ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో ఫోటో లేదా వీడియోలోని కంటెంట్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి లైవ్ టెక్స్ట్‌ను ఉపయోగించండి

లైవ్ టెక్స్ట్ మీరు ఆన్‌లైన్‌లో కనుగొన్న మీ ఫోటోలు, వీడియోలు ఇమేజ్‌లలోని టెక్స్ట్‌ను గుర్తిస్తుంది. మీరు ఈ టెక్స్ట్‌తో అనేక విధాలుగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. కాపీ చేయడానికి, షేర్ చేయడానికి లేదా అనువదించడానికి మీరు టెక్స్ట్‌ను ఎంచుకోవచ్చు లేదా ఫోన్ కాల్ చేయడం, వెబ్‌సైట్ తెరవడం లేదా కరెన్సీలను మార్చడం వంటి పనులను చేయడానికి మీరు త్వరిత యాక్షన్‌లను ఉపయోగించవచ్చు.

లైవ్ టెక్స్ట్ మద్దతు ఉన్న మోడళ్ళలో అందుబాటులో ఉంటుంది, అలాగే దానిని Safari, ఫోటోస్, కెమెరా, Quick Look, మరిన్నింటిలో ఉపౌగించవచ్చు.

లైవ్ టెక్స్ట్‌ను ఆన్ చేయడం

మీరు లైవ్ టెక్స్ట్‌ను ఉపయోగించడం ప్రారంభించే ముందు, ఇది అన్ని మద్దతు గల భాషల కోసం ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి.

  1. సెట్టింగ్స్  > సాధారణం > ‘భాష & ప్రాంతం’కు వెళ్ళండి.

  2. లైవ్ టెక్స్ట్‌ను ఆన్ చేయండి (పచ్చని డాట్ ఆన్‌లో ఉంటుంది).

ఫోటో లేదా వీడియోలోని టెక్స్ట్‌ను కాపీ చేయడం, అనువదించడం, చూడటం

  1. టెక్స్ట్ ఉన్న ఫోటోను తెరవండి లేదా వీడియోను పాజ్ చేయండి.

  2. ‘టెక్స్ట్‌ను గుర్తించండి’ బటన్ను ట్యాప్ చేసి, ఆపై ఎంచుకున్న టెక్స్ట్‌ను టచ్ చేసి ఉంచండి.

  3. గ్రాబ్ పాయింట్లను ఉపయోగించి నిర్దిష్ట టెక్స్ట్‌ను ఎంచుకుని, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • టెక్స్ట్‌ను కాపీ చేయడం: నోట్స్ లేదా సందేశాలు వంటి ఇతర యాప్‌లో పేస్ట్ చేయడానికి టెక్స్ట్‌ను కాపీ చేయండి.

    • అన్నీ ఎంచుకోండి: ఫ్రేమ్‌లోని మొత్తం టెక్స్ట్‌ను ఎంచుకోండి.

    • చూడండి: వ్యక్తిగతీకరించిన వెబ్ సలహాలను చూపడం.

    • అనువదించండి: టెక్స్ట్‌ను అనువదించండి.

    • వెబ్‌లో శోధించడం: ఎంచుకోబడిన టెక్స్ట్ గురించి వెబ్‌లో చూడండి.

    • షేర్ చేయండి: AirDrop, సందేశాలు, Mail లేదా ఇతర అందుబాటులో ఉన్న ఎంపికల ద్వారా టెక్స్ట్‌ను షేర్ చేయండి.

  4. ఫోటో లేదా వీడియోకు తిరిగి రావడానికి ఎంచుకోబడిన ‘టెక్స్ట్‌ను గుర్తించండి’ బటన్ను ట్యాప్ చేయండి.

త్వరిత యాక్షన్‌లతో ఫోటో లేదా వీడియోలోనే టాస్క్‌లను అమలు చేయండి

ఫోటో లేదా వీడియోలోని కంటెంట్‌పై ఆధారపడి, ఫోన్ కాల్ చేయడం, దిశలను పొందడం, భాషలను అనువదించడం, కరెన్సీలను మార్చడం, మరిన్నింటిని చేయడానికి మీరు స్క్రీన్ దిగువన ఉన్న త్వరిత యాక్షన్‌ను ట్యాప్ చేయవచ్చు.

  1. టెక్స్ట్ ఉన్న ఫోటోను తెరవండి లేదా వీడియోను పాజ్ చేయండి.

  2. ‘టెక్స్ట్‌ను గుర్తించండి’ బటన్ను ట్యాప్ చేయండి.

  3. స్క్రీన్ దిగువన ఉన్న త్వరిత యాక్షన్‌ను ట్యాప్ చేయండి.

  4. ఫోటో లేదా వీడియోకు తిరిగి రావడానికి ఎంచుకోబడిన ‘టెక్స్ట్‌ను గుర్తించండి’ బటన్ను ట్యాప్ చేయండి.

అన్ని ప్రాంతాలు లేదా భాషలలో లైవ్ టెక్స్ట్ అందుబాటులో లేదు. iOS, iPadOS ఫీచర్ లభ్యత ఆర్టికల్ చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.