ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని Newsలో క్రాస్‌వర్డ్, క్రాస్‌వర్డ్ మినీ పజిల్స్ పరిష్కరించడం

Apple News+ సబ్‌స్క్రైబర్‌లు ప్రతిరోజూ కొత్త క్రాస్‌వర్డ్, క్రాస్‌వర్డ్ మినీ పజిల్‌కు యాక్సెస్ పొందుతారు. క్రాస్‌వర్డ్ పజిల్స్ సరళంగా మొదలవుతాయి కానీ, వారం గడిచే కొద్దీ కఠినమైన సవాలుగా మారతాయి. మీరు వెంటనే పరిష్కరించగలిగే పజిల్‌ను కావాలనుకుంటే, ఎల్లప్పుడూ-సులభమైన క్రాస్‌వర్డ్ మినీ పజిల్‌ను ప్రయత్నించండి.

మీరు క్రాస్‌వర్డ్, క్రాస్‌వర్డ్ మినీ పజిల్‌లకు అనేక మార్గాలలో చేరుకోవచ్చు, అలాగే వాటిని పరిష్కరించవచ్చు. ఉదాహరణకు, మీరు పజిల్‌లను సంప్రదాయ గ్రిడ్ వ్యూలో చూపవచ్చు లేదా బదులుగా జాబితాలో క్లూలు, సమాధానాలను చూపించడానికి ఎంచుకోవచ్చు. మీరు పదాలను ఎంచుకోవడానికి లేదా జాబితా నుండి క్లూలను ఎంచుకోవడానికి చతురస్రాలను ట్యాప్ చేయవచ్చు.

మీరు ఒకేసారి అన్ని పజిల్స్ పరిష్కరించాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా తిరిగి రావచ్చు. మీరు అందుబాటులో లేనప్పుడు టైమర్ పాజ్ చేయబడుతుంది.

నోట్: Apple News, Apple News+, పజిల్స్ అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేవు. iOS, iPadOS ఫీచర్ లభ్యత వెబ్‌సైట్ చూడండి.

ఎడమ వైపు క్లూలతో పాక్షికంగా నిండిన క్రాస్‌వర్డ్ పజిల్.

గ్రిడ్ వీక్షణలో పరిష్కరించడం

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. క్రాస్‌వర్డ్ లేదా క్రాస్‌వర్డ్ మినీ పజిల్స్ తెరవండి..

  3. పజిల్‌కు దిగువన ఉన్న క్లూ చూపడానికి స్క్వేర్ ట్యాప్ చేయండి, ఆపై జవాబును నమోదు చేయడానికి కీబోర్డ్‌ను ఉపయోగించండి. మీరు టైప్ చేస్తున్నప్పుడు ఇతర స్క్వేర్స్‌లోకి వెళ్తారు. మీరు మునుపటి లేదా తర్వాతి క్లూ కోసం వెళ్లడానికి, క్లూ పక్కన ఉన్న < or > కూడా ట్యాప్ చేయవచ్చు.

    కనిపించే కీబోర్డ్‌తో ఎగువకు లేదా దిగువకు మారడానికి లేదా అలా చేయకుండా ఉండటానికి, ఎంచుకున్న స్క్వేర్‌ను మళ్ళీ ట్యాప్ చేయండి లేదా క్లూని ట్యాప్ చేయండి.

జాబితా వ్యూలో పరిష్కరించడం

మీరు క్లూలు, సమాధానాలను సంప్రదాయ గ్రిడ్‌లో కాకుండా జాబితాలో చూపవచ్చు.

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. క్రాస్‌వర్డ్ లేదా క్రాస్‌వర్డ్ మినీ పజిల్స్ తెరవండి..

  3. జాబితా వీక్షణ బటన్ ట్యాప్ చేయండి.

గ్రిడ్ వీక్షణకు తిరిగి వెళ్లడానికి గ్రిడ్ వీక్షణ బటన్ ట్యాప్ చేయండి.

జాబితా వీక్షణలో పాక్షికంగా నింపిన క్రాస్‌వర్డ్ పజిల్.

క్లూలు, సమాధానాలు పొందటం

మీరు నమోదు చేసిన సమాధానంపై మీకు సందేహం ఉంటే, మీరు చిన్న సహాయం పొందవచ్చు.

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. క్రాస్‌వర్డ్ లేదా క్రాస్‌వర్డ్ మినీ పజిల్స్ తెరవండి..

  3. పజిల్స్ ఎంపికల బటన్ ట్యాప్ చేసి, ఆపై దిగువ వాటిలో ఏదైనా చేయండి:

    • తప్పు సమాధానాలను గుర్తించడానికి: ఆటోచెక్ ట్యాప్ చేయండి, స్క్వేర్ చెక్ చేయండి, పదాన్ని చెక్ చేయండి లేదా పజిల్‌ను చెక్ చేయండి.

    • సమాధానాలను వెల్లడించడానికి: రివీల్ ట్యాప్ చేసి, ఆపై సరైన సమాధానం చూపడానికి స్క్వేర్, పదం లేదా పజిల్‌ను ట్యాప్ చేయండి.

      నోట్: మీరు పజిల్ మొత్తాన్ని లేదా అందులోని కొంత భాగాన్ని వెల్లడించినప్పుడు, అది మీ స్కోర్‌బోర్డ్‌లోని గణాంకాలు లేదా స్ట్రీక్‌లో భాగంగా పరిగణించబడదు.

కొన్ని పజిల్స్‌కు సంబంధించిన క్లూలకు, ఇతర క్లూలతో సంబంధం ఉంటుంది. మీరు ఈ కనెక్షన్‌లను హైలైట్ చేయవచ్చు. మరిన్ని బటన్ ట్యాప్ చేసి, ఆపై ‘హైలైట్ చేయబడిన లింక్ క్లూలు’ ఆన్ చేయండి.

కొన్నిసార్లు క్రాస్ వర్డ్ గ్రిడ్‌లలో సర్కిల్‌లు ఉంటాయి. సర్కిల్‌లలోని లెటర్స్ ఆ పజిల్ థీమ్‌కు సంబంధించినవి.

ఎల్లప్పుడూ ఆటోచెక్ ఉపయోగించడం

మీరు పజిల్ లోపల ఆటోచెక్‌ను ఆన్ చేసినప్పుడు, అది ఆ పజిల్ కోసం మాత్రమే ఆన్‌లో ఉంటుంది. మీరు ఆటోచెక్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచాలనుకుంటే, ఈ దశలను అనుసరించండి:

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. క్రాస్‌వర్డ్ లేదా క్రాస్‌వర్డ్ మినీ పజిల్స్ తెరవండి..

  3. మరిన్ని బటన్ ట్యాప్ చేసి, సెట్టింగ్స్‌ను ఎంచుకోండి, ‘ఎల్లప్పుడూ ఆటోచెక్‌ చేయండి’ ఆన్ చేయండి, ఆపై ‘పూర్తి’ బటన్ ట్యాప్ చేయండి.

  4. పజిల్స్ ఎంపికల బటన్ ట్యాప్ చేసి, ఆపై ఆటోచెక్‌ను ఎంచుకోండి.

    మీరు దీన్ని ఆఫ్ చేసే వరకు ఆ రకమైనటువంటి అన్ని పజిల్స్ కోసం ఆటోచెక్ ఆన్‌లో ఉంటుంది.

ఒక వైపు క్లూలతో పాక్షికంగా నిండిన క్రాస్‌వర్డ్ మినీ పజిల్.

మీ పజిల్‌ను రీస్టార్ట్ చేయడం

మీరు కొత్తగా ప్రారంభించాలనుకుంటే, మీరు పజిల్ సమాధానాలను క్లియర్ చేసి, టైమర్‌ను రీసెట్ చేయవచ్చు.

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. క్రాస్‌వర్డ్ లేదా క్రాస్‌వర్డ్ మినీ పజిల్స్ తెరవండి.

  3. పజిల్స్ ఎంపికల బటన్ ట్యాప్ చేయండి.

  4. ’పజిల్‌ను క్లియర్ చేయండి’ ట్యాప్ చేయండి.

మీరు పజిల్ చుట్టూ తిరిగే విధానాన్ని మార్చడం

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. క్రాస్‌వర్డ్ లేదా క్రాస్‌వర్డ్ మినీ పజిల్స్ తెరవండి.

  3. మరిన్ని బటన్ ట్యాప్ చేసి, సెట్టింగ్స్‌ను ఎంచుకుని, ఆపై మీరు లెటర్ లేదా జవాబును నమోదు చేసినప్పుడు ఏమి జరగాలో ఎంచుకోండి:

    • తర్వాతి ఖాళీ స్క్వేర్‌కు వెళ్లడానికి: ’పూర్తి చేసిన స్క్వేర్‌లను దాటవేయండి’ని ఎంచుకోండి.

    • తర్వాతి స్క్వేర్‌లో ఇది నింపబడినా లేకపోయినా దానికి వెళ్లండి: ’పూర్తి చేసిన స్క్వేర్‌లను దాటవేయండి’ ఎంచుకోండి.

    • తర్వాతి క్లూకు వెళ్లడానికి: “పదం చివరలో” పక్కన, ‘పూర్తయితే ముందుకెళ్లండి’ లేదా ‘ఎల్లప్పుడూ ముందుకెళ్లండి’ని ఎంచుకోండి.

    • తర్వాతి క్లూకు వెళ్లవద్దు: “పదం చివరలో” పక్కన, ‘ముందుకు సాగవద్దు’ ఎంచుకోండి.

టైమర్‌ను చూపడం లేదా దాచడం

మీరు మీ పజిల్‌కు ఎగువన కనిపించే టైమర్‌ను చూపవచ్చు లేదా దాచవచ్చు.

  1. మీ iPadలో News యాప్ కు వెళ్ళండి.

  2. క్రాస్‌వర్డ్ లేదా క్రాస్‌వర్డ్ మినీ పజిల్స్ తెరవండి.

  3. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • టైమర్ బటన్ ట్యాప్ చేయండి.

    • మరిన్ని బటన్ ట్యాప్ చేసి, సెట్టింగ్స్ ఎంచుకోండి, ఆపై ’టైమర్‌ను చూపండి’ని ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.