ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని మ్యాప్స్‌లో ప్రదేశాలకు రేటింగ్ ఇవ్వడం, ఫోటోలను జోడించడం

మీరు మ్యాప్స్ ఇతర యూజర్‌లకు సహాయపడటానికి మీరు సందర్శించే ప్రదేశాలకు సంబంధించిన రేటింగ్‌లు, ఫోటోలను అందించవచ్చు.

మీరు ఒకే Apple ఖాతాకు సైన్ ఇన్ చేసిన ప్రతిచోటా మీ రేటింగ్‌లు, ఫోటోలు కనిపిస్తాయి.

నోట్: అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో Apple Ratings, ఇంకా ఫోటోస్ ఫీచర్ అందుబాటులో లేదు.

ఫోటోలను జోడించడానికి లేదా బ్రౌజ్ చేయడానికి లేదా స్థలాన్ని రేట్ చేయడానికి లొకేషన్, ఫోటోలు అలాగే బటన్‌ల కోసం మొత్తం రేటింగ్‌తో ప్లేస్ కార్డ్‌తో ఉన్న iPad.

ప్రదేశానికి రేటింగ్ ఇవ్వడం

  1. మీ iPadలో మ్యాప్స్ యాప్ కి వెళ్ళండి.

  2. మ్యాప్ లేదా శోధన ఫలితంలోని ప్రదేశాన్ని ట్యాప్ చేసి, ఆపై లైక్ బటన్ ట్యాప్ చేయండి.

  3. అందుబాటులో ఉన్న విభాగాల కోసం లైక్ బటన్ లేదా డిస్‌లైక్ బటన్ను ట్యాప్ చేసి, ఆపై ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి.

మీరు మనసు మార్చుకుంటే తర్వాత రేటింగ్‌లను ఎడిట్ చేయవచ్చు.

ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను జోడించడం

  1. మీ iPadలో మ్యాప్స్ యాప్ కి వెళ్ళండి.

  2. మ్యాప్ లేదా శోధన ఫలితంలోని ప్రదేశాన్ని ట్యాప్ చేసి, ఆపై మరిన్ని బటన్ ట్యాప్ చేయండి.

  3. ‘మీ ఫోటోలను జోడించండి’ ట్యాప్ చేసి, ఆపై స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.

    Appleకు మీ ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి, మీకు Apple ఖాతా ఉండాలి.

    నోట్: మీకు రేటింగ్ విభాగాలు లేదా ‘రేటింగ్ ఇవ్వండి’ బటన్ కనిపించకపోతే, మీరు ఫోటోను జోడించలేరు.

  4. మీరు మీ పేరు లేదా ముద్దుపేరుతో అందించిన ఫోటోలకు క్రెడిట్ పొందడానికి, ‘ఫోటో క్రెడిట్’ ట్యాప్ చేసి, ఆపై ‘క్రెడిట్ చూపండి’ని ఆన్ చేయండి. కావాలనుకుంటే, మీరు మీ కోసం ఒక ముద్దుపేరును నమోదు చేయవచ్చు. (మీరు ఎంచుకున్న ఫోటో క్రెడిట్ ఆప్షన్ మీరు గతంలో సబ్మిట్ చేసిన అన్ని ఫోటోలకు, అలాగే భవిష్యత్తులో సబ్మిట్ చేసే ఫోటోలకు కూడా వర్తిస్తుంది.)

మీ ఫోటోలను పబ్లిక్‌గా షేర్ చేయడం

మీరు మ్యాప్స్‌కు జోడించే ఫోటోలను వారి సొంత ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లలో ఉపయోగించడానికి మీరు కంపెనీలను అనుమతించవచ్చు.

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. యాప్స్‌ను ట్యాప్ చేసి, ఆపై మ్యాప్స్‌ను ట్యాప్ చేయండి.

  3. ‘మీ ఫోటోలను ఉపయోగించడానికి ఫోటో ప్రొవైడర్‌లను అనుమతించండి’ని ఆన్ చేయండి.

మీరు షేర్ చేసే ఫోటోలలో లొకేషన్ డేటా ఉంటుంది, కానీ మీ ఐడెంటిటీ ఉండదు. మీరు ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేస్తే, ఫోటో ప్రొవైడర్‌లు మీ ఫోటోలను ఉపయోగించలేరు. (అవి అందుబాటులోకి రావడానికి చూపడానికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు.)

ప్రదేశానికి సంబంధించి మీరు అందించిన ఫోటోలను ఎడిట్ చేయడం

మీరు ఫోటోలను జోడించవచ్చు, తొలగించవచ్చు, మీ ఫోటో క్రెడిట్‌ను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు, అలాగే మీ ఫోటో క్రెడిట్ కోసం ముద్దుపేరును అందించవచ్చు.

  1. మీ iPadలో మ్యాప్స్ యాప్ కి వెళ్ళండి.

  2. ‘ప్రదేశాలు’ ట్యాప్ చేయండి.

  3. మీరు ఏ ప్రేదేశం పోటోలను ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని ట్యాప్ చేసి, ఆపై ‘మీ ఫోటోలు’ ట్యాప్ చేయండి.

  4. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • మరో ఫోటోను సబ్మిట్ చేయడం: ’ఫోటోను జోడించండి’ని ట్యాప్ చేయండి.

    • ఫోటోను తొలగించడం: ‘మరిన్ని ఆప్షన్‌లు’ బటన్ ట్యాప్ చేసి, ఆపై ’మీ ఫోటోను డిలీట్ చేయండి’ ట్యాప్ చేయండి.

    • మీ ఫోటో క్రెడిట్‌ను మార్చడం: ‘మరిన్ని ఆప్షన్‌లు’ బటన్ ట్యాప్ చేసి, ఆపై ’ఫోటో క్రెడిట్‌ను మార్చండి’ ట్యాప్ చేయండి. మీరు ఎంచుకున్న ఫోటో క్రెడిట్ ఆప్షన్ మీరు గతంలో సబ్మిట్ చేసిన అన్ని ఫోటోలకు, అలాగే భవిష్యత్తులో సబ్మిట్ చేసే ఫోటోలకు కూడా వర్తిస్తుంది.

రేటింగ్‌లు, ఫోటోల సూచనలను పొందడం ఆపివేయడం

మీరు ఇటీవల సందర్శించిన లేదా ఆసక్తిగల ప్రదేశాన్ని ఫోటో తీసినట్లయితే, మీరు రేటింగ్‌లు లేదా ఫోటోలను సబ్మిట్ చేయడానికి మ్యాప్స్‌లో సూచనలను అందుకోవచ్చు. ఈ సలహాలు ఆన్-డివైజ్ ప్రాసెసింగ్‌ను ఉపయోగిస్తాయి, వాటిని Apple చదవలేదు. మీరు ఈ సూచనలను స్వీకరించకూడదనుకుంటే, వాటిని ఆఫ్ చేయవచ్చు.

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. యాప్స్‌ను ట్యాప్ చేసి, ఆపై మ్యాప్స్‌ను ట్యాప్ చేయండి.

  3. ’రేటింగ్‌లు, ఫోటోల సూచనలను చూపండి’ని ఆఫ్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.