ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో క్విక్ నోట్స్‌ను ఉపయోగించండి

మీరు iPhoneలో ఏదైనా యాప్ లేదా స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని రాయడానికి క్విక్ నోట్స్‌ను ఉపయోగించవచ్చు. ముఖ్యమైన పేర్లు, నంబర్లు, ఆలోచనలను సులభంగా చూడటానికి వీలుగా లింక్‌లు, ఇమేజ్‌లు, ట్యాగ్‌లను, ప్రస్తావనలను క్విక్ నోట్‌కు జోడించవచ్చు. మీరు Safariలో టెక్స్ట్‌ను హైలైట్ చేసినా లేదా యాప్ నుండి లింక్‌ను జోడించినా, మీరు తర్వాతి సారి సైట్‌ను సందర్శించినప్పుడు క్విక్ నోట్ థంబ్‌నెయిల్ కనిపిస్తుంది, దాని ద్వారా మీరు చివరిగా చూసిన అంశానికి వెళ్ళవచ్చు.

ఫ్యామిలీ వెకేషన్ కోసం చేయవలసిన పనుల జాబితాను చూపే నోట్. నోట్‌లో వెబ్‌పేజీకి లింక్, మరొక నోట్‌కు లింక్, కొనుగోలు చేయాల్సిన ఐటెమ్‌ల జాబితా అలాగే దిగువన ఫోటో ఉన్నాయి.

మీరు మీ అన్ని క్విక్ నోట్స్‌ను నోట్స్ యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు. అలాగే మీరు మీ iPhoneలో క్విక్ నోట్ చేసినప్పుడు, మీరు మీ iPad, Macలో దాన్ని చూడవచ్చు.

క్విక్ నోట్ చేయడం కోసం

ఏదైనా యాప్ నుండి క్విక్ నోట్ చేయడానికి, కింద ఉన్న వాటిలో ఏదైనా చేయండి:

క్విక్ నోట్స్‌ను చూడటం, ఆర్గనైజ్ చేయడం

  1. మీ iPhoneలో నోట్స్ యాప్‌కి వెళ్ళండి.

  2. ఫోల్డర్ల జాబితాలో ఉన్న క్విక్ నోట్స్‌పై ట్యాప్ చేయండి.

నోట్: మీరు క్విక్ నోట్‌ను వేరే ఫోల్డర్‌కు తరలిస్తేనే దాన్ని లాక్ చేయగలరు.

మీరు వ్యక్తిగత క్విక్ నోట్‌ను వేరే ఫోల్డర్‌కు తరలిస్తే, అది స్టాండర్డ్ నోట్ అవుతుంది, అలాగే ఇతర యాప్‌లలో ఇకపై క్విక్ నోట్‌గా కనిపించదు.

దీన్ని కూడా చూడండిiPhoneలో మీ నోట్స్‌ను శోధించడం
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.