ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadను ఆన్ లేదా ఆఫ్ చేయడం

మీ iPadను ఆన్, ఆఫ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి—మీరు మీ iPad సైడ్‌లో ఉన్న బటన్‌లను ఉపయోగించవచ్చు లేదా మీరు సెట్టింగ్స్, కంట్రోల్ సెంటర్‌లోని కంట్రోల్‌లను ఉపయోగించవచ్చు.

iPadను ఆన్ చేయడం

Apple లోగో కనిపించే వరకు టాప్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.

iPad పైన కుడివైపున ఉన్న బటన్ వైపు చూపుతున్న ఆకుపచ్చ రంగు బాణం గుర్తు.

iPad ఆన్ అవ్వకపోతే, మీరు బ్యాటరీని ఛార్జ్ చేయాల్సి రావచ్చు. మరింత సహాయం కోసం, Apple మద్దతు ఆర్టికల్ మీ iPad ఆన్ అవ్వకపోవడం లేదా ఫ్రీజ్ అవ్వడం చూడండి.

iPadను ఆఫ్ చేయడం (టాప్ బటన్‌లో Face ID లేదా Touch ID ఉన్న మోడల్‌లు)

మీ iPadకు హోమ్ బటన్ లేకపోతే, దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

  1. పవర్ ఆఫ్ స్లైడర్ కనిపించే వరకు టాప్ బటన్, వాల్యూమ్ బటన్‌లలో ఏదో ఒక బటన్‌ను ఒకే సమయంలో నొక్కి ఉంచండి.

    రెండు iPad మోడళ్లు. రెండు iPad మోడల్‌లలో టాప్ బటన్ ఉంది; ఒక iPad మోడల్‌లో సైడ్‌లో వాల్యూమ్ బటన్‌లు ఉన్నాయి, రెండో దానిలో టాప్‌లో వాల్యూమ్ బటన్‌లు ఉన్నాయి. ఎగువ బటన్‌లు, వాల్యూమ్ బటన్‌లను పాయింట్ చేస్తున్న బాణాలు.
  2. iPadను ఆఫ్ చేయడానికి స్లైడర్‌ను డ్రాగ్ చేయండి.

iPadను ఆఫ్ చేయండి (హోమ్ బటన్ గల మోడల్‌లు)

మీ iPadలో హోమ్ బటన్ ఉంటే, ఈ కింది వాటిని చేయండి:

  1. టాప్ బటన్‌ను నొక్కి ఉంచండి.

    హోమ్ బటన్ ఉన్న iPad. టాప్ బటన్‌ను పాయింట్ చేస్తున్న బాణం గుర్తు.
  2. iPadను ఆఫ్ చేయడానికి స్లైడర్‌ను డ్రాగ్ చేయండి.

కంట్రోల్ సెంటర్‌లో iPadను ఆఫ్ చేయడం

  1. కంట్రోల్ సెంటర్‌ను తెరవండి.

  2. మీ స్క్రీన్ ఎగువ కుడి మూలలో పవర్ బటన్ను నొక్కి ఉంచండి.

  3. iPadను ఆఫ్ చేయడానికి స్లైడర్‌ను డ్రాగ్ చేయండి.

సెట్టింగ్స్‌లో iPadను ఆఫ్ చేయడం

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్‌కి వెళ్ళండి.

  2. ‘జనరల్’ను ట్యాప్ చేసి, కిందకు స్క్రోల్ చేసి, ఆపై ‘షట్ డౌన్’ను ట్యాప్ చేయండి.

  3. iPadను ఆఫ్ చేయడానికి స్లైడర్‌ను డ్రాగ్ చేయండి.

మీ iPad ఆశించిన విధంగా పనిచేయకపోతే, మీరు దాన్ని ఆఫ్ చేసి, ఆపై దాన్ని తిరిగి ఆన్ చేయడం ద్వారా రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆఫ్ చేసినప్పటికీ సమస్య అలాగే కొనసాగితే, బలవంతంగా రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.