ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని రిమైండర్స్‌లో టెంప్లేట్‌లతో పని చేయడం

రిమైండర్స్ యాప్‌లో, మీరు రొటీన్‌లు, ప్యాకింగ్ జాబితాలు మరిన్నింటి కోసం జాబితాను తిరిగి ఉపయోగించడానికి టెంప్లేట్‌గా దానిని సేవ్ చేయవచ్చు. టెంప్లేట్‌ను ప్రచురించి, ఇతర వ్యక్తులతో షేర్ చేయడానికి లింక్‌ను సృష్టించండి లేదా ఇతరులు షేర్ చేసిన టెంప్లేట్‌లను డౌన్‌లోడ్ చేయండి.

జాబితాను టెంప్లేట్‌గా సేవ్ చేయడం

  1. మీ iPadలోని రిమైండర్స్ యాప్ కు వెళ్ళండి.

  2. జాబితా ఎగువన, మరిన్ని బటన్ ట్యాప్ చేసి, ఆపై ’టెంప్లేట్‌గా సేవ్ చేయండి’ ట్యాప్ చేయండి.

  3. టెంప్లేట్ కోసం పేరును నమోదు చేయండి.

  4. ‘పూర్తి చేసిన రిమైండర్‌లను చేర్చండి’ని ఆన్ లేదా ఆఫ్ చేసి, ఆపై ’సేవ్ చేయండి’ని ట్యాప్ చేయండి.

మీరు జాబితా నుండి టెంప్లేట్‌ను రూపొందించిన తర్వాత, ఆ జాబితాలో మీరు చేసిన ఏవైనా మార్పులు టెంప్లేట్‌ను ప్రభావితం చేయవు.

టెంప్లేట్ నుండి కొత్త జాబితాను రూపొందించడం

  1. మీ iPadలోని రిమైండర్స్ యాప్ కు వెళ్ళండి.

  2. మీ జాబితాల ఎగువన, మరిన్ని బటన్ను ట్యాప్ చేసి, ‘టెంప్లేట్‌లు’ను ట్యాప్ చేసి, ఆపై టెంప్లేట్ పేరును ట్యాప్ చేయండి.

  3. జాబితా కోసం పేరును నమోదు చేసి, ఆపై ‘సృష్టించండి’ని ట్యాప్ చేయండి.

టెంప్లేట్‌ను ఎడిట్ చేయడం లేదా డిలీట్ చేయడం

మీరు టెంప్లేట్‌కు చేసిన ఏవైనా మార్పులు టెంప్లేట్ నుండి గతంలో రూపొందించిన జాబితాలను ప్రభావితం చేయవు.

  1. మీ iPadలోని రిమైండర్స్ యాప్ కు వెళ్ళండి.

  2. మీ జాబితాల ఎగువన, మరిన్ని బటన్ ట్యాప్ చేసి, ‘టెంప్లేట్‌లు’ ట్యాప్ చేసి, ఆపై ఎడిట్ బటన్ ట్యాప్ చేయండి.

  3. ఈ క్రింది వాటిలో ఒకటి ఎంచుకోండి:

    • టెంప్లేట్‌ను ఎడిట్ చేయడం: టెంప్లేట్‌లో ఏవైనా ఐటెమ్‌లను జోడించండి, ఎడిట్ చేయండి లేదా డిలీట్ చేయండి. మీరు టెంప్లేట్ పేరు, రంగు, ఐకాన్‌ను కూడా మార్చవచ్చు.

    • టెంప్లేట్‌ను డిలీట్ చేయడం: టెంప్లేట్‌ను తొలగించండి.

టెంప్లేట్‌ను షేర్ చేయడం

మీరు టెంప్లేట్‌ను షేర్ చేసినప్పుడు, Apple సర్వర్‌లకు యాక్సెస్ ఉంటుంది, తద్వారా లింక్‌ని కలిగి ఉన్న ఎవరైనా iOS 16, iPadOS 16, macOS 13 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో రన్ అయ్యే డివైజ్‌లో టెంప్లేట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షేర్ చేసిన టెంప్లేట్‌లో ఏవైనా తేదీలు, ట్యాగ్‌లు లేదా లొకేషన్‌లను ఉంచాలా వద్దా అని మీరు ఎంచుకోవచ్చు; ఇమేజ్‌లు తీసివేయబడతాయి.

  1. మీ iPadలోని రిమైండర్స్ యాప్ కు వెళ్ళండి.

  2. మీ జాబితాల ఎగువన, మరిన్ని బటన్ను ట్యాప్ చేసి, ‘టెంప్లేట్‌లు’ను ట్యాప్ చేసి, ఆపై మీరు షేర్ చేయాలనుకుంటున్న టెంప్లేట్ పక్కన ఉన్న ఎడిట్ బటన్ను ట్యాప్ చేయండి.

  3. ‘టెంప్లేట్‌ను షేర్ చేయండి’ని ట్యాప్ చేసి, ఆపై షేర్ చేయడానికి ఒక పద్ధతిని ఎంచుకోండి.

షేర్ చేసిన టెంప్లెట్‌ను నిర్వహించడానికి, మరిన్ని బటన్ను ట్యాప్ చేసి, ‘టెంప్లెట్‌లు’ను ట్యాప్ చేసి, ఎడిట్ బటన్ను ట్యాప్ చేసి, ‘లింక్‌ను నిర్వహించండి’ని ట్యాప్ చేయండి.

మీరు షేర్ చేసిన తర్వాత టెంప్లేట్‌లో మార్పులు చేస్తే, మీరు షేర్ చేసిన వెర్షన్‌ను అప్‌డేట్ చేయవచ్చు. మునుపటి వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసిన ఎవరైనా, అప్‌డేట్‌లను పొందడానికి టెంప్లేట్‌ను మళ్ళీ డౌన్‌లోడ్ చేయాలి.

మీరు టెంప్లేట్‌ను షేర్ చేయడాన్ని ఆపివేస్తే, అది ఇప్పటికే టెంప్లేట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారిని ప్రభావితం చేయదు.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.