ఈ కంట్రో‌ల్‌ను మారిస్తే, ఈ పేజీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది

iPadలోని రిమైండర్స్‌లో ఖాతాలను జోడించడం లేదా తొలగించడం

రిమైండర్స్ యాప్‌లో, మీరు iCloud, ఎంటర్‌ప్రైజ్ ద్వారా నిర్వహించబడే iCloud, Microsoft Exchange, Yahoo లాంటి అనేక ఖాతాలను ఉపయోగించవచ్చు, అలాగే మీ పూర్తి చేయాల్సిన జాబితాలన్నింటినీ ఒకే దగ్గర ఉంచవచ్చు. ఒకే ఖాతాను ఉపయోగించే మీ అన్ని డివైజ్‌లలో మీ రిమైండర్‌లు అప్‌డేట్‌గా ఉంటాయి.

నోట్: మీరు iCloudలో అప్‌డేట్ చేయబడిన రిమైండర్స్‌ను ఉపయోగిస్తే మాత్రమే ఈ గైడ్‌లో వివరించిన రిమైండర్స్ ఫీచర్‌లన్నీ అందుబాటులో ఉంటాయి. ఇతర ఖాతాలను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని ఫీచర్‌లు అందుబాటులో ఉండవు.

iCloudతో మీ అన్ని డివైజ్‌లలో మీ రిమైండర్స్‌ను అప్‌డేట్‌గా ఉంచడం

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్లండి.

  2. మీ పేరును ట్యాప్ చేయండి.

  3. iCloudను ట్యాప్ చేసి, ‘అన్నీ చూడండి’ని ట్యాప్ చేసి, ఆపై ‘రిమైండర్స్’ను ఆన్ చేయండి.

iCloud స్టోర్ చేసిన మీ రిమైండర్‌లు—మీరు వాటికి చేసిన ఏవైనా మార్పులు మీరు ఒకే Apple ఖాతాకు సైన్ ఇన్ చేసిన మీ iPhone, iPad, Apple Watch, Macలలో కనిపిస్తాయి.

iCloudలో స్టోర్ చేసిన మీ రిమైండర్‌లను అప్‌డేట్ చేయడం

మీరు iOS 12 లేదా అంతకు ముందు వెర్షన్‌తో రన్ అయ్యే డివైజ్‌లలో రిమైండర్స్‌ను ఉపయోగిస్తుంటే, అటాచ్‌మెంట్‌లు, ఫ్లాగ్‌లు, జాబితా రంగులు, చిహ్నాలు వంటి మరిన్ని ఫీచర్‌లను ఉపయోగించడానికి మీరు iCloudలో స్టోర్ చేసిన మీ రిమైండర్‌లను అప్‌డేట్ చేయాల్సి రావచ్చు.

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్లండి.

  2. మీ పేరును ట్యాప్ చేయండి.

  3. iCloudను ట్యాప్ చేసి, ‘అన్నీ చూడండి’ని ట్యాప్ చేసి, ఆపై ‘రిమైండర్స్’ ఆన్‌లో ఉందని నిర్ధారించుకోండి.

  4. రిమైండర్స్ యాప్ కి వెళ్ళండి.

  5. “రిమైండర్స్‌కు స్వాగతం” స్క్రీన్‌పై, దిగువ పేర్కొన్న ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోండి:

    • ఇప్పుడే అప్‌డేట్ చేయడం: అప్‌డేట్ ప్రాసెస్‌ను ప్రారంభించండి.

    • తర్వాత అప్‌డేట్ చేయడం: మీ జాబితాల ఎగువున నీలం అప్‌డేట్ బటన్ కనిపిస్తుంది; మీరు మీ రిమైండర్‌లను అప్‌డేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దానిని ట్యాప్ చేయండి.

నోట్: అప్‌డేట్ చేయబడిన రిమైండర్‌లకు iOS, macOS పాత వెర్షన్‌లలోని రిమైండర్స్ యాప్‌లో మద్దతు ఉండదు. iOS 13 లేదా తర్వాతి వెర్షన్‌తో రన్ అయ్యే డివైజ్‌లలో రిమైండర్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం అనే Apple మద్దతు ఆర్టికల్ చూడండి.

ఇతర ఖాతాలను జోడించడం

మీరు Microsoft Exchange, Yahoo వంటి ఇతర ఖాతాలలో మీ పూర్తి చేయాల్సిన జాబితాలను నిర్వహించడానికి రిమైండర్స్ యాప్‌ను ఉపయోగించవచ్చు.

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. యాప్స్‌ను ట్యాప్ చేసి, ఆపై ‘రిమైండర్స్’ ట్యాప్ చేయండి.

  3. ‘ఖాతాలు’ను ట్యాప్ చేసి, ఆపై ‘ఖాతాను జోడించండి’ని ట్యాప్ చేయండి.

  4. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • ఖాతా ప్రొవైడర్‌ను ఎంచుకొని, ఆపై మీ ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.

    • మీ ఖాతా ప్రొవైడర్ జాబితా చేయబడి లేకపోతే, ’ఇతరం’ ట్యాప్ చేయండి, ‘CalDAV ఖాతాను జోడించండి’ని ట్యాప్ చేసి, మీ ఖాతా సమాచారాన్ని నమోదు చేసి, ఆపై ఆ ఖాతా కోసం రిమైండర్స్‌ను ఆన్ చేయండి.

ఖాతాను తొలగించడం

మీరు ఖాతాను తొలగించినప్పుడు లేదా డిలీట్ చేసినప్పుడు, ఆ ఖాతాలోని రిమైండర్స్ ఇకపై మీ iPadలో కనిపించవు. రిమైండర్స్ మీ ఇంటర్నెట్ ఖాతాలో (ఉదాహరణకు, iCloud.com లేదా Microsoft Exchange), మీరు ఇప్పటికే సెటప్ చేసిన ఇతర డివైజ్‌లలో అలానే ఉంటాయి.

  1. మీ iPadలోని సెట్టింగ్స్ యాప్ కి వెళ్ళండి.

  2. యాప్స్‌ను ట్యాప్ చేసి, ఆపై ‘రిమైండర్స్’ ట్యాప్ చేయండి.

  3. ‘రిమైండర్స్ ఖాతాలు’ను ట్యాప్ చేసి, ఆపై మీరు తొలగించాలనుకునే ఖాతాను ట్యాప్ చేయండి.

  4. దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

    • రిమైండర్స్‌ను ఆ ఖాతాతో ఉపయోకుండకుండా ఆపివేయడం: రిమైండర్స్‌ను ఆఫ్ చేయండి.

      మీరు క్యాలెండర్ లాంటి ఇతర సర్వీస్‌ల కోసం ఆ ఖాతాను ఉపయోగించడం కొనసాగించవచ్చు.

    • ఖాతాతో అన్ని సర్వీస్‌లను ఉపయోగించడం ఆపివేయడం: సైన్ ఔట్ (iCloud ఖాతా కోసం) లేదా ఖాతా డిలీట్‌ను చేయండిపై (ఇతర ఖాతాల కోసం) ట్యాప్ చేయండి.

      మీకు సైన్ ఔట్ లేదా డిలీట్ చేసిన ఖాతా కనిపించకపోతే, మీ ఖాతా మీ సంస్థ ద్వారా నిర్వహించబడవచ్చు. తొలగింపు సూచనల కోసం అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.