iPadలో మీ జర్నల్ సెట్టింగ్‌లను మార్చడం

మీరు జర్నల్ యాప్ కోసం సెట్టింగ్‌లను కస్టమైజ్ చేయవచ్చు; ఉదాహరణకు, iPhone నుండి జర్నలింగ్ సూచనలను సింక్ చేయడానికి అనుమతించండి, మీ జర్నల్‌ను లాక్ చేయండి, జర్నలింగ్ కోసం షెడ్యూల్‌ను సెట్ చేయండి, ఇంకా మరెన్నో.

iPhone నుండి జర్నలింగ్ సూచనలను సింక్ చేయడం

మీరు ఒకే Apple ఖాతాలోకి సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు జర్నలింగ్ సూచనలను iPhone నుండి iPadకు సింక్ చేయవచ్చు.

  1. iPhone జర్నలింగ్ సూచనలను ఆన్ చేయండి. జర్నలింగ్ సూచనలను ఆన్ లేదా ఆఫ్ చేయడం అనే ఆర్టికల్ చూడండి.

  2. మీ iPadలో, సెట్టింగ్స్ యాప్ కు వెళ్ళి, ఆపై ’గోప్యత, భద్రత’పై ట్యాప్ చేయండి.

  3. జర్నలింగ్ సూచనలను ట్యాప్ చేసి, ఆపై ’జర్నలింగ్ సూచనలను ఆన్ చేయండి ’ట్యాప్ చేయండి.

  4. ‘iPadకు సింక్ చేయడానికి అనుమతించండి’ని ఆన్ చేయండి.

కొత్త జర్నల్ ఎంట్రీలకు టైటిల్, తేదీ లేదా ప్రస్తుత లొకేషన్ జోడించడం

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. ‘యాప్స్’ ట్యాప్ చేసి, జర్నల్‌ను ట్యాప్ చేయండి, ఆపై దిగువ వాటిలో ఏదైనా చేయండి:

    • కొత్త ఎంట్రీలకు లొకేషన్ జోడించడం: ’ప్రస్తుత లొకేషన్‌ను జోడించండి’ని ఆన్ చేయండి.

    • కొత్త ఎంట్రీలకు టైటిల్‌ను జోడించడం: ’ఎంట్రీ టైటిల్‌ను జోడించండి’ టైటిల్‌ను ట్యాప్ చేసి, ఆపై ’ఎల్లప్పుడూ,’ ’మూమెంట్‌ల కోసం మాత్రమే’ లేదా ’ఎప్పుడూ వద్దు’ ఎంచుకోండి.

    • క్షణం నుండి తేదీని, ఎంట్రీ తేదీగా ఉపయోగించడం: ’ఎల్లప్పుడూ మూమెంట్ తేదీని ఉపయోగించండి’ ఆన్ చేయండి.

జర్నల్‌లో తీసిన ఫోటోలు, వీడియోలను ఫోటోస్ యాప్‌లో సేవ్ చేయడం

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. యాప్‌లను ట్యాప్ చేసి, ఆపై జర్నల్‌ను ట్యాప్ చేయండి.

  3. ‘ఫోటోస్ యాప్‌లో సేవ్ చేయండి’ ఆన్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.