ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని మ్యాప్స్‌లో సైక్లింగ్ దిశలను పొందడం

మీరు సైక్లింగ్‌కు సంబంధించిన వివరణాత్మక దిశలను పొందవచ్చు. మ్యాప్స్ మీకు బైక్ మార్గాలు, బైక్ లేన్‌లు, బైక్ అనుకూల రోడ్‌లకు సంబంధించిన మార్గాలను అందిస్తుంది (అందుబాటులో ఉన్నప్పుడు). మీరు మీ రైడ్‌కు సంబంధించి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నారో చూడవచ్చు, రోడ్ ఎంత బిజీగా ఉందో చెక్ చేయవచ్చు, కొండలను నివారించే మార్గాన్ని ఎంచుకోవచ్చు.

సైక్లింగ్ మార్గం ఎంపికలను చూపుతున్న మ్యాప్. దిగువన ఉన్న రూట్ కార్డ్, అంచనా వేసిన ప్రయాణ సమయాలు, ఎత్తులో మార్పులు, రోడ్ల రకాలతో సహా వివరాలను అందిస్తుంది. వివరాలకు కుడివైపున ‘వెళ్ళండి’ బటన్ కనిపిస్తుంది.

నోట్: ఎంచుకున్న ప్రాంతాల్లో సైక్లింగ్ దిశలు, అలాగే మాటల రూపంలో వినిపించే టర్న్-బై-టర్న్ దిశలు అందుబాటులో ఉన్నాయి. దేశం, ప్రాంతాన్ని బట్టి ఫీచర్‌లు మారుతూ ఉంటాయి. iOS, iPadOS ఫీచర్ లభ్యత వెబ్‌సైట్లో చూడండి.

సైక్లింగ్ దిశలను పొందడం

  1. మీ iPhoneలో మ్యాప్స్ యాప్ కి వెళ్ళండి.

  2. మ్యాప్‌లో ఎక్కడైనా టచ్ చేసి ఉంచండి లేదా శోధన ఫీల్డ్‌లో అడ్రెస్‌ను నమోదు చేసి, ఆపై ‘దిశలు’ లేదా ట్రావెల్ మోడ్ బటన్ను ట్యాప్ చేయండి.

  3. మీరు వెళ్లాలనుకుంటున్న మార్గం కోసం ‘వెళ్ళండి’ లేదా దశలను ట్యాప్ చేయండి.

Siri: మీరు ఇలా కూడా చెప్పవచ్చు: “Give me driving directions home.” Siriని ఉపయోగించడం తెలుసుకోండి.

కొండలు లేదా రద్దీగా ఉండే రోడ్‌లను నివారించడం

  1. మీ iPhoneలో మ్యాప్స్ యాప్ కి వెళ్ళండి.

  2. పైన పేర్కొన్న విధంగా, సైక్లింగ్ దిశలను పొందండి.

  3. ‘నివారించండి’ (గమ్యస్థానానికి దిగువన) ట్యాప్ చేసి, మీ ఎంపికలను ఎంచుకొని, ఆపై ‘వర్తింపజేయండి’ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.