ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhone నుండి ప్రింట్ చేయడం

Mail, ఫోటోస్, Safari వంటి యాప్‌ల నుండి AirPrint ఎనేబల్ చేసిన ప్రింటర్‌తో వైర్‌లెస్‌గా ప్రింట్ చేయడానికి AirPrintను ఉపయోగించండి. App Storeలో అందుబాటులో ఉన్న అనేక యాప్‌లు కూడా AirPrintకి మద్దతు ఇస్తాయి.

నోట్: మీ iPhone, ప్రింటర్ తప్పనిసరిగా ఒకే Wi-Fi నెట్‌వర్క్‌లో ఉండాలి. AirPrint గురించి Apple సపోర్ట్ ఆర్టికల్ చూడండి.

AirPrint-ఎనేబల్ చేయబడిన ప్రింటర్‌ను ఎంచుకోండి

మీ ప్రింటర్ AirPrintకి మద్దతు ఇస్తుందని, అలాగే మీ iPhone, ప్రింటర్ ఒకే Wi-Fi నెట్‌వర్క్‌లో ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత, కింద పేర్కొన్న విధంగా చేయండి:

  1. మీకు ఏ యాప్ నుండి ప్రింట్ కావాలో దానిని తెరవండి.

  2. షేర్ బటన్, ‘మరిన్ని’ బటన్, రిప్లై బటన్, లేదా యాక్షన్‌ల మెన్యూ బటన్ (యాప్‌ను బట్టి) ట్యాప్ చేయండి.

  3. ప్రింట్‌పై ట్యాప్ చేసి, ప్రింటర్ ‘ఎంచుకోబడలేదు’పై ట్యాప్ చేసి, ఆపై AirPrint-ఎనేబల్ చేయబడిన ప్రింటర్‌ను ఎంచుకోండి.

డాక్యుమెంట్‌ను ప్రింట్ చేయడం

  1. మీకు ఏ యాప్ నుండి ప్రింట్ చేయాలనుకుంటున్నారో దానిని తెరవండి.

  2. షేర్ బటన్, ‘మరిన్ని’ బటన్, రిప్లై బటన్, లేదా యాక్షన్‌ల మెన్యూ బటన్ (యాప్‌ను బట్టి) ట్యాప్ చేయండి.

  3. ప్రింట్‌పై ట్యాప్ చేయండి. (మీకు ప్రింట్ కనిపించకపోతే, పైకి స్వైప్ చేయండి.)

ప్రింట్ స్టేటస్ చూడటం

యాప్ స్విచ్చర్‌ను తెరవండి, ఆపై ప్రింట్ సెటర్‌ను ట్యాప్ చేయండి.

ఐకాన్‌పై ఉన్న బ్యాడ్జ్ ద్వారా క్యూలో ఎన్ని డాక్యుమెంట్‌లు ఉన్నాయో తెలుస్తుంది.

ప్రింట్‌ను రద్దు చేయడానికి, దానిని ప్రింట్ సెంటర్‌లో ఎంచుకుని, ఆపై ప్రింటింగ్‌ను రద్దు చేయడాన్ని ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.