ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని Mailలో ‘నా ఇమెయిల్‌ను దాచండి’ని ఉపయోగించడం

మీరు iCloud+కు సబ్‌స్క్రైబ్ చేసినప్పుడు, మీ అసలైన ఇమెయిల్ అడ్రెస్‌ను గోప్యంగా ఉంచడానికి, మీ అసలైన ఇమెయిల్ ఖాతాకు ఫార్వర్డ్ చేయబడే ఇమెయిల్ సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి ‘నా ఇమెయిల్‌ను దాచండి’ మీకు వీలు కల్పిస్తుంది. మీరు Mail యాప్‌లో డిమాండ్ మేరకు ప్రత్యేకమైన ఇమెయిల్ అడ్రెస్‌లను కూడా రూపొందించవచ్చు.

డ్రాఫ్ట్ ఇమెయిల్‌ను కంపోజ్ చేయడాన్ని చూపుతున్న ఇమేజ్. ’వీరి నుండి’ ఫీల్డ్ దిగువన జాబితా చేయబడిన ‘వ్యక్తిగత ఇమెయిల్ అడ్రెస్’, ’నా ఇమెయిల్‌ను దాచండి’ అనే రెండు ఎంపికలతో ఎంచుకోబడింది.

‘నా ఇమెయిల్‌ను దాచండి’తో ఇమెయిల్‌ను పంపడం

  1. మీ iPhoneలో Mail యాప్ కి వెళ్ళండి.

  2. కంపోజ్ బటన్ ట్యాప్ చేయండి.

  3. మీ సందేశం కోసం స్వీకర్త, సబ్జెక్ట్‌ను జోడించండి.

    నోట్: మీరు’నా ఇమెయిల్‌ను దాచండి’ని ఉపయోగించి ఒకసారి ఒక గ్రహీతకు ఒక సందేశాన్ని మాత్రమే పంపవచ్చు.

  4. “వీరి నుండి” ఫీల్డ్‌ను ట్యాప్ చేసి, దానిని మళ్ళీ ట్యాప్ చేసి, ఆపై “నా ఇమెయిల్‌ను దాచండి”ని ట్యాప్ చేయండి. ‘వీరి నుండి’ ఫీల్డ్‌లో కొత్త, ప్రత్యేకమైన ఇమెయిల్ అడ్రెస్ కనిపిస్తుంది.

చిట్కా: మీరు ‘నా ఇమెయిల్‌ను దాచండి’ని ఉపయోగించి పంపిన సందేశానికి స్వీకర్త రిప్లై ఇచ్చినప్పుడు, వారి రిప్లై మీ అసలైన ఇమెయిల్‌కు ఫార్వర్డ్ చేయబడుతుంది. ‘అడ్రెస్‌కు ఫార్వర్డ్ చేయండి’ని సెటప్ చేయడానికి, సెట్టింగ్‌లలో ‘నా ఇమెయిల్ అడ్రెస్‌లను దాచండి’ని సృష్టించి, నిర్వహించడం ఎలానో చూడండి.

‘నా ఇమెయిల్‌ను దాచండి’ని ఉపయోగించి ఇమెయిల్‌కు రిప్లై ఇవ్వడం

మీరు మీ ప్రత్యేకమైన, ర్యాండమ్ అడ్రెస్‌లలో ఒకదానికి పంపిన ఇమెయిల్ సందేశాన్ని స్వీకరించినప్పుడు, అదే అడ్రెస్‌ను ఉపయోగించి రిప్లై ఇవ్వవచ్చు. ఇది సంభాషణను కొనసాగించడానికి, మీ అసలైన ఇమెయిల్ అడ్రెస్‌ను ప్రైవేట్‌గా ఉంచడానికి మీకు వీలు కల్పిస్తుంది. రిప్లై ఇవ్వడానికి, దిగువ పేర్కొన్న విధంగా చేయండి:

  1. మీ iPhoneలో Mail యాప్ కి వెళ్ళండి.

  2. సందేశాన్ని ట్యాప్ చేసి, రిప్లై బటన్ను ట్యాప్ చేసి, ఆపై ‘రిప్లై’ని ట్యాప్ చేయండి.

  3. మీ ప్రతిస్పందనను టైప్ చేయండి.

    స్వీకర్తకు కనిపించే ఇమెయిల్ అడ్రెస్‌ను చూడటానికి మీరు ’వీరి నుండి’ ఫీల్డ్‌ను ట్యాప్ చేయవచ్చు.

‘నా ఇమెయిల్‌ను దాచండి’ ద్వారా రూపొందిచబడిన అడ్రెస్‌లను నిర్వహించడం

మీరు ’నా ఇమెయిల్‌ను దాచండి’తో సృష్టించిన ర్యాండమ్ అడ్రెస్‌లను సృష్టించవచ్చు, డీయాక్టివేట్ చేయవచ్చు, రీయాక్టివేట్ చేయవచ్చు, అలాగే నిర్వహించవచ్చు. సెట్టింగ్‌లలో ‘నా ఇమెయిల్ అడ్రెస్‌లను దాచండి’ని సృష్టించి, నిర్వహించడం ఎలానో చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.