ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో ఆరోగ్యం యాప్‌లో మీ డేటాను చూడటం

మీరు మీ ఆరోగ్యం, ఫిట్‌నెస్ సమాచారాన్ని ఒకే చోట చూడవచ్చు. ఉదాహరణకు, మీరు మీ కొలమానాలు కాలానుగుణంగా మారుతున్నాయో లేదో అనేది చూడవచ్చు, అలాగే యాక్టివిటి, నిద్ర, మైండ్‌ఫుల్‌నెస్ మొదలైనటువంటి లక్ష్యాలను మీరు ఎంత బాగా చేరుకుంటున్నారో చూడవచ్చు.

సారాంశం స్క్రీన్‌లో మీ పిన్ చేయబడిన ఆరోగ్య విభాగాలను కస్టమైజ్ చేయడం

మీరు మందులు, హార్ట్ రేట్, మీ ఎక్కిన మెట్లు మొదలైనటువంటి మీకు సంబంధించిన అతి ముఖ్యమైన ఆరోగ్య విభాగాలను పిన్ చేసి, అమర్చవచ్చు.

  1. మీ iPadలో ఆరోగ్యం యాప్ కు వెళ్ళండి.

  2. సారాంశాన్ని ట్యాప్ చేసి, ఆపై ’పిన్ చేయబడినవి’ పక్కన ఉన్న ’ఎడిట్’ ట్యాప్ చేయండి.

  3. దిగువ వాటిలో ఏదైనా చేయండి:

    • ఆరోగ్యం విభాగాన్ని పిన్ చేయడానికి: విభాగానికి పక్కన పిన్ బటన్ ట్యాప్ చేయండి.

    • ఆరోగ్య విభాగాన్ని అన్‌పిన్ చేయడానికి: విభాగానికి పక్కన ఉన్న డిలీట్ బటన్ ట్యాప్ చేయండి.

    • మీ పిన్ చేయబడిన జాబితాలోని ఆరోగ్య విభాగాల క్రమాన్ని మార్చడానికి: ఒక విభాగానికి పక్కన ఉన్న ‘క్రమాన్ని మార్చండి’ బటన్ను ఎగువకు దిగువకు డ్రాగ్ చేయండి.

  4. మీరు పూర్తి చేసిన తర్వాత, ‘పూర్తి’ బటన్ను ట్యాప్ చేయండి.

మీ హైలైట్‌లను చూడటం

  1. మీ iPadలో ఆరోగ్యం యాప్ కు వెళ్ళండి.

  2. సారాంశాన్ని ట్యాప్ చేసి, ఆపై మీ ఇటీవలి ఆరోగ్యం, ఫిట్‌నెస్ సంబంధిత డేటా ముఖ్యాంశాలను చూడటానికి హైలైట్‌లకు స్క్రోల్ చేయండి..

  3. ఇవి చేయండి:

    • హైలైట్ సంబంధిత మరింత డేటాను చూడండి: దీని గ్రాఫ్‌ను ట్యాప్ చేయండి.

    • అన్ని హైలైట్‌లను చూడటం: ‘హైలైట్‌లన్నింటినీ చూపించండి’ ట్యాప్ చేయండి.

మీ ఆరోగ్య ట్రెండ్‌లను చూడటం

కాలానుగుణంగా మీ ఆరోగ్య డేటాను ట్ర్యాక్ చేయడంలో మీకు సహాయపడటానికి ‘ఆరోగ్యం యాప్’ విశ్రాంత హార్ట్ రేట్, అడుగుల సంఖ్య, నిదురించిన కాలం వంటి డేటా రకాలలో జరిగే గణనీయమైన మార్పుల గురించి మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ట్రెండ్ లైన్‌లు ఈ కొలమానాలు ఎంత వరకు మారాయో, ఎంతకాలం మారాయో అనేది మీకు చూపుతాయి.

  1. మీ iPad లో ఆరోగ్యం యాప్ ను తెరవండి.

  2. సారాంశాన్ని ట్యాప్ చేసి, ఆపై ఇటీవలి ట్రెండ్‌లను చూడటానికి ’ట్రెండ్‌లు’కు స్క్రోల్ చేయండి.

  3. ఆరోగ్య ట్రెండ్‌లు గుర్తించబడినట్లయితే, మీరు ఇలా చేయవచ్చు:

    • ట్రెండ్ సంబంధిత మరింత డేటాను చూడటానికి: దాని గ్రాఫ్‌ను ట్యాప్ చేయండి.

    • అన్ని ట్రెండ్‌లను చూడటం: ‘ఆరోగ్యపరమైన ట్రెండ్‌లన్నింటినీ చూపించండి’ ట్యాప్ చేయండి.

మీ ఆరోగ్యపరమైన ట్రెండ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్‌లను స్వీకరించడానికి, ‘’సారాంశం’ ట్యాప్ చేసి, ఎగువ ఎడమవైపున ప్రొఫైల్‌లు లేదా ఎగువ ఎడమవైపున ఉన్న ఇనిషియల్స్ ట్యాప్ చేయండి, నోటిఫికేషన్స్‌ ట్యాప్ చేసి ఆపై ట్రెండ్‌లను ఆన్ చేయండి.

నిర్దిష్ట ఆరోగ్య విభాగం కోసం ట్రెండ్‌లు, హైలైట్‌లు, వివరాలను చూడండి

  1. మీ iPadలో ఆరోగ్యం యాప్ కు వెళ్ళండి.

  2. ఆరోగ్యం విభాగాల జాబితాను చూపడానికి శోధన బటన్ ట్యాప్ చేసి, ఆపై ఈ కింది వాటిలో ఒకదాన్ని చేయండి:

    • విభాగాన్ని ట్యాప్ చేయండి. (అన్ని విభాగాలను చూడటానికి, ఎగువకు దిగువకు స్క్రోల్ చేయండి.)

    • శోధన ఫీల్డ్‌ను ట్యాప్ చేసి, ఆపై విభాగం పేరును (మొబిలిటీ వంటివి) లేదా నిర్దిష్ట డేటా రకాన్ని (నడక వేగం వంటివి) టైప్ చేయండి.

  3. డేటా రకాన్ని బట్టి, మీరు ఈ దిగువ పనులను చేయగలరు:

    • ఏదైనా డేటా గురించి వివరాలను చూడండి: వివరాల బటన్ ట్యాప్ చేయండి.

    • డేటా సంబంధిత వారం వారీ, నెలవారీ, వార్షిక వీక్షణలను చూడటానికి: స్క్రీన్ పైభాగంలో ఉన్న ట్యాబ్‌లను ట్యాప్ చేయండి.

    • డేటాను మాన్యువల్‌గా నమోదు చేయడానికి: స్క్రీన్ ఎగువ-కుడివైపు మూలలో డేటాను జోడించండి ట్యాప్ చేయండి.

    • సారాంశం స్క్రీన్‌ను పిన్ చేయడం: సారాంశం కోసం ’పిన్’ను ట్యాప్ చేయండి. (మీరు కిందికి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది.)

    • ఏయే యాప్‌లు, డివైజ్‌లు డేటాను షేర్ చేయడానికి అనుమతించబడతాయో చూడండి: ఎంపికలకు దిగువన డేటా సోర్స్‌లు & యాక్సెస్‌ను ట్యాప్ చేయండి. (మీరు కిందికి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది.)

    • డేటాను డిలీట్ చేయడానికి: ‘ఎంపికలకు దిగువన మొత్తం డేటాను చూపండి’ ట్యాప్ చేయండి, డేటా రికార్డ్‌లో ఎడమ వైపు స్వైప్ చేసి, ఆపై డిలీట్ చేయండి ట్యాప్ చేయండి. మొత్తం డేటాను డిలీట్ చేయడానికి, ఎడిట్ చేయండి ట్యాప్ చేసి, ఆపై ’అన్నీ డిలీట్ చేయండి’ ట్యాప్ చేయండి.

    • కొలత యూనిట్‌ను మార్చడానికి: ఎంపికలకు దిగువన ఉన్న యూనిట్‌ను ట్యాప్ చేసి, ఆపై యూనిట్‌ను ఎంచుకోండి.

ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి మరింత తెలుసుకోవడం

  1. మీ iPadలో ఆరోగ్యం యాప్ కు వెళ్ళండి.

  2. సారాంశాన్ని ట్యాప్ చేసి, ఆపై ఆరోగ్యం లేదా ఆర్టికల్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి కిందికి స్క్రోల్ చేయండి.

  3. మరింత తెలుసుకోవడానికి ఐటెమ్‌ను ట్యాప్ చేయండి.

మీరు అనేక ఆరోగ్య విభాగాలలోని వివరాలను చూసినప్పుడు, మీ డేటాతో పాటు సిఫార్సు చేయబడిన యాప్‌లు చూపబడతాయి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.