ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని హోమ్‌లో భద్రతా కెమెరాలను సెటప్ చేయడం

మీ హోమ్ కెమెరాలు తీసిన వీడియో యాక్టివిటీని చూడటానికి మీరు హోమ్ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఏదైనా Apple Home అనుకూల కెమెరాతో, మీరు హోమ్ యాప్‌లో వీడియో స్ట్రీమ్‌లను చూడవచ్చు, ఆ స్ట్రీమ్‌లను ఎవరు చూడవచ్చో ఎంచుకోవచ్చు, అలాగే యాక్టివిటీని గుర్తించినప్పుడు నోటిఫికేషన్‌లను పొందేలా సెటప్ చేయవచ్చు.

అనుకూల భద్రతా కెమెరాల జాబితా కోసం హోమ్ యాక్సెసరీల వెబ్‌సైట్లో చూడండి.

మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ HomeKit సురక్షిత వీడియో కెమెరాలను కలిగి ఉంటే, మీరు అదనంగా దిగువ పేర్కొన్న ఫీచర్‌లను ఉపయోగించుకోవచ్చు:

  • ఎన్‌క్రిప్ట్ చేయబడిన వీడియో: మీ కెమెరాలు క్యాప్చర్ చేసిన వీడియో ప్రైవేట్‌గా మీ హోమ్ హబ్ డివైజ్‌లో (Apple TV 4K లేదా HomePod) విశ్లేషించబడి, ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది, అలాగే అది సురక్షితంగా iCloudకు అప్‌లోడ్ చేయబడుతుంది, తద్వారా మీరు, దాన్ని ఎవరితో అయితే షేర్ చేశారో వారు మాత్రమే ఆ డేటాను చూడగలుగుతారు.

  • వీడియోను రికార్డ్ చేయండి: మీరు iCloud+కు సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లయితే, మీరు ఒకటి నుండి అపరిమిత సంఖ్యలో కెమెరాలకు సంబంధించి గత 10 రోజుల యాక్టివిటీని చూడవచ్చు. 50 GB iCloud+ ప్లాన్ ఒకే కెమెరాకు మద్దతు ఇస్తుంది, 200 GB iCloud+ ప్లాన్ ఐదు కెమెరాలకు మద్దతు ఇస్తుంది, 2 TB, 6 TB, అలాగే 12 TB iCloud+ ప్లాన్‌లు అపరిమిత సంఖ్యలో కెమెరాలకు మద్దతు ఇస్తాయి.

    నోట్: మీ iCloud స్టోరేజ్ పరిమితిలో వీడియో కంటెంట్ భాగంగా పరిగణించబడదు.

  • యాక్టివిటి జోన్‌లు: మీ కెమెరాను దాని వీక్షణలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాలపై ఫోకస్ చేసే జోన్‌లను సృష్టించండి.

  • ఫేస్ రికగ్నిషన్: మీరు ఫోటోస్ యాప్‌లో ట్యాగ్ చేసిన వ్యక్తులు కెమెరా వీక్షణలో కనిపించినప్పుడు నోటిఫికేషన్‌లను అందుకోండి.

iCloud యూజర్ గైడ్‌లో HomeKit సురక్షిత వీడియోతో iCloudలో ఎన్‌క్రిప్ట్ చేయబడిన భద్రతా కెమెరా ఫుటేజీని స్టోర్ చేయడం, అలాగే మీ డివైజ్‌లన్నింటిలో HomeKit సురక్షిత వీడియోను సెటప్ చేయడం అనే ఆర్టికల్‌లను చూడండి.

ఎడమ వైపు సైడ్‌బార్‌తో కూడిన హోమ్ యాప్. హోమ్ హైలైట్ చేయబడింది. కుడివైపున ఉన్నవి ఐదు సెక్యూరిటీ కెమెరాల ఇమేజ్‌లు

కెమెరా ఎంపికలు

మీరు హోమ్ యాప్‌లో కెమెరాను జోడించినప్పుడు, మీరు స్ట్రీమింగ్ ఎంపికలను ఎంచుకుని, కెమెరాను రూమ్‌కు కేటాయించవచ్చు. HomeKit సురక్షిత వీడియో కెమెరాతో, మీరు రికార్డింగ్ ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు. డిఫాల్ట్‌గా, నాలుగు కెమెరాల వరకు ఇష్టమైనవిగా మార్క్ చేయవచ్చు, అప్పుడు అవి హోమ్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. ఆ సెట్టింగ్‌లను తరువాత ఎడిట్ చేయడానికి, ఈ ఎంపికలను చూడటానికి కెమెరా టైల్‌ను ట్యాప్ చేసి, ఆపై సెట్టింగ్స్ బటన్ను ట్యాప్ చేయండి:

  • రూమ్: కెమెరా మీ హోమ్‌లోని రూమ్‌లో ఉండవచ్చు లేదా మీరు మీ ముందు స్థలం లేదా వెనుక యార్డ్ వంటి బయటి లొకేషన్ కోసం రూమ్‌ను సృష్టించవచ్చు.

  • నోటిఫికేషన్‌లు: కెమెరా యాక్టివిటీని గుర్తించినప్పుడు, స్టేటస్ మారినప్పుడు, ఆఫ్‌లైన్‌కు వెళ్ళినప్పుడు నోటిఫికేషన్‌లను స్వీకరించడం ఎంచుకోండి.

  • HomeKit సురక్షిత వీడియో కెమెరాలకు సంబంధించిన రికార్డింగ్ ఎంపికలు: మీరు ఇంట్లో ఉన్నప్పుడు, అలాగే ఇంట్లో లేనప్పుడు రెండు సందర్భాల కోసం ప్రత్యేక రికార్డింగ్ సెట్టింగ్‌లను సృష్టించవచ్చు. ఉదాహరణకు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీ ఇంటి లోపల ఉన్న కెమెరా స్ట్రీమింగ్, రికార్డింగ్ ఆపివేయడాన్ని ఎంచుకోవచ్చు, కానీ బయటి కెమెరా స్ట్రీమ్ చేయడం, రికార్డ్ చేయడం కొనసాగించవచ్చు.

    నోట్: హోమ్ యాప్ ‘ఇంట్లో ఉన్నారు’, ‘ఇంట్లో లేరు’ మధ్య మారడానికి, హోమ్ మెంబర్‌లకు చెందిన డివైజ్ లొకేషన్‌ను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, మీరు మీ iPadతో ఇంటి నుండి పని కోసం బయటకు వెళ్ళినప్పుడు, కెమెరా ‘ఇంట్లో ఉన్నప్పుడు’ సెట్టింగ్స్ నుండి ‘ఇంట్లో లేనప్పుడు’ సెట్టింగ్స్‌కు మారుతుంది.

నోటిఫికేషన్స్‌ను సెటప్ చేయడం

  1. మీ iPadలో హోమ్ యాప్ కు వెళ్ళండి.

  2. ‘మరిన్ని’ బటన్ను ట్యాప్ చేసి, ఆపై హోమ్ సెట్టింగ్స్‌ను ట్యాప్ చేయండి.

  3. ‘కెమెరాలు & డోర్ బెల్‌లు’ను ట్యాప్ చేయండి.

  4. కెమెరాను ట్యాప్ చేసి, ఆపై ‘యాక్టివిటి నోటిఫికేషన్స్‌’ను ఆన్ చేయండి.

    కదలికను గుర్తించినప్పుడు అన్ని Apple Home అనుకూల కెమెరాలు నోటిఫికేషన్‌ను పంపుతాయి. HomeKit సురక్షిత వీడియో కెమెరాలు దిగువన పేర్కొన్న అంశాల ఆధారంగా అదనంగా నోటిఫికేషన్‌లను పంపుతాయి:

    • రోజులో ఏదైనా సమయం

    • ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు లేదా లేనప్పుడు

    • క్లిప్ రికార్డ్ చేయబడినప్పుడు

    • ఏదైనా లేదా నిర్దిష్ట రకమైన కదలికను గుర్తించినప్పుడు

      మీరు నిర్దిష్ట కదలికను ఎంచుకున్నప్పుడు, మనుషులను, జంతువులను లేదా వాహనాలను కెమెరా గుర్తించినప్పుడు లేదా ప్యాకేజీ డెలివరీ చేయబడినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్యాకేజీ గుర్తించబడాలంటే, అది డెలివరీ అయిన తర్వాత కెమెరా వీక్షణలో ఉండాలి.

      ఏదైనా కదలికకు బదులుగా ఒక నిర్దిష్ట కదలికను ఎంచుకుంటే, రివ్యూ చేయడానికి తక్కువ క్లిప్‌లు (తక్కువ క్లిప్ నోటిఫికేషన్‌లు), తక్కువ వీడియో లభిస్తుంది. ఉదాహరణకు, మీరు వ్యక్తులను గుర్తించాలనుకుంటే, చెట్టుపై ఆకుల కదలికను లేదా ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకుతున్న ఉడుత కదలికను మీ కెమెరా రికార్డ్ చేయదు.

HomeKit సురక్షిత వీడియో కెమెరాల కోసం యాక్టివిటి జోన్‌లను సృష్టించడం

మీరు మీ HomeKit సురక్షిత వీడియో కెమెరాను దాని వీక్షణలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఫోకస్ చేసే జోన్‌లను సృష్టించవచ్చు-ఉదాహరణకు, మీ ముందు నడక మార్గం, కానీ దాని వెనుక ఉన్న నడక మార్గం కాదు. ఈ జోన్‌లలో కదలిక కనుగొనబడినప్పుడు మీకు అలర్ట్‌లు వస్తాయి.

నోట్: నిర్దిష్ట కదలికను గుర్తించినప్పుడు రికార్డ్ చేయడానికి సెటప్ చేసిన కెమెరాలకు మాత్రమే మీరు యాక్టివిటి జోన్‌లను సృష్టించవచ్చు. యాక్టివిటి జోన్‌లు కదలికను గుర్తించే ఆటోమేషన్‌లను ప్రభావితం చేయవు.

  1. మీ iPadలో హోమ్ యాప్ కు వెళ్ళండి.

  2. హోమ్ ట్యాబ్‌లో కెమెరా టైల్‌ను ట్యాప్ చేసి, ఆపై సెట్టింగ్స్ బటన్ను ట్యాప్ చేయండి.

  3. ‘యాక్టివిటి జోన్‌లను ఎంచుకోండి’ని ట్యాప్ చేసి, ఆపై జోన్‌ను సృష్టించడానికి వీడియోను ట్యాప్ చేయండి.

    మీరు నిర్వచించిన జోన్ వెలుపల మాత్రమే వచ్చే కదలికను మీ కెమెరా గుర్తించడానికి, ‘ఇన్వర్ట్ జోన్’ను ట్యాప్ చేయండి.

  4. కెమెరా వీక్షణలో మీకు కావలసిన అదనపు జోన్‌లను సృష్టించండి- ఉదాహరణకు, ఒకటి డ్రైవ్ వే కోసం, మరొకటి మెయిల్‌బాక్స్ కోసం.

  5. ‘పూర్తి’ని ట్యాప్ చేయండి.

యాక్టివిటి జోన్‌ను తొలగించడానికి, ‘యాక్టివిటి జోన్‌లను ఎంచుకోండి’ని ట్యాప్ చేసి, జోన్ లోపల ట్యాప్ చేసి, ఆపై ‘క్లియర్ చేయండి’ని ట్యాప్ చేయండి.

వీడియోను చూడటం

  1. మీ iPadలో హోమ్ యాప్ కు వెళ్ళండి.

  2. హోమ్ ట్యాబ్‌లో, కెమెరా టైల్‌ను ట్యాప్ చేయండి.

    లైవ్ వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది.

  3. మీరు వీడియోను రికార్డ్ చేయడం ఎంచుకున్నట్లయితే, రికార్డ్ చేసిన క్లిప్‌లను బ్రౌజ్ చేయడానికి స్క్రీన్ దిగువన ఉన్న టైమ్‌లైన్‌ను స్వైప్ చేయండి.

  4. క్లిప్‌ను ప్లే చేయడానికి దానిని ట్యాప్ చేయండి.

  5. టైమ్‌లైన్ చూపించడానికి ఎడమ, కుడివైపు తెరిచి ఉన్న క్లిప్‌ను పించ్ చేయండి, ఆపై వీడియో ద్వారా ముందుకు లేదా వెనుకకు వెళ్ళడానికి డ్రాగ్ చేయండి.

  6. లైవ్ వీడియోకు తిరిగి మారడానికి ‘లైవ్’ను ట్యాప్ చేయండి.

మీరు నిర్దిష్ట కదలికను గుర్తించడానికి కెమెరాను సెటప్ చేసినప్పుడు, వ్యక్తులు, జంతువులు, వాహనాలు, ప్యాకేజీలకు సంబంధించి ప్రత్యేకమైన చిహ్నాలను టైమ్‌లైన్ డిస్‌ప్లే చేస్తుంది.

నోట్: మీ ఇంట్లో హోమ్ హబ్‌లు విశ్లేషించగల కెమెరాల పరిమితి కంటే ఎక్కువ కెమెరాలు ఉన్నట్లయితే, కొన్ని కెమెరాలు క్యాప్చర్ చేసిన వీడియోలు విశ్లేషించబడకపోవచ్చు. క్లిప్‌లు రికార్డ్ చేయబడతాయి, కానీ అవి విశ్లేషించబడని వీడియోను సూచించే బ్యాడ్జ్తో కనిపిస్తాయి, అంటే నిర్దిష్ట కదలిక కోసం వీడియో విశ్లేషించబడలేదని అర్థం.

macOS 10.15.1 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో రన్ అయ్యే మీ Macలో హోమ్ యాప్‌లో మీరు లైవ్, రికార్డ్ చేయబడిన వీడియోను చూడవచ్చు.

యాక్సెస్ ఎంపికలను ఎంచుకోవడం

మీ కెమెరాల నుండి వీడియోను చూడటం కోసం ఇతరులను అనుమతించడానికి, దిగువ పేర్కొన్న దశలను ఫాలో అవ్వండి:

  1. మీ iPadలో హోమ్ యాప్ కు వెళ్ళండి.

  2. ‘మరిన్ని’ బటన్ను ట్యాప్ చేసి, ఆపై హోమ్ సెట్టింగ్స్‌ను ట్యాప్ చేయండి.

  3. ‘వ్యక్తులు’ హెడ్డింగ్ దిగువన, వ్యక్తిని ట్యాప్ చేయండి.

  4. ‘కెమెరాలు’ను ట్యాప్ చేసి, ఆపై ఒక ఎంపికను ఎంచుకోండి.

మీ కెమెరాల నుండి వీడియోను చూడటానికి ఇతరులను ఎలా అనుమతించాలో తెలుసుకోవడానికి, మీ హోమ్‌‌లో యాక్సెసరీలను కంట్రోల్ చేయడానికి ఇతరులను ఆహ్వానించడం చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.