ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

HomePod, ఇతర వైర్‌లెస్ స్పీకర్‌లలో iPad నుండి ఆడియోను ప్లే చేయడం

మీరు HomePod, Apple TV 4K, AirPlay 2-ఎనేబల్ చేసిన స్మార్ట్ TVలు, Bluetooth® హెడ్‌ఫోన్‌లు, స్పీకర్‌ల వంటి వైర్‌లెస్ డివైజ్‌లలో iPad నుండి ఆడియోను ప్లే చేయవచ్చు.

వైర్‌లెస్ డివైజ్‌లో iPad నుండి ఆడియోను ప్లే చేయడం

  1. మీ iPadలో పాడ్‌కాస్ట్స్ లేదా సంగీతం వంటి ఆడియో యాప్‌ను తెరవండి, ఆపై ప్లే చేయడానికి ఒక ఐటెమ్‌ను ఎంచుకోండి.

  2. ప్లేబ్యాక్ గమ్యస్థాన బటన్ ట్యాప్ చేసి, ఆపై ప్లేబ్యాక్ గమ్యస్థానాన్ని ఎంచుకోండి.

    నోట్: మీ AirPlay 2-ఎనేబల్ చేసిన డివైజ్‌లు ప్లేబ్యాక్ గమ్యస్థానాల జాబితాలో కనిపించకపోతే, అవి ఒకే Wi-Fi నెట్‌వర్క్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి. Bluetooth డివైజ్‌తో కనెక్ట్ చేసినప్పుడు, మీరు డివైజ్‌ను Bluetooth పరిధి నుండి కదిలిస్తే, ప్లేబ్యాక్ గమ్యస్థానం iPadకు తిరిగి వస్తుంది.

ప్లేబ్యాక్ గమ్యస్థానాన్ని ఎంచుకోవడానికి, మీరు లాక్ స్క్రీన్‌లో లేదా కంట్రోల్ సెంటర్‌లో ప్లేబ్యాక్ గమ్యస్థాన బటన్ కూడా ట్యాప్ చేయవచ్చు.

నోట్: Bluetooth ఆడియో డివైజ్‌ను సెటప్ చేయడం గురించి సమాచారం కోసం, మీ iPadను Bluetooth యాక్సెసరీతో పెయిర్ చేయడం చూడండి.

AirPlay 2-ఎనేబల్ చేసిన వివిధ డివైజ్‌లలో ఆడియోను ప్లే చేయడం

AirPlay 2, iPadతో, మీరు ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడిన వివిధ AirPlay 2-ఎనేబల్ చేసిన డివైజ్‌లలో ఆడియోను ప్లే చేయవచ్చు. ఉదాహరణకు, మీరు లివింగ్ రూమ్, కిచెన్‌లోని HomePod స్పీకర్‌లలో, బెడ్ రూమ్‌లోని Apple TV 4Kలో, డెన్‌లో AirPlay 2-ఎనేబల్ చేసిన స్మార్ట్ TVలో పార్టీ ప్లేలిస్ట్‌ను ప్లే చేయవచ్చు.

Siri: ఇలా ఏదైనా Siriని అడగండి:

  • “Stop playing music everywhere”

  • “Set the dining room volume to 10 percent”

  • “What’s playing in the kitchen?”

  • “Play a song I like in the kitchen”

  • “Add the living room speaker”

  • “Remove the music from the kitchen”

  • “Move the music to the den”

మీరు iPad స్క్రీన్ నుండి కూడా ప్లేబ్యాక్ గమ్యస్థానాలను ఎంచుకోవచ్చు.

  1. కంట్రోల్ సెంటర్‌లో, లాక్ స్క్రీన్‌లో లేదా మీరు వింటున్న యాప్ కోసం ఇప్పుడు ప్లే అవుతున్న స్క్రీన్‌లో ప్లేబ్యాక్ గమ్యస్థాన బటన్ ట్యాప్ చేయండి.

  2. మీరు ఉపయోగించాలనుకుంటున్న ప్రతి డివైజ్‌ను ఎంచుకోండి.

నోట్: స్టీరియో పెయిర్‌లో అమర్చబడిన డివైజ్‌లు ఒకే ఆడియో డివైజ్‌గా పరిగణించబడతాయి.

HomePod స్పీకర్‌లు, Apple TV 4K ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోవడానికి, HomePod యూజర్ గైడ్, Apple TV 4K యూజర్ గైడ్ చూడండి.

AirPlay 2-ఎనేబల్ చేసిన స్మార్ట్ TVల జాబితా కోసం, హోమ్ యాక్సెసరీల వెబ్‌సైట్ చూడండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.