iPhoneలోని ప్రివ్యూలో, PDF పేజీలను జోడించడం, డిలీట్ చేయడం, తిప్పడం, తరలించడం, లేదా క్రాప్ చేయడం

మీరు PDFలో పేజీలను జోడించవచ్చు, డిలీట్ చేయవచ్చు, తిప్పవచ్చు, రీఆర్డర్ చేయవచ్చు లేదా క్రాప్ చేయవచ్చు.

ఎడమ వైపున థంబ్నెయిల్‌తో కూడిన PDF కేటలాగ్. చివరి థంబ్‌నెయిల్ హైలైట్ చేయబడింది, దాని పైన కాపీ, ఎడమవైపుకి తిప్పండి, కుడివైపుకి తిప్పండి, పేజీ క్రాప్ చేయండి, బ్లాంక్ పేజీని చేర్చండి, ఫైల్ నుండి చేర్చండి, పేజీలను స్కాన్ చేయండి, అలాగే పేజీని డిలీట్ చేయండి ఎంపికలతో కూడిన మెన్యూ ఉంటుంది.

పేజీలను జోడించడం లేదా డిలీట్ చేయడం

  1. మీ iPhoneలో ప్రివ్యూ యాప్ కి వెళ్ళండి.

  2. PDFను తెరవండి.

  3. థంబ్‌నెయిల్‌లను చూపించడానికి పేజీ సంఖ్యను ట్యాప్ చేయండి. (పేజీ లెక్కింపు కనిపించకపోతే, పేజీలో రెండు వేళ్ళను ఒకదానితో ఒకటి లేదా వేరుగా పించ్ చేయండి.)

  4. థంబ్నెయిల్‌ను నొక్కి ఉంచి, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • ఖాళీ పేజీని ఇన్‌సర్ట్ చేయడం: ’ఖాళీ పేజీని ఇన్‌సర్ట్ చేయండి’ని ట్యాప్ చేయండి.

    • PDF లేదా ఇమేజ్‌ను ఇన్‌సర్ట్ చేయడం: ’ఫైల్ నుండి ఇన్‌సర్ట్ చేయండి’ ట్యాప్ చేయండి.

    • స్కాన్ చేసిన డాక్యుమెంట్‌ను ఇన్‌సర్ట్ చేయడం: ‘పేజీలను స్కాన్ చేయండి’ ట్యాప్ చేయండి, డాక్యుమెంట్‌ను స్కాన్ చేయండి, ఆపై ‘‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి. టెక్స్ట్, డాక్యుమెంట్‌లను స్కాన్ చేయడం అనే ఆర్టికల్ చూడండి.

    • ఎంచుకున్న పేజీని డిలీట్ చేయడం: ’పేజీని డిలీట్ చేయండి’ ట్యాప్ చేయండి.

పేజీని తిప్పడం

  1. మీ iPhoneలో ప్రివ్యూ యాప్ కి వెళ్ళండి.

  2. PDFను తెరవండి.

  3. ‘మరిన్ని’ బటన్ ట్యాప్ చేసి, ఆపై ’ఎడమవైపు తిప్పండి’ లేదా ’కుడివైపు తిప్పండి’ని ట్యాప్ చేయండి.

పేజీని తరలించడం

  1. మీ iPhoneలో ప్రివ్యూ యాప్ కి వెళ్ళండి.

  2. PDFను తెరవండి.

  3. మెన్యూ ఎంపికలు కనిపించే వరకు థంబ్‌నెయిల్‌ను నొక్కి ఉంచి, ఆపై పేజీని మరొక దాని పైకి లేదా కిందకు డ్రాగ్ చేయండి. (మీకు థంబ్‌నెయిల్‌లు కనిపించకపోతే, పేజీల సంఖ్యను చూపించడానికి స్క్రీన్‌పై ట్యాప్ చేయండి, ఆపై పేజీల సంఖ్యపై ట్యాప్ చేయండి.)

పేజీని క్రాప్ చేయడం

  1. మీ iPhoneలో ప్రివ్యూ యాప్ కి వెళ్ళండి.

  2. PDFను తెరవండి.

  3. మీరు క్రాప్ చేయాలనుకుంటున్న పేజీకి స్క్రోల్ చేసి, ఆపై క్రాప్ బటన్ ట్యాప్ చేయండి.

  4. ఏరియాను ఎంచుకోవడానికి నీలిరంగు హ్యాండిల్‌ను డ్రాగ్ చేసి, ఎంచుకున్న ఏరియాలో ట్యాప్ చేసి, ఆపై క్రాప్‌ను ట్యాప్ చేయండి.

మార్పును అన్‌డూ చేయడానికి, ‘మరిన్ని’ బటన్ ట్యాప్ చేసి, ఆపై ’అన్‌డూ’ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.