ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో మీ క్యాలెండర్ సెట్టింగ్‌లను మార్చడం

క్యాలెండర్ యాప్ లో, మీరు iCloud, Google, Microsoft Exchange, Yahoo వంటి వివిధ ఖాతాలను జోడించవచ్చు. కొత్త ఇవెంట్‌లను సృష్టించడం సులభతరం చేయడానికి, మీకు అనుకూలంగా ఉండే విధంగా మీ క్యాలెండర్ కనిపించడానికి మీరు డిఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చవచ్చు. ఉదాహరణకు, మీరు కొత్త ఇవెంట్‌ల కోసం డిఫాల్ట్ క్యాలెండర్‌ను ఎంచుకోవచ్చు, కొత్త ఇవెంట్‌ల వ్యవధిని మార్చవచ్చు, అలాగే మరెన్నో చేయవచ్చు.

iCloud, Google, Exchange లేదా Yahoo క్యాలెండర్ ఖాతాలను సెటప్ చేయడం

  1. సెట్టింగ్స్  >యాప్స్> క్యాలెండర్‌కు వెళ్లండి.

  2. క్యాలెండర్ ఖాతాలు > ‘ఖాతాను జోడించండి’ని ట్యాప్ చేయండి.

  3. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • Mail సర్వీస్‌ను (ఉదాహరణకు, iCloud, Microsoft Exchange లేదా Google) ట్యాప్ చేసి, ఆపై సైన్ ఇన్ చేయండి.

    • ‘ఇతరం’ను ట్యాప్ చేసి, ‘CalDAV ఖాతాను జోడించండి’ లేదా ‘సబ్‌స్క్రైబ్ చేసుకున్న క్యాలెండర్‌ను జోడించండి’ని ట్యాప్ చేసి, ఆపై మీ సర్వర్, ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.

CalDAV ఖాతాను జోడించడం

  1. సెట్టింగ్స్  >యాప్స్> క్యాలెండర్‌కు వెళ్లండి.

  2. క్యాలెండర్ ఖాతాలు > ‘ఖాతాను జోడించండి’ని ట్యాప్ చేయండి.

  3. ‘ఇతరం’ను ట్యాప్ చేసి, ఆపై ‘CalDAV ఖాతాను జోడించండి’ని ట్యాప్ చేయండి.

  4. మీ సర్వర్, ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.

డిఫాల్ట్ క్యాలెండర్‌ను ఎంచుకోవడం

మీకు పలు క్యాలెండర్‌లు ఉంటే, మీరు డిఫాల్ట్ క్యాలెండర్‌ను ఎంచుకోవచ్చు, తద్వారా మీరు సృష్టించే ఏవైనా కొత్త ఇవెంట్‌లు ఆ క్యాలెండర్‌కు ఆటోమేటిక్‌గా జోడించబడతాయి.

  1. సెట్టింగ్స్  >యాప్స్> క్యాలెండర్‌కు వెళ్లండి.

  2. ‘డిఫాల్ట్ క్యాలెండర్’ను ట్యాప్ చేసి, ఆపై మీరు మీ డిఫాల్ట్ క్యాలెండర్‌గా ఉపయోగించాలనుకుంటున్న క్యాలెండర్‌ను ఎంచుకోండి.

నోట్: మీరు ఒక ఇవెంట్‌ను సృష్టించిన తర్వాత, దానిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేరే క్యాలెండర్‌కు తరలించవచ్చు. వివిధ క్యాలెండర్‌లను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోవడానికి, వివిధ క్యాలెండర్‌లను సెటప్ చేయడం ఆర్టికల్ చూడండి.

డిఫాల్ట్ ఇవెంట్ సెట్టింగ్‌లను సెట్ చేయడం

మీరు క్యాలెండర్ ఇవెంట్‌ల కోసం డిఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చవచ్చు, ఉదాహరణకు, కొత్త ఇవెంట్‌ల వ్యవధి, రాబోయే ఇవెంట్‌కు వెళ్ళడానికి సమయం వచ్చినప్పుడు అలర్ట్ పంపాలా వద్దా వంటి మరిన్ని సెట్టింగ్‌లు.

  1. సెట్టింగ్స్  >యాప్స్> క్యాలెండర్‌కు వెళ్లండి.

  2. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • వివిధ రకాల ఇవెంట్‌ల కోసం అలర్ట్‌లు ఎప్పుడు పొందాలో ఎంచుకోవడం: ‘డిఫాల్ట్ అలర్ట్ సమయాలు’ను ట్యాప్ చేసి, ‘పుట్టినరోజులు’, ‘ఇవెంట్‌లు’ లేదా ‘రోజు మొత్తం ఉండే ఇవెంట్‌లు’ను ట్యాప్ చేసి, ఆపై ఒక ఎంపికను ఎంచుకోండి.

    • రాబోయే ఇవెంట్‌లో జాయిన్ అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు అలర్ట్ పంపాలో వద్దో ఎంచుకోవడం: ‘డిఫాల్ట్ అలర్ట్ సమయాలు’ను ట్యాప్ చేసి, ఆపై ‘నిష్క్రమించాల్సిన సమయం’ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

    • కొత్త ఇవెంట్‌ల డిఫాల్ట్ వ్యవధిని మార్చడం: కొత్త ఇవెంట్‌ల వ్యవధిని ట్యాప్ చేసి, ఆపై వ్యవధిని ఎంచుకోండి.

    • మీరు కొత్త ఇవెంట్‌ను సృష్టించినప్పుడు, క్యాలెండర్ లొకేషన్‌ను సూచించాలో వద్దో ఎంచుకోవడం: లొకేషన్ సూచనలను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

మీ క్యాలెండర్ కనిపించే తీరును మార్చడం

మీకు అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని హైలైట్ చేయడంలో సహాయపడటానికి, మీరు మీ క్యాలెండర్ కనిపించే తీరును కస్టమైజ్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు వారాన్ని ఏ రోజుతో ప్రారంభించాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు, చైనీస్, హిబ్రూ లేదా ఇస్లామిక్ క్యాలెండర్ (గ్రెగోరియన్ క్యాలెండర్‌తో పాటు), మరిన్నింటిని ప్రదర్శించవచ్చు.

  1. సెట్టింగ్స్  >యాప్స్> క్యాలెండర్‌కు వెళ్లండి.

  2. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • చైనీస్, హిబ్రూ లేదా ఇస్లామిక్ క్యాలెండర్‌ను ప్రదర్శించడం: ‘ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లు’ను ట్యాప్ చేసి, ఆపై క్యాలెండర్‌ను ఎంచుకోండి.

    • సంవత్సరంలోని ప్రతి వారం పక్కనే వారం నంబర్‌ను ప్రదర్శించడం: ‘వారం నంబర్‌లు’ను ఆన్ చేయండి.

    • ప్రస్తుత రోజును వారం వీక్షణలో మొదటి రోజుగా చూపడం: ‘వారం వీక్షణ ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది’ని ట్యాప్ చేయండి.

    • వారాన్ని ప్రారంభించడానికి వేరే రోజును ఎంచుకోవడం: ‘ఈ రోజుతో వారాన్ని ప్రారంభించండి’ని ట్యాప్ చేసి, ఆపై రోజును ట్యాప్ చేయండి.

మీరు క్యాలెండర్‌ను ఉపయోగించే విధానం ఆధారంగా యాప్‌లలో సూచనలు ఇవ్వడానికి మీరు Siriని అనుమతించవచ్చు. సెట్టింగ్స్ > యాప్స్ > క్యాలెండర్‌కు వెళ్ళి, Siriని ట్యాప్ చేసి, ‘ఈ యాప్ నుండి నేర్చుకోండి’ని ఆన్ చేయండి. శోధన, విడ్జెట్‌లులో, అలాగే నోటిఫికేషన్‌లుగా కనిపించడానికి క్యాలెండర్ నుండి సూచనలు, కంటెంట్‌ను మీరు అనుమతించవచ్చు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.