ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో టెక్స్ట్ రీప్లేస్‌మెంట్‌లతో కీస్ట్రోక్‌లను సేవ్ చేయడం

iPadలో, మీరు కొన్ని అక్షరాలను టైప్ చేయడం ద్వారా ఒక పదం లేదా పదబంధాన్ని నమోదు చేయడానికి ఉపయోగించగల టెక్స్ట్ రీప్లేస్‌మెంట్‌ను సెటప్ చేయండి. ఉదాహరణకు, “On my way!”ను నమోదు చేయడానికి “omw” అని టైప్ చేయండి ఇది మీ కోసం ఇప్పటికే సెటప్ చేయబడింది, కానీ మీకు సంబంధించినది కూడా జోడించవచ్చు.

టెక్స్ట్ రీప్లేస్‌మెంట్‌ను సృష్టించడం

  1. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • స్క్రీన్‌పై కనిపించే కీబోర్డ్‌తో: ఎమోజీ బటన్ లేదా ‘కీబోర్డ్‌ను మార్చండి’ కీ టచ్ చేసి ఉంచి, కీబోర్డ్ సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి, ఆపై ‘టెక్స్ట్ రీప్లేస్‌మెంట్’ ట్యాప్ చేయండి.

    • ఎక్స్‌టర్నల్ కీబోర్డ్‌తో: సెట్టింగ్స్  > సాధారణం > కీ‌బోర్డ్‌కు వెళ్ళి, ‘టెక్స్ట్ రీప్లేస్‌మెంట్’ను ట్యాప్ చేయండి.

  2. ఎగువ కుడి వైపున జోడించండి బటన్ను ట్యాప్ చేయండి.

  3. పదబంధం ఫీల్డ్‌లో ఒక పదబంధాన్ని దాని కోసం షార్ట్‌కట్ ఫీల్డ్‌లో ఉపయోగించాలనుకుంటున్న టెక్స్ట్ షార్ట్‌కట్‌ను టైప్ చేయండి.

మీరు ఉపయోగించే పదం లేదా పదబంధాన్ని సరిదిద్దాలనుకుంటున్నారా?

  1. సెట్టింగ్స్  > సాధారణం > కీ‌బోర్డ్‌కు వెళ్ళి, ‘టెక్స్ట్ రీప్లేస్‌మెంట్’ను ట్యాప్ చేయండి.

  2. ఎగువ కుడి వైపున జోడించండి బటన్ను ట్యాప్ చేసి, ఆపై మీ పదం లేదా పదబంధాన్ని పదబంధం ఫీల్డ్‌లో నమోదు చేయండి, కానీ షార్ట్‌కట్ ఫీల్డ్‌ను ఖాళీగా ఉంచండి.

పదం, ఇన్‌పుట్ పెయిర్‌ల కోసం టెక్స్ట్ రీప్లేస్‌మెంట్‌లను సృష్టించడం

కొన్ని చైనీస్ లేదా జపనీస్ కీబోర్డ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు పదం ఇన్‌పుట్ పెయిర్‌ల కోసం టెక్స్ట్ రీప్లేస్‌మెంట్‌ను సృష్టించవచ్చు. టెక్స్ట్ రీప్లేస్‌మెంట్ మీ వ్యక్తిగత డిక్షనరీకి జోడించబడుతుంది. మద్దతు ఉన్న కీబోర్డ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు పదం లేదా ఇన్‌పుట్ కోసం టెక్స్ట్ షార్ట్‌కట్‌ను టైప్ చేసినప్పుడు, షార్ట్‌కట్‌కు పెయిర్ చేసిన పదం లేదా ఇన్‌పుట్ ప్రత్యామ్నాయం అవుతుంది.

దిగువ పేర్కొన్న వాటి కోసం షార్ట్‌కట్‌లు అందుబాటులో ఉన్నాయి:

  • సరళీకృత చైనీస్: పిన్‌యిన్

  • సంప్రదాయ చైనీస్: పిన్‌యిన్, జుయిన్

  • జపనీస్: రోమాజీ, కానా

మీ ఇతర డివైజ్‌లలో మీ వ్యక్తిగత డిక్షనరీని అప్‌డేట్‌గా ఉంచడానికి iCloudను ఉపయోగించండి

సెట్టింగ్స్  > [మీ పేరు] > iCloudకు వెళ్ళి, iCloud Driveను ఆన్ చేయండి.

మీ వ్యక్తిగత డిక్షనరీని రీసెట్ చేయడం

  1. సెట్టింగ్స్  > సాధారణం > iPadను ట్రాన్స్‌ఫర్ లేదా రీసెట్ చేయండి > ‘రీసెట్’కు వెళ్ళి, ‘కీబోర్డ్ డిక్షనరీని రీసెట్ చేయండి’ ట్యాప్ చేయండి.

  2. ‘కీబోర్డ్ డిక్షనరీని రీసెట్ చేయండి’ ట్యాప్ చేయండి.

    అన్ని కస్టమ్ పదాలు, షార్ట్‌కట్‌లు డిలీట్ చేయబడి, కీబోర్డ్ డిక్షనరీ దాని డిఫాల్ట్ స్థితికి తిరిగి వస్తుంది.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.