ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhone లేదా Apple Watchలోని హోమ్ కీతో మీ డోర్‌ను అన్‌లాక్ చేయడం

కొందరు తయారీదారుల లాక్‌లు Apple వాలెట్ (మీ అనుకూలమైన iPhone, Apple Watchలో) హోమ్ కీతో, యాక్సెస్ కోడ్‌తో లేదా రెండింటితో మీ డోర్‌ను అన్‌లాక్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి.

హోమ్ యాప్‌లో మద్దతు గల లాక్‌ను పెయిర్ చేస్తున్నప్పుడు, మీ iPhoneలో Apple వాలెట్‌కు హోమ్ కీ ఆటోమేటిక్‌గా జోడించబడుతుంది.

నోట్: హోమ్ యాప్ అనేది HomeKit, మ్యాటర్ అనుకూల లాక్‌లు రెండింటికీ మద్దతు అందిస్తుంది.

హోమ్ కీని సెటప్ చేయడం

  1. మీ iPhoneలో హోమ్ యాప్ కు వెళ్ళండి.

  2. మద్దతు ఉన్న లాక్‌ను జోడించండి.

  3. అన్‌లాక్ చేయడానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి.

    • ఎక్స్‌ప్రెస్ మోడ్: Face ID లేదా Touch ID ప్రామాణీకరణ లేకుండానే డోర్‌ను అన్‌లాక్ చేయండి.

    • Face ID లేదా పాస్‌కోడ్ అవసరం: మీ డివైజ్‌ను లాక్ దగ్గర ఉంచి, దాన్ని అన్‌లాక్ చేయడానికి Face IDని లేదా Touch IDని ఉపయోగించండి.

  4. డోర్ మూసిన తర్వాత లాక్ చేయడం, ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు లాక్ చేయడం వంటి ఆటోమేషన్‌లను ఎంచుకోండి.

హోమ్ కీతో లాక్ పనిచేస్తే, మీ కుటుంబ సభ్యులందరూ ఆటోమేటిక్‌గా హోమ్ కీని అందుకుంటారు.

నోట్: అన్ని హోమ్ యాప్-అనుకూలమైన లాక్‌లు హోమ్ కీకి మద్దతు ఇవ్వవు.

హోమ్ కీతో మీ డోర్‌ను అన్‌లాక్ చేయండి

మీ iPhone లేదా Apple Watchలో హోమ్ కీ ఉండి, మీరు ఎక్స్‌ప్రెస్ మోడ్ ఆన్ చేసినప్పుడు, దాన్ని అన్‌లాక్ చేయడానికి మీ డివైజ్‌ను లాక్ దగ్గర ఉంచండి. మీరు ఇతర వ్యక్తులతో యాక్సెస్‌ను షేర్ చేయడానికి హోమ్ యాప్‌ను ఉపయోగించవచ్చు.

గెస్ట్ కోసం యాక్సెస్ కోడ్‌ను సెటప్ చేయడం

హోమ్ యాప్‌లో మీరు మీ హోమ్ విషయంలో తాత్కాలిక యాక్సెస్ అవసరమయ్యే వ్యక్తుల కోసం యాక్సెస్ కోడ్‌ను సెటప్ చేయవచ్చు.

  1. మీ iPhoneలో హోమ్ యాప్ కు వెళ్ళండి.

  2. హోమ్ ట్యాబ్‌లో, లాక్‌ను టచ్ చేసి పట్టుకుని, యాక్సెసరీ సెట్టింగ్స్‌ను ట్యాప్ చేసి, ‘యాక్సెస్‌ను నిర్వహించండి’ని ట్యాప్ చేసి, ఆపై ‘గెస్ట్‌ను జోడించండి’ని ట్యాప్ చేయండి.

  3. గెస్ట్‌కు పేరు పెట్టండి-ఉదాహరణకు, మహేష్ బాబు-ఆపై వారు యాక్సెస్ చేయాలనుకునే లాక్‌లను ఆన్ చేయండి.

  4. ‘యాక్సెస్ కోడ్‌ను మార్చండి’ని ట్యాప్ చేసి, యాక్సెస్ కోడ్‌ను నమోదు చేసి, ఆపై ‘పూర్తి’ ట్యాప్ చేయండి.

  5. యాక్సెస్ కోడ్‌ను టచ్ చేసి పట్టుకుని, ‘షేర్ చేయండి’ని ట్యాప్ చేసి, షేరింగ్ ఎంపికను ఎంచుకుని, ఆపై గెస్ట్‌తో యాక్సెస్ కోడ్‌ను షేర్ చేయండి.

మీరు ఈ స్క్రీన్‌కు తిరిగి వచ్చి యాక్సెస్ కోడ్‌ను మార్చవచ్చు, కొన్ని లేదా అన్ని లాక్‌లకు యాక్సెస్‌ను ఆఫ్ చేయవచ్చు లేదా గెస్ట్‌ను తొలగించవచ్చు.

నోట్: అన్ని హోమ్ యాప్-అనుకూలమైన లాక్‌లు, యాక్సెస్ కోడ్‌లకు మద్దతు ఇవ్వవు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.