ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో Face IDని సెటప్ చేయడం

మీ iPad వైపు ఒకసారి చూడటం ద్వారా iPadను సురక్షితంగా, సులభంగా అన్‌లాక్ చేయడానికి, కొనుగోళ్ళను, చెల్లింపులను ధృవీకరించడానికి, అనేక థర్డ్ పార్టీ యాప్‌లలో సైన్ చేయడానికి Face ID (మద్దతు ఇచ్చే మోడల్‌లలో) ఉపయోగించండి.

Face ID ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా మీ iPadలో పాస్‌కోడ్‌ను కూడా సెట్ చేయాలి.

Face ID సెటప్ చేయండి లేదా ప్రత్యామ్నాయ రూపాన్ని జోడించండి

  • మీరు మీ iPadను మొదటిసారి సెటప్ చేస్తున్నప్పుడు Face IDని సెటప్ చేయకపోతే, సెట్టింగ్స్  > Face ID & పాస్‌కోడ్ > 'Face ID సెటప్ చేయండి'కి వెళ్ళి, స్క్రీన్‌పై వచ్చే సూచనలను అనుసరించండి.

  • గుర్తించగలిగేలా Face ID కోసం అదనపు రూపాన్ని సెటప్ చేయడానికి, సెట్టింగ్స్ > Face ID & పాస్‌కోడ్ > ‘ప్రత్యామ్నాయ కనపడే తీరుని సెటప్ చేయండి’కి వెళ్ళి, స్క్రీన్‌పై వచ్చే సూచనలను అనుసరించండి.

    Face ID గుర్తింపు సెటప్ స్క్రీన్. స్క్రీన్‌పై వృత్తంలో అమర్చినట్లు కనిపించే నవ్వుతున్న ముఖం. సర్కిల్‌ను పూర్తి చేయడానికి తలను నెమ్మదిగా కదిలించమని యూజర్‌కు సూచించే దిగువ ఉన్న టెక్స్ట్. స్క్రీన్ దిగువకు దగ్గరలో 'ప్రారంభించండి' బటన్ కనిపిస్తుంది.

Face ID ఎప్పుడు ఉపయోగించాలో ఎంచుకోండి

మీరు మీ iPadను అన్‌లాక్ చేయడానికి, చెల్లింపులను ధృవీకరించడానికి, పాస్‌వర్డ్‌లను ఆటోమేటిక్‌గా నింపడానికి, ఇంకా పాస్‌వర్డ్‌ సంరక్షిత యాప్‌లను తెరవడానికి Face ID ఉపయోగించవచ్చు.

సెట్టింగ్స్  > Face ID & పాస్‌కోడ్‌కు వెళ్ళి, ఆపై 'Face ID ఉపయోగించండి' దిగువన ఉన్న ఎంపికలను ఆన్ చేయండి.

Face IDని తాత్కాలికంగా డిసేబల్ చేయండి

మీరు మీ iPadను అన్‌లాక్ చేయకుండా Face IDని తాత్కాలికంగా నిరోధించవచ్చు.

  1. టాప్ బటన్‌ను, వాల్యూమ్ బటన్‌ను 2 సెకన్ల పాటు నొక్కి ఉంచండి.

  2. స్లైడర్ కనిపించిన తర్వాత, iPadను వెంటనే లాక్ చేయడానికి రద్దుపై ట్యాప్ చేయండి.

    మీరు ఒక నిమిషం లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటు స్క్రీన్‌ను టచ్ చేయకపోతే iPad ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది.

మీరు ఈసారి మీ పాస్‌కోడ్‌తో iPadను అన్‌లాక్ చేసేటప్పుడు, Face ID మళ్ళీ ఎనేబల్ చేయబడుతుంది.

Face ID ఆఫ్ చేయండి

  1. సెట్టింగ్స్  > Face ID & పాస్‌కోడ్‌కు వెళ్లండి.

  2. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • నిర్దిష్ట ఐటెమ్‌ల కోసం మాత్రమే Face ID ఆఫ్ చేయండి: పాస్‌వర్డ్ ఆటోఫిల్ వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎంపికలను ఆఫ్ చేయండి.

    • Face ID ఆఫ్ చేయండి: ‘Face ID రీసెట్ చేయండి’ ట్యాప్ చేయండి.

మీ డివైజ్ పోగొట్టుకుంటే లేదా దొంగిలించబడితే, మీరు Face IDని మీ డివైజ్‌ను అన్‌లాక్ చేయడానికి ఉపయోగించకుండా నివారించవచ్చు. డివైజ్‌ను పోగొట్టుకున్నట్లు Find Myలో మార్క్ చేయడం అనే ఆర్టికల్ చూడండి.

Face ID గురించి మరింత సమాచారం కోసం, Face ID అధునాతన టెక్నాలజీ పరిచయం అనే ఆర్టికల్ చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.