ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో నోట్స్ సృష్టించడం, ఫార్మాట్ చేయడం

మీ ఆలోచనలు, ఐడియాలను మర్చిపోకుండా రాసుకోవడానికి లేదా చెక్‌లిస్ట్‌లు, ఇమేజ్‌లు, వెబ్ లింక్‌లు, స్కాన్ చేసిన డాక్యుమెంట్లు, చేతితో రాసిన నోట్స్ స్కెచ్‌లతో వివరణాత్మకంగా నమోదు చేయడానికి నోట్స్ యాప్‌ను ఉపయోగించండి. మీరు మీ నోట్‌ను విభాగాలు, హెడ్డింగ్‌లతో కూడా ఆర్గనైజ్ చేయవచ్చు.

#స్కూల్, #kine210 వంటి ట్యాగ్‌లతో క్లాస్ బ్రెయిన్‌స్టార్మ్ కోసం ఒక నోట్. నోట్‌లో నాలుగు-దశల శ్వాస చక్రాన్ని వివరించే బాక్స్ శ్వాస వ్యాయామానికి సంబంధించిన చేతితో గీసిన డ్రాయింగ్ ఉంది.

కొత్త నోట్‌ను సృష్టించడం

  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. కొత్త నోట్ బటన్ ట్యాప్ చేయండి, ఆపై మీ టెక్స్ట్‌ను నమోదు చేయండి.

    నోట్ మొదటి లైన్ నోట్ టైటిల్ అవుతుంది.

ఫార్మాటింగ్, చెక్‌లిస్ట్‌లు, టేబల్‌లను జోడించడం

  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. నోట్ రాసేటప్పుడు, ఈ కింది వాటిలో ఏదైనా చేయండి:

    • టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయడం కోసం: ఫార్మాట్ బటన్ ట్యాప్ చేసి, ఆపై హెడింగ్, బోల్డ్ లేదా ఇటాలిక్ ఫాంట్, హైలైట్ మొదలైన వాటిని ఎంచుకోండి.

    • చెక్‌లిస్ట్ చేయడం కోసం: చెక్‌లిస్ట్ బటన్ ట్యాప్ చేయండి.

    • టేబల్‌ను జోడించడం కోసం: టేబల్‌ను జోడించే బటన్ ట్యాప్ చేయండి.

విభాగాలు, హెడింగ్‌లతో నోట్‌ను ఆర్గనైజ్ చేయండి

మీరు విభాగాలను కుదించవచ్చు, విస్తరించవచ్చు, ఇది పెద్ద నోట్స్‌ను ఔట్‌లైన్ చేయడం, నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది.

స్క్రీన్ పైభాగంలో కుదించగల హెడ్డింగ్స్‌తో నోట్స్ యాప్‌లోని నోట్.
  1. మీ iPadలో నోట్స్ యాప్ కి వెళ్లండి.

  2. నోట్‌లో, హెడింగ్ కోసం టెక్స్ట్‌ను ఎంచుకోండి.

  3. ఫార్మాట్ బటన్ ట్యాప్ చేయండి, ఆపై హెడింగ్ లేదా సబ్‌హెడింగ్‌పై ట్యాప్ చేయండి.

  4. విభాగానికి కంటెంట్‌ను జోడించి, ఈ కింది వాటిలో ఏదైనా చేయండి:

    • విభాగాన్ని కుదించడం కోసం: కుదించే బటన్పై ట్యాప్ చేయండి.

    • విభాగాన్ని విస్తరించడం కోసం: విస్తరించే బటన్పై ట్యాప్ చేయండి.

నోట్స్‌లో రైటింగ్ టూల్స్ ను ఉపయోగించడం

Apple Intelligenceతో,* మీరు ఎంచుకున్న టెక్స్ట్‌ను ట్యాప్ చేసి సంక్షిప్తీకరించడానికి, మీ పనిని ప్రూఫ్ రీడ్ చేయడానికి, అలాగే మీకు సరైన పదాలు, భావాన్ని కనుగొనడంలో సహాయపడటానికి ఒకే టెక్స్ట్‌కు సంబంధించిన విభిన్న వెర్షన్‌లను సృష్టించడానికి మీరు రైటింగ్ టూల్స్ ఉపయోగించవచ్చు. Apple Intelligenceతో రైటింగ్ టూల్స్ ఉపయోగించడం చూడండి.

*Apple Intelligence ఈ కింది భాషలకు మద్దతుతో బీటాలో అందుబాటులో ఉంది: ఇంగ్లీష్, డానిష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, నార్వేజియన్, పోర్చుగీస్, స్పానిష్, స్వీడిష్, టర్కిష్, చైనీస్ (సరళీకృతం), చైనీస్ (సాంప్రదాయ), జపనీస్, కొరియన్, ఇంకా వియత్నామీస్. కొన్ని ఫీచర్‌లు అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు. భాష, ఫీచర్ లభ్యత, ఇంకా సిస్టమ్ అవసరాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, Apple Intelligenceను ఎలా పొందాలి అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.