ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో నోట్స్ యాప్‌కు ఫోటోలు, వీడియో మొదలైన వాటిని జోడించడం

నోట్స్ యాప్‌లో, మీరు ఫోటోలు, వీడియోలు, ఇతర యాప్‌ల నుండి మ్యాప్స్, లింక్‌లు, డాక్యుమెంట్‌ల వంటి సమాచారాన్ని జోడించవచ్చు.

ఫోటో లేదా వీడియోను జోడించడం

  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. నోట్స్‌లో, అటాచ్‌మెంట్ బటన్నొక్కండి, ఆపై ఆప్షన్ ఎంచుకోండి.

    మీరు మీ ఫోటో లైబ్రరీ నుండి ఫోటో లేదా వీడియోను ఎంచుకోవచ్చు లేదా కొత్త ఫోటో లేదా వీడియోను తీయవచ్చు.

చిట్కా: ఫోటోలో గీయడానికి, ఫోటోను ట్యాప్ చేసి, ఆపై చేతిరాత టూల్స్ బటన్ ట్యాప్ చేయండి.

నోట్స్‌లో తీసిన ఫోటోలు, వీడియోలను ఫోటోలు యాప్‌లో సేవ్ చేయడానికి, సెట్టింగ్స్  > యాప్‌లు > నోట్స్‌కు వెళ్ళండి, ఆపే ‘ఫోటోలను సేవ్ చేయండి’ని ఆన్ చేయండి.

మరో యాప్ నుండి సమాచారాన్ని నోట్‌కు జోడించడం

మీరు వేరే యాప్ నుంచి సమాచారాన్ని అటాచ్‌మెంట్‌గా నోట్‌కు జోడించవచ్చు-ఉదాహరణకు, మ్యాప్స్‌లోని లొకేషన్, Safariలోని వెబ్‌పేజీ, ఫైల్‌లలోని PDF లేదా స్క్రీన్‌షాట్ లాంటివి.

  1. మీరు ఉపయోగిస్తున్న యాప్‌లో, మీరు షేర్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌ను తెరవండి (ఉదాహరణకు, మ్యాప్ లేదా వెబ్‌పేజీ లాంటివి).

  2. షేర్ లేదా షేర్ బటన్ ట్యాప్ చేసి, ఆపై నోట్స్ యాప్ ట్యాప్ చేయండి.

  3. ఐటెమ్‌ను కొత్త నోట్‌లో సేవ్ చేయండి లేదా ఇప్పటికే ఉన్న నోట్‌ను ఎంచుకోండి.

అటాచ్‌మెంట్ ప్రివ్యూ సైజ్‌ను మార్చడం

  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. నోట్‌లో, మీరు ఈ కింది వాటి ప్రివ్యూ సైజ్‌ను మార్చవచ్చు:

    • సింగిల్ అటాచ్‌మెంట్: అటాచ్‌మెంట్‌ను టచ్ చేసి ఉంచండి, ఇలా చూడండిపై ట్యాప్ చేయండి, ఆపై చిన్నది లేదా పెద్దది ఎంచుకోండి.

    • నోట్‌లోని అన్ని అటాచ్‌మెంట్‌లు: మరిన్ని బటన్ ట్యాప్ చేయండి, అటాచ్‌మెంట్‌ను చూడండిపై ట్యాప్ చేయండి, ఆపై అన్నింటినీ చిన్నవిగా సెట్ చేయండి లేదా అన్నింటిని పెద్దవిగా సెట్ చేయండి ఎంచుకోండి.

నోట్స్‌లో అన్ని అటాచ్‌మెంట్‌లను చూడటం

  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. నోట్స్ జాబితా పైన, ఫోల్డర్ యాక్షన్‌ల బటన్ ట్యాప్ చేయండి, ఆపై ఫోటోల థంబ్‌నెయిల్‌లు, లింక్‌లు, డాక్యుమెంట్‌లు, ఇతర అటాచ్‌మెంట్‌లను చూడటానికి అటాచ్‌మెంట్‌లు చూడండిపై ట్యాప్ చేయండి. (లాక్ చేయబడిన నోట్స్‌లో అటాచ్‌మెంట్‌లు చూపబడవు.)

  3. నిర్దిష్ట అటాచ్‌మెంట్ ఉన్న నోట్‌కు వెళ్లడానికి, అటాచ్‌మెంట్ థంబ్‌నెయిల్‌ను ట్యాప్ చేసి, ఆపై నోట్‌లో చూపండి ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.