ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో వాతావరణ నోటిఫికేషన్‌లను నిర్వహించడం

మీ ప్రస్తుత లొకేషన్‌లో అవపాతం లేదా కొన్ని తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నట్లు అంచనా వేయబడినప్పుడు మీరు నోటిఫికేషన్‌లను అందుకోవచ్చు. మీరు మీ జాబితాలో సేవ్ చేసిన లొకేషన్‌ల కోసం నోటిఫికేషన్‌లను కూడా అందుకోవచ్చు.

మీ లొకేషన్ కోసం వాతావరణ నోటిఫికేషన్‌లను ఆన్ చేయడం

  1. సెట్టింగ్స్  > గోప్యత , భద్రత > లొకేషన్ సర్వీస్‌లకు వెళ్లండి.

  2. వాతావరణం ట్యాప్ చేసి, ఆపై ఎల్లప్పుడూ ట్యాప్ చేయండి.

  3. మీ ప్రస్తుత లొకేషన్‌కు సంబంధించిన అత్యంత ఖచ్చితమైన నోటిఫికేషన్‌లను అందుకోవడానికి, ఖచ్చితమైన లొకేషన్‌ను ఆన్ చేయండి.

  4. మీ iPhoneలోని వాతావరణం యాప్ కు వెళ్ళండి.

  5. మీ జాబితాను చూపించడానికి ‘నగరాలను ఎడిట్ చేయండి’ బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘మరిన్ని ఆప్షన్‌లు’ బటన్ ట్యాప్ చేసి, ఆపై నోటిఫికేషన్స్ ట్యాప్ చేయండి.

    ప్రాంప్ట్ అందితే, వాతావరణం యాప్ నుండి నోటిఫికేషన్‌లను అనుమతించండి.

  6. ప్రస్తుత లొకేషన్‌కు దిగువన, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తదుపరి-గంటలో వర్షపాతం కోసం నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి (పచ్చని రంగు ఆన్‌లో ఉండాలి).

  7. ‘పూర్తి’ ట్యాప్ చేయండి.

మీ జాబితాలోని లొకేషన్‌ల కోసం వాతావరణ నోటిఫికేషన్‌లను ఆన్ చేయడం

  1. మీ iPhoneలోని వాతావరణం యాప్ కు వెళ్ళండి.

  2. మీ జాబితాను చూపడానికి ‘నగరాలను ఎడిట్ చేయండి’ బటన్ ట్యాప్ చేయండి.

  3. ‘మరిన్ని ఆప్షన్‌లు’ బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘నోటిఫికేషన్స్’ ట్యాప్ చేయండి.

    ప్రాంప్ట్ అందితే, వాతావరణం యాప్ నుండి నోటిఫికేషన్‌లను అనుమతించండి.

  4. మీ లొకేషన్‌ల కింద, లొకేషన్‌ను ట్యాప్ చేసి, ఆపై తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, తదుపరి గంటలో వర్షపాతం కోసం నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి (పచ్చ రంగు ఆన్‌లో ఉండాలి).

  5. ‘పూర్తి’ ట్యాప్ చేయండి.

నోట్: అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో వాతావరణ నోటిఫికేషన్‌లు అందుబాటులో లేవు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.