ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో సంగీతం యాప్‌లో సౌండ్‌ను అడ్జస్ట్ చేయడం

iPhoneలోని సంగీతం యాప్‌లో EQ, సౌండ్ చెక్‌తో సంగీతం వినిపించే విధానాన్ని మార్చండి. ప్లేలిస్ట్‌లలోని పాటలను క్రాస్‌ఫేడ్ చేయండి.

హెచ్చరిక: వినికిడి లోపాన్ని నివారించడం గురించిన ముఖ్యమైన సమాచారం కోసం, ముఖ్యమైన భద్రతా సమాచారం చూడండి.

EQని ఉపయోగించి, వాల్యూమ్ స్థాయిలను సాధారణీకరించండి

  • ఈక్వలైజేషన్ (EQ) సెట్టింగ్‌ను ఎంచుకోవడానికి: సెట్టింగ్స్  > యాప్స్ > సంగీతం > EQకి వెళ్లండి.

  • మీ ఆడియో సంబంధిత వాల్యూమ్ స్థాయిని సాధారణీకరించండి: సెట్టింగ్స్ > యాప్స్ > సంగీతానికి వెళ్లి, ఆపై సౌండ్ చెక్‌ను ఆన్ చేయండి.

ప్లేలిస్ట్‌లలో పాటలను క్రాస్‌ఫేడ్ చేయడం

మీరు ప్లేలిస్ట్‌లో పాటలను క్రాస్‌ఫేడ్ చేయవచ్చు, ఇది పాటల మధ్య ఆడియో గ్యాప్ లేకుండా పాటలు వినే అనుభవాన్ని సృష్టిస్తుంది.

  1. సెట్టింగ్స్  > యాప్స్ > సంగీతానికి వెళ్లండి.

  2. క్రాస్‌ఫేడ్‌ను ఆన్ చేసి, ఆపై క్రాస్‌ఫేడ్ నిడివిని ఎంచుకోవడానికి స్లైడర్‌ను డ్రాగ్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.