ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో పాడ్‌కాస్ట్స్ విడ్జెట్‌ను ఉపయోగించడం

మీరు పాడ్‌కాస్ట్స్ యాప్‌ ను తెరవకుండానే ఎపిసోడ్‌లను చూడటానికి, అలాగే ప్లే చేయడానికి పాడ్‌కాస్ట్స్ విడ్జెట్‌ను మీ హోమ్ స్క్రీన్‌కు జోడించవచ్చు. మీరు ‘తర్వాతది’ వరుస నుండి ఎపిసోడ్‌లను, సేవ్ చేయబడిన ఎపిసోడ్‌లను లేదా మీరు ఫాలో అయ్యే షో నుండి ఎపిసోడ్‌లను జోడించవచ్చు.

హోమ్ స్క్రీన్‌కు పాడ్‌కాస్ట్స్ విడ్జెట్‌ను జోడించడం

  1. యాప్‌లు జిగిల్ అవ్వడం మొదలయ్యే వరకు హోమ్ స్క్రీన్‌ను టచ్ చేసి ఉంచండి.

  2. స్క్రీన్‌కు ఎగువన ఎడిట్‌ను ట్యాప్ చేసి, ఆపై విడ్జెట్ గ్యాలరీని తెరవడానికి ‘విడ్జెట్‌ను జోడించండి’ని ట్యాప్ చేయండి.

  3. దిగువకు స్క్రోల్ చేసి, ఆపై పాడ్‌కాస్ట్స్ ట్యాప్ చేయండి.

  4. వేర్వేరు విడ్జెట్ సైజ్‌లు, లేఔట్‌లను చూడటానికి ఎడమ, కుడివైపు స్వైప్ చేయండి. మీకు కావలసిన ఎంపిక మీకు కనిపిస్తే, ‘విడ్జెట్‌ను జోడించండి’ ట్యాప్ చేసి, ఆపై పూర్తి ట్యాప్ చేయండి.

మీ హోమ్ స్క్రీన్‌కు విడ్జెట్‌ను తరలించడానికి, యాప్‌లు జిగిల్ అవ్వడం మొదలయ్యే వరకు హోమ్ స్క్రీన్‌ను టచ్ చేసి ఉంచండి. విడ్జెట్‌ను కొత్త లొకేషన్‌కు డ్రాగ్ చేసి, ఆపై ‘పూర్తి’ ట్యాప్ చేయండి.

మీ హోమ్ స్క్రీన్ నుండి విడ్జెట్‌ను తొలగించడానికి, యాప్‌లు జిగిల్ అవ్వడం మొదలయ్యే వరకు హోమ్ స్క్రీన్‌ను టచ్ చేసి ఉంచండి, ఆపై విడ్జెట్ ఎగువన ఎడమ వైపు ‘తొలగించండి’ బటన్ ట్యాప్ చేసి, తొలగించండి ట్యాప్ చేయండి.

దీన్ని కూడా చూడండిiPadలో పాడ్‌కాస్ట్‌లను వినడం
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.