ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో వాల్‌పేపర్‌ను మార్చడం

iPhoneలో, మీరు లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్‌పై వాల్‌పేపర్‌ను మార్చవచ్చు. మీరు మీ వాల్‌పేపర్‌ను సెట్టింగ్‌లలో లేదా మీ లాక్ స్క్రీన్ నుండి వాల్‌పేపర్ గ్యాలరీ ద్వారా సెట్ చేయవచ్చు. కస్టమ్ iPhone లాక్ స్క్రీన్‌ను సృష్టించడం చూడండి.

హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్‌పై ప్రస్తుత వాల్‌పేపర్‌ను కస్టమైజ్ చేయడానికి బటన్‌లతో వాల్‌పేపర్ సెట్టింగ్‌ల స్క్రీన్ అలాగే వాల్‌పేపర్‌ను మార్చడానికి కొత్త వాల్‌పేపర్‌ను జోడించే బటన్.
  1. సెట్టింగ్స్  > వాల్‌పేపర్‌కు వెళ్ళి, ఆపై 'కొత్త వాల్‌పేపర్‌ను జోడించండి' ట్యాప్ చేయండి.

    వాల్‌పేపర్ గ్యాలరీ కనిపిస్తుంది.

  2. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • ఫొటోతో, ఎమోజీ ప్యాటర్న్‌తో, మీ స్థానిక వాతావరణం ఇంకా మరిన్నింటితో వాల్‌పేపర్‌ను డిజైన్ చేయడానికి అంటే ఉదాహరణకు ఫోటోస్, ఫోటో షఫల్, Live Photo మొదలైనవాటి కోసం వాల్‌పేపర్ గ్యాలరీకి ఎగువ ఉన్న బటన్‌ను ట్యాప్ చేయండి.

    • ఫీచర్ చేసిన సెట్‌లలో (కలెక్షన్‌లు, ఖగోళం, వాతావరణం మొదలైనవి) ఒకదాని నుండి వాల్‌పేపర్‌ను ఎంచుకోండి.

  3. మీరు మీ వాల్‌పేపర్‌కు ఫోటో లేదా ఫోటో షఫల్‌ను జోడిస్తూ దానికోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫోటోలను కస్టమైజ్ చేయాలనుకుంటే, మీ లాక్ స్క్రీ‌న్ ఫోటోను కస్టమైజ్ చేయడం చూడండి.

  4. ‘జోడించండి’ ట్యాప్ చేసి, ఆపై దిగువ వాటిలో ఏదైనా చేయండి:

    • లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ రెండింటిలోనూ వాల్‌పేపర్‌ను ఉపయోగించాలా వద్దా ఎంచుకోండి: ‘వాల్‌పేపర్ పెయిర్‌గా సెట్ చేయండి’ ట్యాప్ చేయండి.

    • హోమ్ స్క్రీన్‌కు మరిన్ని మార్పులు చేయండి: ‘హోమ్ స్క్రీన్‌ను కస్టమైజ్ చేయండి’ ట్యాప్ చేయండి. వాల్‌పేపర్ రంగును మార్చడానికి రంగును ట్యాప్ చేయండి, కస్టమ్ ఫోటోను ఉపయోగించడానికి దీర్ఘచతురస్ర బటన్‌పై ఫోటో ట్యాప్ చేయండి లేదా వాల్‌పేపర్‌ను బ్లర్ చేయడానికి 'బ్లర్ చేయండి' ఎంచుకోండి అప్పుడు యాప్‌లు స్పష్టంగా కనిపిస్తాయి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.