ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadను మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్‌గా ఉపయోగించడం

మాగ్నిఫైయర్ యాప్‌లో, మీరు మీ iPadను మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా ఉపయోగించి టెక్స్ట్‌ను లేదా మీ చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్‌లను జూమ్ ఇన్ చేయవచ్చు.

పువ్వును క్లోజప్‌లో చూపుతున్న మ్యాగ్నిఫైయర్ యాప్.

సమీపంలోని టెక్స్ట్ లేదా ఆబ్జెక్ట్‌లను మ్యాగ్నిఫై చేయడం

  1. మీ iPadలో మ్యాగ్నిఫైయర్ యాప్ కి వెళ్లండి.

  2. మీరు మ్యాగ్నిఫై చేయాలనుకుంటున్న టెక్స్ట్ లేదా ఆబ్జెక్ట్ వైపు iPad కెమెరాను చూపించి, ఆపై జూమ్ ఇన్ లేదా జూమ్ ఔట్ చేయడానికి స్లైడర్‌ను డ్రాగ్ చేయండి.

  3. మీరు దిగువ పేర్కొన్న డిఫాల్ట్ కంట్రోల్‌లలో ఏదైనా ఉపయోగించవచ్చు:

చిట్కా: కంట్రోల్ సెంటర్ నుండి లేదా iPad బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా మ్యాగ్నిఫైయర్‌ను త్వరగా తెరవడానికి షార్ట్‌కట్‌ను సెటప్ చేయండి. సౌలభ్య సాధనాల ఫీచర్‌లను త్వరగా ఆన్ లేదా ఆఫ్ చేయడం అనే ఆర్టికల్ చూడండి.

ఫ్రేమ్‌ను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడం

మీరు ఫోటోస్‌లో సేవ్ చేయకుండా ఫ్రేమ్‌లో ఉన్న వాటిని తాత్కాలికంగా క్యాప్చర్ చేయవచ్చు.

  1. మీ iPadలో మ్యాగ్నిఫైయర్ యాప్ కి వెళ్లండి.

  2. క్యాప్చర్ బటన్ ట్యాప్ చేసి, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

చదవడాన్ని సులభతరం చేయడానికి టెక్స్ట్‌ను ఫార్మాట్‌లో చూడటం

మీరు టెక్స్ట్ ఉన్న ఫ్రేమ్‌ను క్యాప్చర్ చేస్తే, మీరు దానిని సులభంగా, చదవడానికి అనుకూలమైన ఫార్మాట్‌లో చూడవచ్చు. మీరు టెక్స్ట్ ఫాంట్, సైజ్, రంగును అడ్జస్ట్ చేయవచ్చు లేదా బిగ్గరగా చదివి వినిపించేలా చేయవచ్చు.

  1. మీ iPadలో మ్యాగ్నిఫైయర్ యాప్ కి వెళ్లండి.

  2. ఫ్రేమ్‌ను క్యాప్చర్ చేయడానికి క్యాప్చర్ బటన్ ట్యాప్ చేసి, ఆపై రీడర్ బటన్ ట్యాప్ చేయండి.

    మీరు క్యాప్చర్ చేసిన ఫ్రేమ్‌లో ఎటువంటి టెక్స్ట్ కనుగొనబడకపోతే మ్యాగ్నిఫైయర్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.

  3. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • టెక్స్ట్ రూపాన్ని మార్చడం: టెక్స్ట్ సైజ్ బటన్ను ట్యాప్ చేసి, ఆపై టెక్స్ట్ ఫాంట్, సైజ్, రంగు కోసం ఎంపికలను ఎంచుకోండి.

    • బిగ్గరగా చదవబడే టెక్స్ట్ వినడం: టెక్స్ట్ సైజ్ బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘పేజీలోని టెక్స్ట్‌ను మాటల రూపంలో వినండి’ ట్యాప్ చేయండి.

    • క్యాప్చర్ చేసిన ఫ్రేమ్‌కు తిరిగి వెళ్ళడం: మూసివేయండి బటన్ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.