ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో క్విక్ నోట్స్ ఉపయోగించడం

మీరు iPadలోని ఏదైనా యాప్ లేదా స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని రాయడానికి క్విక్ నోట్స్‌ను ఉపయోగించవచ్చు. ముఖ్యమైన పేర్లు, నంబర్లు, ఆలోచనలను సులభంగా చూడటానికి వీలుగా లింక్‌లు, ఇమేజ్‌లు, ట్యాగ్‌లను, ప్రస్తావనలను క్విక్ నోట్‌కు జోడించవచ్చు. మీరు Safariలో టెక్స్ట్‌ను హైలైట్ చేసినా లేదా యాప్ నుండి లింక్‌ను జోడించినా, మీరు తర్వాతి సారి సైట్‌ను సందర్శించినప్పుడు క్విక్ నోట్ థంబ్‌నెయిల్ కనిపిస్తుంది, దాని ద్వారా మీరు చివరిగా చూసిన అంశానికి వెళ్ళవచ్చు.

ఐస్‌ల్యాండ్ మ్యాప్‌పై ఉన్న విండోలో క్విక్ నోట్. మ్యాప్ లింక్ చేయడానికి నోట్‌లో టెక్స్ట్, ఆప్షన్ ఉన్నాయి.

మీరు మీ అన్ని క్విక్ నోట్స్‌ను నోట్స్ యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు. అలాగే మీరు మీ iPadలో క్విక్ నోట్ చేసినప్పుడు, మీరు దాన్ని మీ iPhone, Macలో కూడా చూడవచ్చు.

క్విక్ నోట్ చేయడం కోసం

క్విక్ నోట్‌ను సృష్టించడానికి, కింది వాటిలో ఏదైనా చేయండి:

  • ఏదైనా యాప్ లేదా స్క్రీన్ నుండి: క్విక్ నోట్ బటన్ను Control Centerకు జోడించండి, క్విక్ నోట్ బటన్ ట్యాప్ చేసి, ఆపై పూర్తిని ట్యాప్ చేయండి. మీరు పూర్తి చేసినప్పుడు ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి.

  • మద్దతు ఉన్న యాప్‌ల నుండి: షేర్ బటన్ ట్యాప్ చేయండి, ‘మరిన్ని’ ట్యాప్ చేసి, ఆపై ‘క్విక్ నోట్‌కు జోడించండి’ ట్యాప్ చేయండి. మీరు పూర్తి చేసినప్పుడు ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి.

  • మీ iPad Apple ఎక్స్‌టర్నల్ కీబోర్డ్‌కు కనెక్ట్ చేసి ఉంటే, క్విక్ నోట్‌ను తెరవడానికి Globe-Q కీబోర్డ్ షార్డ్‌కట్‌ను ఉపయోగించండి. క్విక్ నోట్స్ ఇప్పటికే తెరిచి ఉన్నట్లయితే, మీరు కొత్త నోట్ సృష్టించడానికి ‘కమాండ్-N’ ఉపయోగించవచ్చు.

మూలన జెశ్చర్‌తో క్విక్ నోట్స్ తీసుకోండి

Apple Pencil ఉపయోగించి డిస్‌ప్లేకు దిగువన కుడివైపు మూల నుండి ఎగువకు స్వైప్ చేయండి.

చిట్కా: మీరు మీ వేలితో కూడా ఈ జెశ్చర్‌ను చేయవచ్చు—సెట్టింగ్స్  > మల్టీటాస్కింగ్ & జెశ్చర్స్‌కు వెళ్లి, ఆపై 'మూల నుండి వేలిని స్వైప్ చేయండి'ని ఆన్ చేయండి.

సెట్టింగ్స్  > యాప్స్ > నోట్స్‌కు వెళ్లి, ‘మూల జెశ్చర్‌లు’ ట్యాప్ చేసి, ఆపై దిగువ వాటిలో ఏదైనా చేయండి:

  • మూల నుండి స్వైప్ చేయడానికి ‘వేలిని అనుమతించండి’ ఆన్ లేదా ఆఫ్ చేయండి.

  • ఎడమ వైపు మూలకు స్వైప్ లేదా కుడి వైపు ములకు స్వైప్ చేయండి, ఆపై యాక్షన్‌ను ఎంచుకోండి.

క్విక్ నోట్స్‌ను చూడటం, ఆర్గనైజ్ చేయడం

  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. ఫోల్డర్ల జాబితాలో ఉన్న క్విక్ నోట్స్‌పై ట్యాప్ చేయండి.

    ఫోల్డర్‌ల జాబితాను చూపడానికి మీరు సైడ్‌బార్‌ను టోగల్ చేయండి బటన్ ట్యాప్ చేయాల్సి రావచ్చు.

నోట్: మీరు క్విక్ నోట్‌ను వేరే ఫోల్డర్‌కు తరలిస్తేనే దాన్ని లాక్ చేయగలరు.

మీరు వ్యక్తిగత క్విక్ నోట్‌ను వేరే ఫోల్డర్‌కు తరలిస్తే, అది స్టాండర్డ్ నోట్ అవుతుంది, అలాగే ఇతర యాప్‌లలో ఇకపై క్విక్ నోట్‌గా కనిపించదు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.