ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో Freeform బోర్డ్ కాపీ లేదా PDFను పంపడం

మీరు Freeform బోర్డ్ కాపీకి సంబంధించిన లింక్‌ను పంపవచ్చు, తద్వారా ఇతరులు కాపీని డౌన్‌లోడ్ చేసుకుని, దానిని వారి బోర్డ్‌లకు జోడించవచ్చు—మీరు మీ Apple ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు మాత్రమే అలా చేయవచ్చు. మీరు మీ Freeform బోర్డ్ కాపీని ఇతరులకు పంపడానికి దానిని PDFగా కూడా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు.

బోర్డ్ కాపీని పంపడం

కేవలం లింక్‌తో మీ బోర్డ్ కాపీని ఎవరికైనా పంపవచ్చు. వారు బోర్డ్ కాపీని తీసుకొని, దానిని వారి సొంతంగా మార్చుకోవచ్చు. బోర్డ్ కాపీని పంపడానికి మీరు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఉండి, iCloudకు సైన్ ఇన్ చేసి ఉండాలి.

  1. మీ iPadలో Freeform యాప్ కి వెళ్ళండి.

  2. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • అన్ని బోర్డ్‌లను బ్రౌజ్ చేస్తున్నప్పుడు: మీరు షేర్ చేయాలనుకుంటున్న బోర్డ్‌ను టచ్ చేసి ఉంచి, ఆపై ‘షేర్’ ట్యాప్ చేయండి.

    • బోర్డ్ లోపల నుండి: ‘బోర్డ్‌ను షేర్ చేయండి’ బటన్ ట్యాప్ చేయండి.

  3. బోర్డ్ పేరు దిగువన ఉన్న పాప్-అప్ మెన్యూను ట్యాప్ చేసి, ’కాపీని పంపండి’ ఎంచుకుని, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఒక దానిని ట్యాప్ చేయండి:

    • iCloud లింక్‌ను కాపీ చేయడం: లింక్ మీ క్లిప్‌బోర్డ్‌కు కాపీ చేయబడుతుంది. అప్పుడు మీరు దానిని మీకు నచ్చిన చోట పేస్ట్ చేయవచ్చు.

    • ఏదైనా కాంటాక్ట్ లేదా యాప్ ఐకాన్: స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

మీరు ఈ లింక్‌ను మీకు నచ్చినంత మంది స్వీకర్తలకు పంపవచ్చు. ఈ లింక్‌ను కలిగి ఉన్న వారు 30 రోజులలోపు కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బోర్డ్ కోసం బ్రౌజ్ చేస్తున్నప్పుడు, స్వీకర్తలు దానిని ‘అన్ని బోర్డ్‌లు’లో కనుగొనవచ్చు, ‘షేర్ చేసినవి’ విభాగంలో కాదు. (‘షేర్ చేసినవి’ విభాగం మీరు కొలబొరేట్ చేస్తున్న బోర్డ్‌ల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.)

ఒకరి అప్‌డేట్‌లను మరొకరు చూడగలిగేలా మీరు మీ బోర్డ్‌ను కొలబొరేటివ్ పద్దతిలో షేర్ చేయాలనుకుంటే— Freeform బోర్డ్‌లను షేర్ చేయడం, కొలబొరేట్ చేయడం అనే ఆర్టికల్ చూడండి.

ప్రతి కొత్త లింక్, మీరు లింక్‌ను సృష్టించిన సమయంలో బోర్డ్ కాపీని పంపుతుంది. మీరు ఎవరికైనా కాపీని పంపినప్పుడు, లింక్‌లో కొత్త బోర్డ్ తెరవబడుతుంది. మీ బోర్డ్‌లో చేసే మార్పులు వారి బోర్డ్‌లో కనిపించవు, అలాగే వారు చేసిన మార్పులు మీ బోర్డ్‌ను ప్రభావితం చేయవు.

నోట్: కాపీని పంపడం వలన ఒరిజినల్ బోర్డ్‌కు యాక్సెస్ ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు. బోర్డ్‌కు యాక్సెస్‌ను మార్చడానికి షేరింగ్ సెట్టింగ్‌లను నిర్వహించడం చూడండి.

బోర్డ్ PDFను పంపడం

  1. మీ iPadలో Freeform యాప్ కి వెళ్ళండి.

  2. బోర్డ్‌ను తెరవండి, లేదా కొత్త బోర్డ్‌ను ప్రారంభించడానికి కొత్త బోర్డ్ బటన్ ట్యాప్ చేయండి.

  3. మీరు పంపాలనుకుంటున్న బోర్డ్‌లో, యాక్షన్‌ల మెన్యూ బటన్ను ట్యాప్ చేసి, ఆపై ‘PDFగా ఎగుమతి ఎక్స్‌పోర్ట్ చేయండి’ని ట్యాప్ చేయండి.

    మీరు సీన్‌లను మీ బోర్డ్‌లో సేవ్ చేసినట్లయితే, దిగువ పేర్కొన్న విధానాల్లో ఒక రకంగా ఎక్స్‌పోర్ట్ చేయడాన్ని ఎంచుకోండి:

    • మొత్తం బోర్డ్‌ను ఒకే పేజీగా ఎక్స్‌పోర్ట్ చేయడం: బోర్డ్‌ను ట్యాప్ చేయండి.

    • ఒక పేజీకి ఒక సీన్: ‘సీన్‌లు’ ట్యాప్ చేయండి.

  4. మీరు PDFను ఎలా పంపాలనుకుంటున్నారో, ఉదా, ’సందేశాలు’ లేదా Mail వంటి పద్దతిని ఎంచుకొని, ఆపై స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

    మీరు ఇటీవల కమ్యూనికేట్ చేసిన వ్యక్తులు మరియు గ్రూప్‌లు ఐకాన్‌లుగా కనిపిస్తాయి. వారికి బోర్డ్‌ను పంపడానికి ఒక దానిని ట్యాప్ చేయండి.

మీరు ‘అన్ని బోర్డ్‌లు’ బ్రౌజ్ చేస్తున్నప్పుడు బోర్డ్‌ను PDFగా కూడా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. బోర్డ్ థంబ్‌నెయిల్ లేదా పేరును టచ్ చేసి ఉంచి, ‘షేర్’ ట్యాప్ చేసి, ఆపై ‘PDFగా ఎక్స్‌పోర్ట్ చేయండి’ని ట్యాప్ చేయండి.

చిట్కా: మీ బోర్డ్ PNGని పంపడానికి, స్క్రీన్‌షాట్ తీసి, ఫోటోస్ యాప్ నుండి దానిని షేర్ చేయండి. మీరు షేర్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌లను కూడా ఎంచుకుని, కాపీ చేసి, ఆపై వాటిని ఇతర యాప్‌లలో (ఉదాహరణకు, Mail లేదా ఫైల్స్) PNGగా పేస్ట్ చేయవచ్చు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.