ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో వాతావరణాన్ని చెక్ చేయడం

మీ ప్రస్తుత లొకేషన్‌లోని వాతావరణాన్ని తెలుసుకోండి. రాబోయే ప్రతి గంటకు సంబంధించిన సమాచారం, అలాగే 10-రోజుల పాటు వాతావరణ సూచనలను చూడండి, తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో పాటు, మరెన్నో తెలుసుకోండి.

ఎగువ నుండి దిగువ వరకు చూపుతోన్న వాతావరణం యాప్ స్క్రీన్: లొకేషన్, ప్రస్తుత ఉష్ణోగ్రత, రోజులోని గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు, గంటల వారీగా అంచనాలు, 10-రోజుల పాటు వాతావరణ సూచనలు దిగువ మధ్యలో చుక్కల వరుస అనేది లొకేషన్ జాబితాలో ఎన్ని లొకేషన్‌లు ఉన్నాయో చూపుతుంది. దిగువ-కుడివైపు మూలలో ఉన్నది లొకేషన్ జాబితా బటన్, దిగువ-ఎడమవైపు మూలలో ఉన్నది ‘మ్యాప్‌ను చూపండి’ బటన్

మీరు ప్రారంభించే ముందు

మీ ప్రస్తుత లొకేషన్ సంబంధిత వాతావరణ సూచనలను పొందడానికి వాతావరణం యాప్ ‘లొకేషన్ సర్వీస్‌లు’ విభాగాన్ని ఉపయోగిస్తుంది. వాతావరణ సూచనల ఖచ్చితత్వాన్ని పెంచడానికి మీరు ఖచ్చితమైన లొకేషన్‌ను ఆన్ చేయవచ్చు.

  1. సెట్టింగ్స్  > గోప్యత, భద్రత > లొకేషన్ సర్వీస్‌లు > వాతావరణానికి వెళ్ళండి.

  2. ఖచ్చితమైన లొకేషన్‌ను ఆన్ చేయండి.

స్థానిక వాతావరణ సూచనలు, పరిస్థితులను తెలుసుకోవడం

  1. మీ iPhoneలోని వాతావరణం యాప్ కు వెళ్ళండి.

  2. మీ ప్రస్తుత లొకేషన్ వివరాలు చూపించబడ్డాయి. మీకు కనిపించకపోతే, ‘నగరాలను ఎడిట్ చేయండి’ బటన్ ట్యాప్ చేసి, ఆపై ’నా లొకేషన్’ ట్యాప్ చేయండి.

    దిగువ పేర్కొన్న విధంగా వాతావరణ వివరాలను చూడటానికి ఎగువకు స్వైప్ చేయండి:

    • గంటల వారీగా ముందస్తు అంచనా: ‘గంటల వారీగా అంచనా’ డిస్‌ప్లేను ఎడమ లేదా కుడి వైపు స్వైప్ చేయండి.

      చిట్కా: గంటల వారీగా ఉష్ణోగ్రత అంచనా, వర్షపాతం అవకాశం, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఇంకా మరిన్నింటిని చూడటానికి ‘గంటల వారీ అంచనా’ను ట్యాప్ చేయండి. చూపబడిన వాతావరణ పరిస్థితిని మార్చడానికి చార్ట్ కండిషన్ బటన్ ట్యాప్ చేయండి. రాబోయే రోజుల కోసం అదే సమాచారాన్ని చూడటానికి ఎడమ వైపు స్వైప్ చేయండి.

    • 10-రోజుల ముందస్తు అంచనా: రానున్న రోజులలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం సూచనలు, అలాగే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను చూడండి.

    • తీవ్ర వాతావరణ హెచ్చరికలు: చలికాలపు తుఫాన్‌లు, ఆకస్మిక వరదలు వంటి వాతావరణ సంఘటనల కోసం అప్‌డేట్‌లను చూడండి. ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికను పూర్తిగా చదవడానికి హెచ్చరికను ట్యాప్ చేయండి.

    • మ్యాప్స్: ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత, అవపాతం, గాలి నాణ్యత లేదా గాలి పరిస్థితులను చూపించే మ్యాప్‌ను చూడండి. మ్యాప్‌ను పూర్తి స్క్రీన్‌లో చూడటానికి లేదా ఉష్ణోగ్రత, అవపాతం, గాలి నాణ్యత, గాలి మధ్య మ్యాప్ వీక్షణను మార్చడానికి ట్యాప్ చేయండి. వాతావరణ మ్యాప్స్ చూడండి చూడండి.

    • గాలి నాణ్యత: ఆరోగ్య సమాచారం, గాలి కాలుష్య కారకాలకు సంబంధించిన వివరాలను చూడటానికి ట్యాప్ చేయండి.

      నోట్: ఒక లొకేషన్‌లో గాలి నాణ్యత నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, గాలి నాణ్యత స్కేల్ గంటల వారీ అంచనా కంటే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలలో గాలి నాణ్యత స్థాయి ఎల్లప్పుడూ గంటల వారీ అంచనా కంటే ఎక్కువగా కనిపిస్తుంది.

    • News: ఒక ప్రాంతంలోని వాతావరణానికి సంబంధించిన కథనం వచ్చినప్పుడు న్యూస్ ఆర్టికల్ చదవండి.

    • అదనపు వాతావరణ వివరాలు: UV సూచీ, గాలి, విజిబిలిటీ, చంద్రుని దశలు మొదలైన అదనపు వాతావరణ సమాచారాన్ని చూడండి. ఆ వివరాలకు సంబంధించిన మరిన్ని ప్రత్యేకతలు, సమాచారం కోసం వాతావరణ వివరాలను ట్యాప్ చేయండి.

      చిట్కా: సగటు వాతావరణ వివరాలు నేటి ఉష్ణోగ్రత లేదా వర్షపాతం చారిత్రక సగటుతో ఎలా పోల్చబడిందో చూపుతుంది; అదనపు సమాచారం కోసం దాన్ని ట్యాప్ చేయండి.

      లొకేషన్‌ను ఎగువన, ప్రస్తుత ఉష్ణోగ్రత, వాతావరణ స్థితిని దిగువన చూపుతున్న వాతావరణం స్క్రీన్ దిగువ అంశాలకు సంబంధించిన వాతావరణ వివరాలు మిగతా స్క్రీన్‌లో ఉన్నవి: గాలి నాణ్యత, అవపాతం, UV సూచీ మరియు సూర్యాస్తమయం.

నోట్: కొన్ని వాతావరణం యాప్ ఫీచర్‌లు-అంటే తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు, గాలి నాణ్యత, తదుపరి-గంటకు వర్షపాతం, అలాగే వార్తలు వంటివి-అన్ని దేశాలు, ప్రాంతాలలో అందుబాటులో ఉండవు. వాతావరణం యాప్ కొరకు డేటా సోర్స్‌ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, Apple మద్దతు ఆర్టికల్ వాతావరణం యాప్‌లోని ఫీచర్‌ల లభ్యత, డేటా సోర్స్‌లు చూడండి.

వాతావరణ యూనిట్‌లను కస్టమైజ్ చేయడం

మీరు వాతావరణ డేటాలో ఉపయోగించిన యూనిట్‌లను మార్చవచ్చు. వీటిలో ఉష్ణోగ్రత కోసం ఫారన్‌హీట్ లేదా సెల్సియస్, గంటకు మైళ్ళు, గంటకు కిలోమీటర్లు, నాట్‌లు లేదా గాలి కోసం బ్యూఫోర్ట్ ఉంటాయి.

  1. మీ iPhoneలోని వాతావరణం యాప్ కు వెళ్ళండి.

  2. ‘నగరాలను ఎడిట్ చేయండి’ బటన్ ట్యాప్ చేయండి.

  3. మరిన్ని బటన్ ట్యాప్ చేసి, యూనిట్‌లు ట్యాప్ చేయండి, ఆపై దిగువ వాటిలో ఏదైనా చేయండి:

    • ఉష్ణోగ్రత యూనిట్‌లను మార్చడానికి: ఫారన్‌హీట్, సెల్సియస్ లేదా ‘సిస్టమ్ సెట్టింగ్‌ను ఉపయోగించండి’ ట్యాప్ చేయండి.

    • గాలి, అవపాతం, పీడనం లేదా దూరం యూనిట్‌లను మార్చడానికి: ప్రస్తుత కొలత యూనిట్‌కు పక్కనున్న యాక్షన్ బటన్ మెన్యూ ట్యాప్ చేసి, ఆపై ఒక ఎంపికను ఎంచుకోండి.

వాతావరణ సంబంధిత రిపోర్ట్‌ను పంపడం

మీ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, ’వాతావరణం’ యాప్‌లో చూపిన విధంగా సరిపోలనట్లయితే దాన్ని నివేదించవచ్చు.

  1. మీ iPhoneలోని వాతావరణం యాప్ కు వెళ్ళండి.

  2. ‘నగరాలను ఎడిట్ చేయండి’ బటన్ ట్యాప్ చేసి, మరిన్ని బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘సమస్యను నివేదించండి’ ట్యాప్ చేయండి.

  3. మీరు ఉన్న ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను సరిగ్గా వివరించే ఎంపికలను ట్యాప్ చేసి, ఆపై ‘సబ్మిట్ చేయండి’ ట్యాప్ చేయండి.

మీరు Appleతో షేర్ చేసే సమాచారం, మీ Apple ఖాతాతో అనుబంధించబడలేదు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.