ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలోని Safari ఉపయోగించి వెబ్ బ్రౌజ్ చేయడం

మీరు వెబ్‌ను బ్రౌజ్ చేయవచ్చు, వెబ్‌సైట్‌లను చూడవచ్చు, వెబ్‌సైట్ లింక్‌లను ప్రివ్యూ చేయవచ్చు, వెబ్‌పేజీలను అనువదించవచ్చు, అలాగే Safari యాప్ తొలగించబడితే దాన్ని మళ్ళీ మీ హోమ్ స్క్రీ‌న్‌కు జోడించవచ్చు. మీ అన్ని డివైజ్‌లలోని తెరచిన ట్యాబ్‌లు, బుక్‌మార్క్‌లు, హిస్టరీ, పఠన జాబితాను అప్‌డేట్‌గా ఉంచడానికి, ఒకే Apple ఖాతాతో iCloudకు సైన్ ఇన్ చేయండి.

Safariలో కాంఫ్యాక్ట్ ట్యాబ్ లేఔట్‌తో తెరిచిన వెబ్‌సైట్. దిగువన, ఎడమ నుండి కుడికి, వెనుక బటన్, పేజీ మెన్యూ బటన్, శోధన ఫీల్డ్, రీలోడ్ బటన్, మరిన్ని బటన్‌లు ఉన్నాయి.

వెబ్‌పేజీకి వెళ్లడం

  1. మీ iPhoneలోని Safari యాప్ కు వెళ్ళండి.

  2. శోధన ఫీల్డ్‌లో వెబ్‌పేజీ పేరు లేదా వెబ్ అడ్రెస్ (URL)ను నమోదు చేయండి.

Safariలో వెబ్‌సైట్‌లను చూడటం

  1. మీ iPhoneలోని Safari యాప్ కు వెళ్ళండి.

  2. దిగువ వాటిలో ఏదైనా చేయండి:

    • తిరిగి పైకి వెళ్లడానికి: పొడవైన పేజీ ఎగువకు త్వరగా తిరిగి రావడానికి స్క్రీన్ ఎగువ అంచుని డబల్ ట్యాప్ చేయండి.

    • పేజీలోని పూర్తి సమాచారం చూడటానికి: iPhoneను ల్యాండ్‌స్కేప్ ఓరియంటేషన్‌కు తిప్పండి.

    • పేజీని రిఫ్రెష్ చేయడానికి: పేజీలో ఎగువ నుండి దిగువకు లాగండి.

    • లింక్‌లను షేర్ చేయడానికి: పేజీ దిగువన మరెన్నో బటన్ ట్యాప్ చేసి, ఆపై ’షేర్’ ట్యాప్ చేయండి.

      మీ ట్యాబ్ లేఔట్ దిగువన లేదా ఎగువన ఉంటే, ట్యాబ్స్ బటన్ ట్యాప్ చేయండి. Safariలో లేఔట్‌ను మార్చడం అనే ఆర్టికల్ చూడండి.

వెబ్‌సైట్ లింక్‌లను ప్రివ్యూ చేయడం

  1. మీ iPhoneలోని Safari యాప్ ()కు వెళ్లండి.

  2. పేజీని తెరవకుండానే లింక్ ప్రివ్యూను చూడటానికి Safariలో లింక్‌ను టచ్ చేసి, పట్టుకోండి.

    లింక్‌ను తెరవడానికి, ప్రివ్యూని ట్యాప్ చేయండి లేదా ‘తెరవండి’ ఎంచుకోండి.

ప్రివ్యూను మూసివేసి ప్రస్తుత పేజీలో కొనసాగడానికి, ప్రివ్యూ వెలుపల ఎక్కడైనా ట్యాప్ చేయండి.

వెబ్‌సైట్ ప్రివ్యూ తర్వాత సాధ్యమయ్యే యాక్షన్‌ల జాబితా: తెరవండి, కొత్త ట్యాబ్‌లో తెరవండి, ట్యాబ్ గ్రూప్‌లో తెరవండి, లింక్ చేయబడిన ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి, అలాగే పఠన జాబితాకు జోడించండి.

వెబ్‌పేజీ లేదా ఇమేజ్‌ను అనువదించడం

మీరు వేరే భాషలో ఉన్న వెబ్‌పేజీ లేదా ఇమేజ్‌ను చూసినప్పుడు, టెక్స్ట్‌ను అనువదించడానికి Safariని ఉపయోగించవచ్చు (అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు).

  1. మీ iPhoneలోని Safari యాప్ ()కు వెళ్లండి.

  2. పేజీ మెన్యూ బటన్ ట్యాప్ చేస్తే, ఆపై ‘[భాష]కు అనువదించండి’ (అనువాదం అందుబాటులో ఉంటే) ట్యాప్ చేయండి.

Safariని మళ్ళీ మీ హోమ్ స్క్రీన్‌కు జోడించడం

హోమ్ స్క్రీన్‌లో మీకు Safari కనిపించకపోతే, అది యాప్ లైబ్రరీలో అందుబాటులో ఉంటుంది, మీరు దాన్ని మళ్ళీ జోడించవచ్చు.

  1. హోమ్ స్క్రీన్‌లో, మీకు యాప్ లైబ్రరీ కనిపించే వరకు ఎడమకు స్వైప్ చేయండి.

  2. శోధన ఫీల్డ్‌లో “Safari" అని టైప్ చేయండి.

  3. Safari యాప్ ఐకాన్ను టచ్ చేసి ఉంచి, ఆపై ‘హోమ్ స్క్రీన్‌కు జోడించండి’పై ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.