ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని క్యాలెండర్‌లో ఆహ్వానాలకు రిప్లై ఇవ్వడం

క్యాలెండర్ యాప్‌లో, మీరు అందుకున్న మీటింగ్, ఇవెంట్ ఆహ్వానాలకు రిప్లై ఇవ్వండి.

ఇవెంట్ ఆహ్వానానికి రిప్లై ఇవ్వడం

  1. ఇవెంట్ నోటిఫికేషన్‌కు ప్రతిస్పందించడానికి, దానిని ట్యాప్ చేయండి.

    లేదా, క్యాలెండర్‌లో, ఇన్‌బాక్స్ బటన్ను ట్యాప్ చేసి, ఆపై ఆహ్వానాన్ని ట్యాప్ చేయండి.

  2. ‘హాజరవుతాను’, ‘బహుశా హాజరు కావచ్చు’, లేదా ‘హాజరు కాను’ అనే మూడు ఎంపికలలో మీరు కోరుకునే ప్రతిస్పందనను ట్యాప్ చేయండి.

మీరు ఇమెయిల్ ద్వారా అందుకున్న ఆహ్వానానికి ప్రతిస్పందించడానికి, ఇమెయిల్‌లో అండర్‌లైన్ చేసిన టెక్స్ట్‌ను ట్యాప్ చేసి, ఆపై ‘క్యాలెండర్‌లో చూపండి’ని ట్యాప్ చేయండి.

మీరు మీ ప్రతిస్పందనకు కామెంట్‌లను జోడిస్తే, మీ కామెంట్‌లు ఆర్గనైజర్‌కు కనిపిస్తాయి, కానీ ఇతర ఆహ్వానితులకు కనిపించవు (కామెంట్‌లు అన్ని క్యాలెండర్‌లలో అందుబాటులో ఉండకపోవచ్చు). మీరు తిరస్కరించిన ఇవెంట్‌లను చూడటానికి, క్యాలెండర్‌లు బటన్ ట్యాప్ చేసి, ఆపై ’తిరస్కరించిన ఇవెంట్‌లను చూపండి’ ఆన్ చేయండి.

వేరే మీటింగ్ సమయాన్ని సూచించడం

మీరు అందుకున్న మీటింగ్ ఆహ్వానం కోసం మీరు వేరే సమయాన్ని సూచించవచ్చు.

  1. మీ iPadలో క్యాలెండర్ యాప్ కి వెళ్లండి.

  2. మీటింగ్‌ను ట్యాప్ చేసి, ఆపై ‘కొత్త సమయాన్ని ప్రతిపాదించండి’ని ట్యాప్ చేయండి.

  3. సమయాన్ని ట్యాప్ చేసి, ఆపై కొత్త సమయాన్ని నమోదు చేయండి.

  4. ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేసి, ఆపై ’పంపండి’ ట్యాప్ చేయండి.

మీ క్యాలెండర్ సర్వర్ సామర్థ్యాలను బట్టి, ఆర్గనైజర్ కౌంటర్-ప్రతిపాదనను లేదా మీ సూచనతో కూడిన ఇమెయిల్‌ను అందుకుంటారు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.