ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్లను ఉపయోగించడం

FaceTime యాప్ లేదా థర్డ్-పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు, మీరు ఫుల్-స్క్రీన్ వీడియో ఎఫెక్ట్‌లను ఉపయోగించవచ్చు, అలాగే కెమెరా ఫ్రేమ్‌ను 3D ఎఫెక్ట్‌లతో ఫిల్ చేసే హ్యాండ్ జెశ్చర్స్‌తో రియాక్షన్‌లను జోడించవచ్చు.

వీడియో కాల్‌లో వీడియో ఎఫెక్ట్‌లను ఉపయోగించడం

  1. మీ iPhoneలో FaceTime యాప్‌ లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు, మీ టైల్‌ను నొక్కండి.

  2. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • మీరు కదులుతున్నప్పుడు కెమెరా ఫ్రేమ్‌లో మిమ్మల్ని మీరు ఉంచుకోవడం: సెంటర్ స్టేజ్—iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone Airలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది—డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. దీన్ని ఆఫ్ చేయడానికి, కెమెరా ఎఫెక్ట్‌లను ట్యాప్ చేసి, ఆపై సెంటర్ స్టేజ్‌ను ట్యాప్ చేయండి.

    • బ్యాక్‌‌గ్రౌండ్‌ను బ్లర్ చేయండి: iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone Airలలో, ‘కెమెరా ఎఫెక్ట్‌లు’ ట్యాప్ చేసి, ఆపై పోర్ట్రెయిట్‌ను ట్యాప్ చేయండి. ఇతర మోడళ్ళలో, పోర్ట్రెయిట్‌ను ట్యాప్ చేయండి. పోర్ట్రెయిట్ మోడ్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయడం చూడండి.

    • బ్యాక్‌గ్రౌండ్ డిమ్ చేసి, మీ ముఖాన్ని ప్రకాశవంతం చేయండి: iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone Airలలో, కెమెరా ఎఫెక్ట్‌లను ట్యాప్ చేసి, ఆపై స్టూడియో లైట్‌ను ట్యాప్ చేయండి. ఇతర మోడళ్ళలో, స్టూడియో లైట్‌ను ట్యాప్ చేయండి.

    • యానిమేటెడ్ Memojiగా మారండి: iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone Airలలో, కెమెరా ఎఫెక్ట్‌లను ట్యాప్ చేసి, ఆపై Memojiని ట్యాప్ చేయండి. ఇతర మోడళ్ళలో, Memojiని ట్యాప్ చేయండి. మీ కదలికలు, ముఖ కవళికలు, స్వరాన్ని క్యాప్చర్ చేయడానికి మీరు బిల్ట్ ఇన్ Memojiని లేదా మీరు సృష్టించిన దానిని ఉపయోగించవచ్చు. Memojiని సృష్టించి, పంపడం అనే ఆర్టికల్ చూడండి.

    • చేతి జెశ్చర్‌లతో విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించండి: ’రియాక్షన్‌లు’ ట్యాప్ చేయండి. కంట్రోల్ సెంటర్‌లో రియాక్షన్‌లు ఆఫ్ చేయబడినప్పుడు, మీరు రియాక్షన్‌లను జోడించడానికి హ్యాండ్ జెశ్చర్స్‌ను ఉపయోగించలేరు, కానీ FaceTimeలో మీరు కాల్‌లో మీ టైల్‌ను టచ్ చేసి ఉంచినప్పుడు కనిపించే ఐకాన్‌లను ట్యాప్ చేయడం ద్వారా రియాక్షన్‌లను జోడించవచ్చు. వీడియో కాల్‌లో రియాక్షన్‌లను జోడించడం చూడండి.

థర్డ్ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లలో వీడియో ఎఫెక్ట్స్‌ను ఉపయోగించడానికి, కంట్రోల్ సెంటర్‌ను తెరిచి, యాప్‌ను ట్యాప్ చేసి, ఆపై ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్స్‌ను ట్యాప్ చేయండి.

నోట్: Memoji థర్డ్ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లలో అందుబాటులో ఉండదు.

పోర్ట్రెయిట్ మోడ్‌లో బ్లర్ మొత్తాన్ని లేదా స్టూడియో లైట్ తీవ్రతను అడ్జస్ట్ చేయడానికి, కంట్రోల్ సెంటర్‌ను తెరిచి, ఆపై FaceTime (లేదా థర్డ్ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్)ను ట్యాప్ చేయండి. పోర్ట్రెయిట్ లేదా స్టూడియో లైట్‌ను ట్యాప్ చేసి, ఆపై స్లైడర్‌ను అడ్జస్ట్ చేయండి.

వీడియో కాల్‌లో రియాక్షన్‌లను జోడించడం

FaceTime యాప్‌లో (అలాగే థర్డ్-పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లు) సులభమైన హ్యాండ్ జెశ్చర్స్‌తో, మీరు కెమెరా ఫ్రేమ్‌ను వినోదభరితంగా చేసే, 3D ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎఫెక్ట్‌లతో కూడిన రియాక్షన్‌లను జోడించవచ్చు—హార్ట్‌లు, బెలూన్‌లు, ఫైర్‌వర్క్స్, మరిన్ని. iPhone 12 లేదా ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో హ్యాండ్ జెశ్చర్స్ అందుబాటులో ఉన్నాయి.

నోట్: FaceTime కాల్ సమయంలో హ్యాండ్ జెశ్చర్స్ ఉపయోగించడానికి, మీ టైల్‌ను ట్యాప్ చేసి, ఆపై రియాక్షన్‌లు ఆన్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. థర్డ్-పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లో కాల్ సమయంలో హ్యాండ్ జెశ్చర్స్‌ను ఉపయోగించడానికి, కంట్రోల్ సెంటర్‌ను తెరిచి, ఆపై రియాక్షన్‌లు ఆన్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి. జెశ్చర్స్‌ను ఉపయోగించేటప్పుడు, ఎఫెక్ట్‌ను ఉపయోగించేటప్పుడు మీ చేతులను మీ ముఖం నుండి దూరంగా ఉంచి, ఒక క్షణం లేదా రెండు క్షణాలు పాజ్ చేయండి. (ఫ్రంట్ కెమెరా మాత్రమే రియాక్షన్‌లకు, జెశ్చర్స్‌కు మద్దతు ఇస్తుంది.) మీరు కాల్‌లో మీ టైల్‌ను టచ్ చేసి ఉంచి, ఆపై కనిపించే ఐకాన్‌లను ట్యాప్ చేయడం ద్వారా కూడా రియాక్షన్‌లను జోడించవచ్చు.

రియాక్షన్

జెశ్చర్

ఐకాన్

హార్ట్స్

హార్ట్స్ జెశ్చర్
హార్ట్స్ బటన్

థంబ్స్-అప్

థంబ్స్-అప్ జెశ్చర్
థంబ్స్ అప్ బటన్

థంబ్స్-డౌన్

థంబ్స్-డౌన్ జెశ్చర్
థంబ్స్ డౌన్ బటన్

బెలూన్‌లు

బెలూన్‌ల జెశ్చర్
బెలూన్స్ బటన్

రెయిన్

రెయిన్ జెశ్చర్
రెయిన్ బటన్

కాన్ఫెట్టీ

కాన్ఫెట్టీ జెశ్చర్
కాన్ఫెట్టీ బటన్

లేజర్ బర్స్ట్

లేజర్ బర్స్ట్ జెశ్చర్
లేజర్స్ బటన్

ఫైర్‌వర్క్స్

ఫైర్‌వర్క్స్ జెశ్చర్
ఫైర్‌వర్క్స్ బటన్
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.