ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో ‘అనువాదం’ యాప్‌లో కెమెరా వీక్షణతో టెక్స్ట్‌ను అనువదించడం

iPadలో, మీరు మీ చుట్టూ ఉన్న టెక్స్ట్‌ను అనువదించడానికి ‘అనువాదం’ యాప్‌లోని కెమెరా వీక్షణను ఉపయోగించవచ్చు—ఉదాహరణకు, రెస్టారెంట్ మెన్యూ లేదా వీధి సంకేతాలు. మీరు మీ ఫోటో లైబ్రరీ నుండి ఫోటోలలోని టెక్స్ట్‌ను కూడా అనువదించవచ్చు.

నోట్: మద్దతు ఉన్న భాషల కోసం అనువాదం అందుబాటులో ఉంది. iOS, iPadOS ఫీచర్ లభ్యత వెబ్‌సైట్ లో చూడండి.

స్పానిష్ నుండి ఇంగ్లీష్‌లోకి అనువదించబడిన టెక్స్ట్‌తో రెస్టారెంట్‌లో మెన్యూను చూపుతున్న కెమెరా స్క్రీన్.

కెమెరా వీక్షణను ఉపయోగించి టెక్స్ట్‌ను అనువదించడం

  1. మీ iPadలో అనువాదం యాప్ తెరవండి.

  2. ‘సైడ్‌బార్‌ను చూపండి’ బటన్ ట్యాప్ చేసి, ఆపై కెమెరాను ట్యాప్ చేయండి.

  3. మీరు ఎంచుకున్న టెక్స్ట్‌ను అనువదించాలనుకుంటున్న భాషపై ట్యాప్ చేయండి.

  4. వెనుకవైపు ఉన్న కెమెరా మీ చుట్టూ ఉన్న టెక్స్ట్‌ను అనువదించగలిగేలా iPadను పొజిషన్ చేయండి.

    నోట్: మీరు వెనుక కెమెరాను మూవ్ చేస్తున్నప్పుడు, టెక్స్ట్ రియల్ టైమ్‌లో అనువదించబడుతుంది.

  5. వీక్షణను పాజ్ చేయడానికి పిక్చర్ తీయండి బటన్ను ట్యాప్ చేయండి.

    ఓవర్‌లే చేసిన అనువాదాలను దగ్గరగా చూడటానికి మీరు జూమ్ ఇన్ చేయవచ్చు.

  6. అనువాద కార్డ్‌ను చూపడానికి ఓవర్‌లే చేసిన అనువాదాన్ని ట్యాప్ చేసి, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • అనువాదాన్ని కాపీ చేయడం: అనువదించబడిన టెక్స్ట్‌ను కాపీ చేయండి.

    • ‘ఇష్టపడినవి’కి జోడించడం: ‘ఇష్టపడినవి’ జాబితాకు అనువాదాన్ని జోడించండి.

    • ఒరిజినల్ టెక్స్ట్ వినడం: ‘మరిన్ని’ ట్యాప్ చేసి, ఆపై ఒరిజినల్ టెక్స్ట్ వినడానికి గ్రే ప్లే బటన్ను ట్యాప్ చేయండి.

    • అనువదించబడిన టెక్స్ట్‌ను వినడం: అనువదించబడిన టెక్స్ట్ వినడానికి బ్లూ ప్లే బటన్ను ట్యాప్ చేయండి.

  7. మీరు పూర్తి చేసిన తర్వాత, ‘ముగించండి’ బటన్ను ట్యాప్ చేయండి.

మీ ఫోటో లైబ్రరీలోని ఫోటోలలో ఉన్న టెక్స్ట్‌ను అనువదించడం

  1. iPadలో అనువాదం యాప్ కు వెళ్లండి.

  2. ‘సైడ్‌బార్‌ను చూపండి’ బటన్ ట్యాప్ చేసి, ఆపై కెమెరాను ట్యాప్ చేయండి.

  3. మీరు ఎంచుకున్న టెక్స్ట్‌ను అనువదించాలనుకుంటున్న భాషపై ట్యాప్ చేయండి.

  4. ఫోటో లైబ్రరీ బటన్ ట్యాప్ చేసి, ఆపై మీ ఫోటో లైబ్రరీ నుండి టెక్స్ట్ ఉన్న ఫోటోను ఎంచుకోండి.

  5. మీరు పూర్తి చేసిన తర్వాత, ‘ముగించండి’ బటన్ను ట్యాప్ చేయండి.

అనువదించబడిన ఇమేజ్‌ను షేర్ చేయడం, సేవ్ చేయడం

  1. మీ iPadలో అనువాదం యాప్ కు వెళ్ళండి.

  2. ‘సైడ్‌బార్‌ను చూపండి’ బటన్ ట్యాప్ చేసి, ‘కెమెరా’ ట్యాప్ చేసి, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • కెమెరా వీక్షణను ఉపయోగించడం: పిక్చర్ తీయండి బటన్ ట్యాప్ చేయండి.

    • మీ ఫోటో లైబ్రరీలోని ఫోటోను ఉపయోగించడం: ఫోటో లైబ్రరీ బటన్ ట్యాప్ చేసి, ఆపై ఫోటోను ట్యాప్ చేయండి.

  3. షేర్ బటన్ను ట్యాప్ చేసి, ఆపై దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • అనువాదాన్ని షేర్ చేయడం: షేర్ ఎంపికను ఎంచుకోండి.

    • అనువాదాన్ని ఇమేజ్‌గా సేవ్ చేయడం: ‘ఇమేజ్‌ను సేవ్ చేయండి’ ట్యాప్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.