ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPhoneలో Touch IDని సెటప్ చేయండి

iPhoneను సురక్షితంగా, సులభంగా అన్‌లాక్ చేయడానికి, కొనుగోళ్ళను, చెల్లింపులను ధృవీకరించడానికి, అలాగే హోమ్ బటన్‌ను మీ వేలు లేదా బొటన వేలితో నొక్కడం ద్వారా అనేక థర్డ్ పార్టీ యాప్‌లలో సైన్ ఇన్ చేయడానికి Touch ID (మద్దతు ఇచ్చే మోడల్‌లలో) ఉపయోగించండి.

Touch ID ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా మీ iPhoneలో పాస్‌కోడ్‌ను కూడా సెటప్ చేయాలి.

Touch ID ఆన్ చేయడం

  1. సెట్టింగ్స్  > Touch ID & పాస్‌కోడ్‌కు వెళ్ళండి.

  2. ‘Touch ID కోసం ఉపయోగించండి’ దిగువన ఉన్న ఎంపికలలో ఏదైనా ఆన్ చేయండి, ఆపై స్క్రీన్ పైన వచ్చే సూచనలను అనుసరించండి.

మీరు iTunes & App Storeను ఆన్ చేస్తే, మీరు App Store, Apple Books లేదా iTunes Store నుండి మొదటి కొనుగోలును చేస్తున్నప్పుడు మీ Apple ఖాతా పాస్‌వర్డ్‌ను అడుగుతుంది మీరు మీ తదుపరి కొనుగోళ్ళు చేసినప్పుడు, మీరు Touch IDను ఉపయోగించాలని అడుగుతుంది.

నోట్: మీరు వేలిముద్రను జోడించలేకపోతుంటే లేదా Touch ID ఉపయోగించి మీ iPhoneను అన్‌లాక్ చేయలేకపోతుంటే, మీ iPhone లేదా iPadలో Touch ID పనిచేయకపోతే అనే Apple మద్దతు ఆర్టికల్ చూడండి.

Touch ID ఎప్పుడు ఉపయోగించాలో ఎంచుకోండి

మీరు మీ iPhoneను అన్‌లాక్ చేయడానికి, చెల్లింపులను ధృవీకరించడానికి, పాస్‌వర్డ్‌లను ఆటోమేటిక్‌గా నింపడానికి, ఇంకా పాస్‌వర్డ్‌ సంరక్షిత యాప్‌లను తెరవడానికి Touch ID ఉపయోగించవచ్చు.

సెట్టింగ్స్  > Touch ID & పాస్‌కోడ్‌కు వెళ్ళి, ఆపై 'Face ID ఉపయోగించండి' దిగువన ఉన్న ఎంపికలను ఆన్ చేయండి.

వేలిముద్రను జోడించండి

మీరు అనేక వేలిముద్రలను జోడించవచ్చు (ఉదాహరణకు మీ బొటనవేళ్లు, చూపుడు వేళ్లు).

  1. సెట్టింగ్స్  > Touch ID & పాస్‌కోడ్‌కు వెళ్ళండి.

  2. ‘వేలిముద్రను జోడించండి’ ట్యాప్ చేయండి.

  3. స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించండి.

వేలిముద్రకు పేరు పెట్టండి లేదా డిలీట్ చేయండి

  1. సెట్టింగ్స్  > Touch ID & పాస్‌కోడ్‌కు వెళ్ళండి.

    మీరు ఒకటి కంటే ఎక్కువ వేలిముద్రలను జోడించినట్లయితే, దాని ప్రింట్‌ను గుర్తించడానికి హోమ్ బటన్‌పై వేలిని ఉంచండి.

  2. వేలిముద్రను ట్యాప్ చేసి, ఆపై పేరును (“బొటనవేలు” వంటివి) నమోదు చేయండి లేదా ‘వేలిముద్రను డిలీట్ చేయండి’ ట్యాప్ చేయండి.

Touch IDని ఆఫ్ చేయండి

సెట్టింగ్స్  > Touch ID & పాస్‌కోడ్‌కు వెళ్ళి, ఆపై ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎంపికలను ఆఫ్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.