ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలో పిక్చర్ ఇన్ పిక్చర్‌తో మల్టీ టాస్క్ చేయడం

పిక్చర్ ఇన్ పిక్చర్‌తో మీరు ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వీడియో చూడవచ్చు లేదా FaceTimeను ఉపయోగించవచ్చు.

FaceTime కాల్ సమయంలో లేదా వీడియోను చూస్తున్నప్పుడు, మినిమైజ్ వీడియో బటన్ ట్యాప్ చేయండి లేదా హోమ్ బటన్‌ను నొక్కండి (హోమ్ బటన్‌తో కూడిన iPadలో).

మీరు హోమ్ స్క్రీన్‌ను చూడటానికి, ఇతర యాప్‌లను తెరవడానికి వీలుగా వీడియో విండో సైజు ఒక మూలకు కుదించబడుతుంది. వీడియో విండో కనపడటంతో, మీరు ఈ కింది వాటిలో ఏదైనా చేయవచ్చు:

  • వీడియో విండోను రీసైజ్ చేయడానికి: చిన్న వీడియో విండోను పెద్దదిగా చేయడానికి, దూరానికి పించ్ చేయండి. దాన్ని మళ్ళీ కుదించడానికి, దగ్గరకు పించ్ చేయండి.

  • కంట్రోల్‌లను చూపడానికి, దాచడానికి: వీడియో విండోను ట్యాప్ చేయండి.

  • వీడియో విండోను తరలించడానికి: దీన్ని స్క్రీన్ వేరే మూలకు డ్రాగ్ చేయండి.

  • వీడియో విండోను దాచడానికి: దీన్ని స్క్రీన్ ఎడమ లేదా కుడి అంచుకు డ్రాగ్ చేయండి.

  • వీడియో విండోను మూసివేయడానికి: మూసివేయండి బటన్ ట్యాప్ చేయండి.

  • పూర్తి వీడియో స్క్రీన్‌కు తిరిగి వెళ్లడానికి: చిన్న వీడియో విండోలో పూర్తి స్క్రీన్‌ను రీస్టోర్ చేసే బటన్ నొక్కండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.