ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో మీ రిమైండర్స్ సెట్టింగ్‌లను మార్చడం

మీరు సెట్టింగ్స్‌లో రిమైండర్స్ యాప్ కోసం మీ ప్రాధాన్యతలను కస్టమైజ్ చేయవచ్చు. కొత్త ఐటెమ్‌ల కోసం డిఫాల్ట్ జాబితాను ఎంచుకోండి, నోటిఫికేషన్‌లను అడ్జస్ట్ చేయండి, అలాగే మరెన్నో చేయండి.

మీ రిమైండర్స్ సెట్టింగ్‌లను కస్టమైజ్ చేయడం

  1. సెట్టింగ్స్  > యాప్స్ > రిమైండర్స్‌కు వెళ్ళండి.

  2. ఈ కింది వాటిలో దేనినైనా అడ్జస్ట్ చేయండి:

    • ఖాతాలు: రిమైండర్స్‌లో ఖాతాలను జోడించండి లేదా తొలగించండి.

    • Siri: మీరు రిమైండర్స్‌ను ఉపయోగించే విధానం ఆధారంగా యాప్‌లో సూచనలు ఇవ్వడానికి Siriని అనుమతించండి.

    • శోధన: శోధన, విడ్జెట్‌లలో కనిపించడానికి రిమైండర్స్ యాప్‌లో సూచనలు, కంటెంట్‌ను అనుమతించండి.

    • నోటిఫికేషన్‌లు: నోటిఫికేషన్ సెట్టింగ్స్ మార్చండి.

    • భాష: మీ ప్రాధాన్య భాషలను ఎంచుకోండి (అనేక భాషలను జోడించినప్పుడు మాత్రమే ఆ ఎంపిక కనిపిస్తుంది).

    • డిఫాల్ట్ జాబితా: నిర్దిష్ట జాబితా వెలుపల మీరు సృష్టించిన కొత్త రిమైండర్‌ల జాబితాను ఎంచుకోండి, ఉదాహరణకు మీరు Siri ఉపయోగించి సృష్టించిన రిమైండర్‌లు.

    • ఈరోజు నోటిఫికేషన్: తేదీ కేటాయించబడి, సమయం లేకుండా ఉన్న రోజంతా రిమైండర్‌ల కోసం నోటిఫికేషన్‌లను చూడటానికి సమయాన్ని సెట్ చేయండి.

    • గడువు ముగిసినట్లుగా చూపడం: గడువు ముగిసిన రోజంతా రిమైండర్‌ల కోసం షెడ్యూల్ చేసిన తేదీ ఎరుపుగా మారుతుంది.

    • ఈరోజు గడువు తేదీ ఉన్న వాటిని చేర్చడం: బ్యాడ్జ్ సంఖ్యలో గడువు ముగిసిన ఐటెమ్‌లు, ఈరోజు గడువు తేదీ ఉన్న ఐటెమ్‌లు ఉంటాయి.

    • నోటిఫికేషన్స్‌ను మ్యూట్ చేయడం: కేటాయించిన రిమైండర్‌ల కోసం నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి.

    • సూచనలను చూపడం: మీరు గతంలో పూర్తి చేసిన రిమైండర్‌తో సరిపోయే టెక్స్ట్‌ను టైప్ చేస్తే, ఆ రిమైండర్ సూచనగా కనిపిస్తుంది.

    • భాషను జోడించడం: కిరాణా ఐటెమ్‌లను ఆటోమేటిక్‌గా విభాగాలుగా మార్చడానికి రిమైండర్స్ ఉపయోగించే అదనపు భాషను సెట్ చేయండి.

    • కేటగిరీల హిస్టరీని క్లియర్ చేయడం: మీరు కిరాణా సామాన్ల జాబితాలలో ఐటెమ్‌లను మాన్యువల్‌గా తరలించినప్పుడు ఉపయోగించిన వర్గీకరణను క్లియర్ చేస్తుంది; ఇది మీరు షేర్ చేసిన మీ అన్ని డివైజ్‌లు, కిరాణా సామాన్ల జాబితాలకు వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న ఐటెమ్‌లు ప్రభావితం కావు.

దీన్ని కూడా చూడండిiPadలో సెట్టింగ్స్ వెతకడం
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.