఆఫ్ చేయండి’ని ట్యాప్ చేసి, ఆపై విభాగాలను ఉంచాలా లేదా తొలగించాలా ఎంచుకోండి.

      నోట్: విభాగాలను తొలగించడం వల్ల రిమైండర్‌లు డిలీట్ చేయబడవు.

విభాగాలను వర్గీకరించిన విధానం మీకు నచ్చకపోతే, ఆటో-వర్గీకరణను ఆఫ్ చేసి, విభాగాలను తొలగించడానికి ప్రయత్నించి, ఆపై దాన్ని తిరిగి ఆన్ చేయండి. ఇది జాబితాలో మీ సెక్షన్ టైటిల్స్, ఆర్గనైజేషన్‌ను రీసెట్ చేస్తుంది.

*Apple Intelligence జనరేటివ్ మోడల్‌లను ఉపయోగిస్తుంది, ఔట్‌పుట్‌లు మారవచ్చు. ఖచ్చితత్వం కోసం ముఖ్యమైన సమాచారాన్ని చెక్ చేయండి.
**Apple Intelligence ఈ కింది భాషలకు మద్దతుతో బీటాలో అందుబాటులో ఉంది: ఇంగ్లీష్, డానిష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, నార్వేజియన్, పోర్చుగీస్, స్పానిష్, స్వీడిష్, టర్కిష్, చైనీస్ (సరళీకృతం), చైనీస్ (సాంప్రదాయ), జపనీస్, కొరియన్, ఇంకా వియత్నామీస్. కొన్ని ఫీచర్‌లు అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు. భాష, ఫీచర్ లభ్యత, ఇంకా సిస్టమ్ అవసరాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, Apple Intelligenceను ఎలా పొందాలి అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.